భారత స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా ఉన్న నష్టాలకు అడ్డుకట్ట వేస్తూ నిఫ్టీ 26,200 మార్కును దాటగా సెన్సెక్స్(sensex) ఏకంగా 1000 పాయింట్లకు పైగా లాభపడింది. ఒక్క రోజులోనే మదుపరుల సంపద దాదాపు రూ. 4.23 లక్షల కోట్లు పెరగడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం మార్కెట్ సూచీలు రికార్డులకు చేరువలో ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు తమ ఆల్‌టైమ్ హయ్యెస్ట్ కు అత్యంత చేరువలో ఉన్నాయి. సెన్సెక్స్ సెప్టెంబర్ 27, 2024 నాడు తాకిన తన రికార్డు స్థాయి 85,978కి కేవలం 300 పాయింట్ల దూరంలో ఉంది. నిఫ్టీ 50.. సెప్టెంబర్ 2024 నాటి తన గరిష్ఠ స్థాయి 26,277 కి 150 పాయింట్ల దూరంలో ఉంది . ఈ భారీ జంప్ కు ప్రధాన కారణం US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే వార్తలు రావడమే. దీంతోపాటు మరికొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కారణాలివే..
- అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్ల తగ్గింపు: US ఫెడ్ డిసెంబర్ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బలపడడంతో విదేశీ పెట్టుబడులు (FIIs) తిరిగి భారత్‌కు వచ్చేందుకు మొగ్గు చూపాయి. దీంతో మార్కెట్ భారీగా ర్యాలీ అయింది.
- అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్ గా: US ఫెడ్ రేట్ తగ్గింపు అంచనాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా పరుగులు తీశాయి. వాల్ స్ట్రీట్‌లో లాభాల ప్రభావంతో మన మార్కెట్లు కూడా బలపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొనడం పెట్టుబడిదారులకు ధైర్యాన్ని ఇచ్చింది.
- చమురు ధరల తగ్గుదల: భారతదేశానికి ముడి చమురు (Crude Oil) ధరలు తగ్గడం అత్యంత సానుకూల అంశం. అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక నెల కనిష్ట స్థాయికి దగ్గరగా ఉన్నాయి. చమురు ధర తగ్గితే దేశం యొక్క దిగుమతి బిల్లు తగ్గుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా చమురును ముడిసరుకుగా ఉపయోగించే సంస్థలకు పెద్ద ఊతం ఇస్తుంది.
- విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు: సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ 25 నాడు విదేశీ పెట్టుబడిదారులు రూ. 785 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
- కార్పొరేట్ ఆదాయాల్లో మెరుగుదల (Earnings Bottoming Out): సెప్టెంబర్ 2024 తర్వాత కార్పొరేట్ కంపెనీల ఆదాయ అంచనాలు మెరుగుపడ్డాయి. ముడిసరుకు ధరలు తగ్గడం వలన కంపెనీల లాభాల మార్జిన్ పెరిగే అవకాశం ఉంది.
- అన్ని రంగాల్లో కొనుగోళ్ల జోరు: ఈ రోజు ర్యాలీ కేవలం కొన్ని పెద్ద షేర్లకు మాత్రమే పరిమితం కాలేదు. లార్జ్-క్యాప్ షేర్లతో పాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ఒక శాతం పైగా లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి భారీ షేర్లలో బలమైన పెరుగుదల నిఫ్టీకి ప్రధాన బలాన్ని ఇచ్చింది.
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రేటు కోత అంచనాలు: ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో RBI కూడా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని మార్కెట్ ఆశిస్తోంది. ఈ అంశాలు కూడా బలమైన లాభాలను నమోదు చేశాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications