Sensex-Nifty Fall: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త వారాన్ని నష్టాల్లో ప్రారంభించాయి. వాస్తవానికి శుక్రవారం అధిక ఓలటాలిటీని చూసిన తర్వాత నేడు మార్కెట్లలో క్షీణత కొనసాగింది. గ్లోబల్ మార్కెట్లలో సైతం సూచీలు నీరసంగా ఉంటంతో అదే ధోరణి దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ కనిపించింది.
వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు డిసెంబర్ 17-18న జరగనున్న యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు సమావేశంలో ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లు నేడు రెడ్‌లో ట్రేడవుతున్నాయి. ఇదే క్రమంలో చైనా, హాంకాంగ్, తైవాన్, జపాన్ మార్కెట్లు తమ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రధానంగా అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగటంపై ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్‌లో రిటైల్ అమ్మకాలు 4.6 శాతానికి వ్యతిరేకంగా 3 శాతం వృద్ధిని చూపుతూ చైనా విడుదల చేసిన గణాంకాలు సైతం సెంటిమెంట్లను దెబ్బతీశాయని పెట్టుబడిదారులు చెబుతున్నారు.

F&O సెగ్మెంట్‌లలోని భారీ స్థానాలు మార్కెట్‌లో అస్థిరతలకు కారణంగా నిలుస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్, VK విజయకుమార్ పేర్కొన్నారు. నేడు ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పతనాన్ని చూసింది. డిసెంబరులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలుదారులుగా మారినప్పటికీ వారు ఇదే కొనుగోళ్ల ధోరణిని కొనసాగిస్తారని నమ్మకంగా చెప్పలేమని విజయకుమార్ చెప్పారు. దీనికి తోడు దేశీయంగా జీడీపీ వృద్ధి రేటు మందగించటం బుల్ మార్కెట్లు కొనసాగటానికి అడ్డంకులుగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మధ్యాహ్నం 2.47 గంటల సమయానికి మార్కెట్లు నష్టాల నుంచి కొంత మేర రికవర్ అయ్యాయి. దీంతో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 332 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 93 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 68 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 409 పాయింట్ల పెరుగుదలను చూసింది. డిసెంబర్ 2025 నాటికి నిఫ్టీ సూచీ 26,600 మార్కును అందుకుంటుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ పేర్కొంది. ఈ క్రమంలో జెఫరీస్ బ్యాంకింగ్, టెల్కోలు, ద్విచక్ర వాహనాలు, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్, ఐటీ & పవర్ రంగాల షేర్లపై అధిక బరువును కలిగి ఉంది.
ప్రభుత్వ ఖర్చు విధానాలు సాధారణ స్థితికి రావడంతో పాటు మంచి రుతుపవనాల వర్షపాతం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని జెఫరీస్ తన అంచనాల్లో వెల్లడించింది. విస్తృత క్యాపెక్స్ సైకిల్ సానుకూలతలు తిరిగి పుంజుకుంటాయని తాము భావిస్తున్నట్లు విదేశీ బ్రోకరేజ్ వెల్లడించింది. ఈ క్రమంలో డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో టైటాన్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందాల్కొ, ఎయిర్ టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల్లో టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications