Muhurat Trading 2024: దేశవ్యాప్తంగా ట్రేడర్లు ఎంతగానో ఎదురుచూసిన ముహురత్ ట్రేడింగ్ నేడు విజయవంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహించబడిన స్పెషల్ ట్రేడింగ్ ఆశాజనకంగా లాభాలతో ముగియటం మార్కెట్లలో సంవత్ 2081 సానుకూల ధోరణితో ప్రారంభాన్ని నమోదు చేసింది.
భారతీయ స్టాక్ మార్కెట్లలో దీర్ఘకాలంగా సంప్రదాయమైన ముహూరత్ ట్రేడింగ్ ఈసారి సంవత్ 2081లో వచ్చే దీపావళి పండుగ, హిందూ నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. సాయంత్రం కేవలం ఒక గంట పాటు నిర్వహించబడే ఈ సింబాలిక్ ట్రేడింగ్ సెషన్ రాబోయే సంవత్సరానికి పెట్టుబడిదారులు, వ్యాపారులకు శ్రేయస్సుతో పాటు విజయాన్ని తెస్తుందని నమ్ముతారు. గతంలో జరిగిన ముహురత్ ట్రేడింగ్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే 10 సంవత్సరాల్లో 8 సార్లు మార్కెట్లు సానుకూలంగా లాభాల్లో ప్రయాణాన్ని ముగించి ఇన్వెస్టర్లకు శుభశూచికంగా నిలిచింది.

నేడు స్పెషల్ ట్రేడింగ్ ప్రారంభానికి ముందు ప్రీ ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ సూచీ దాదాపు 600 పాయింట్ల లాభంతో ఉంది. అయితే మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 335 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 99 పాయింట్ల మేర లాభాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లలో అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాలతో ముగిశాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 199 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 382 పాయింట్ల మేర లాభంతో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి. అలాగే జొమాటో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ టాప్ గెయినర్ల జాబితాలో నేడు నిలిచాయి.
నిఫ్టీ అత్యధికంగా లాభపడగా ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు ఉన్నాయి. ఇదే క్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సిఎల్ టెక్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో ఆటో ఇండెక్స్ 1 శాతం పెరగగా.. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి. మార్కెట్ నిపుణులు సైతం రానున్న మిడ్ నుంచి లాంగ్ టర్మ్ కాలానికి మార్కెట్లు రెండంకెల వృద్ధితో రాబడులను అందించగలవని అంచనా వేస్తున్నారు. అలాగే తొలిసారిగా ఇన్వెస్టర్లు ముహురత్ ట్రేడింగ్ సమయంలో ఈక్విటీలతో పాటు బాండ్ల ట్రేడింగ్ నిర్వహించటానికి ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అవకాశం కల్పించాయి. ఇటీవలి కాలంలో పెట్టుబడిదారులకు ఇన్వెస్టర్లు సంపద సృష్టికి బాండ్లు అందుబాటులోకి వస్తున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications