Senores Pharmaceuticals IPO: 2024 ముగియటానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పటికి దలాల్ స్ట్రీట్ నష్టాలను అస్సలు లెక్కచేయకుండా ఐపీవోలు వరుసగా వస్తూ రద్దీని పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో చాలా ఐపీవోలు మెుదటి రోజే తమ పెట్టుబడిదారలుకు ఊహించని లాభాలను తెచ్చిపెడుతూ బెట్టింగ్ వేసి వారి భవితవ్యాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ కేటగిరీలో వచ్చిన కంపెనీ ఐపీవో నేడు ఎన్ఎస్ఈ బీఎస్ఈలలో ఏకకాలంలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు అడుగుపెడటంతోనే భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ షేర్లు బీఎస్ఈలో ఒక్కోటి 52 శాతం ప్రీమియం ధర రూ.593.70 వద్ద జాబితా చేయబడ్డాయి. ఇదే క్రమంలో ఎన్ఎస్ఈలో స్టాక్ 53 శాతం ప్రీమియం ధర రూ.600 వద్ద గ్రాండ్ లిస్టింగ్ నమోదు చేసింది. అయితే లిస్టింగ్ తర్వాత కొద్ది నిమిషాల్లోనే స్టాక్ ఎన్ఎస్ఈలో 1.08 శాతం క్షీణతను చూడగా.. బీఎస్ఈలో 3 శాతానికి పైగా పతనమైంది. ప్రధానంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటమే దీనికి కారణంగా తెలుస్తోంది.

సెనోర్స్ ఫార్మా కంపెనీ ఐపీవో మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో షేర్లు ఏకకాలంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టింగ్ కానున్నాయి. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.582.11 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో రూ.500 కోట్లకు ఫ్రెష్ ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తుండగా.. మిగిలిన రూ.82.11 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో సమీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఐపీవో బెట్టింగ్ వేయాలనుకునే ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 24 వరకు అందుబాటులో ఉందని కంపెనీ వెల్లడించింది. ఐపీవో కోసం తమ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.372 నుంచి రూ.391గా నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ తన లాట్ పరిమాణాన్ని 38 షేర్లుగా నిర్ణయించింది. ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ ఐపీవోలో లాట్ కొనుగోలు చేయటం కోసం ప్రస్తుతం రూ.14,858 వెచ్చించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.260.63 కోట్లను విజయవంతంగా సమీకరించింది.
సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. బిడ్డింగ్ చివరి రోజున కంపెనీ ఐపీవో 93.69 రెట్లు సబ్ స్క్రిప్షన్ అందుకుంది. అందుబాటులో ఉన్న ఎన్ఎస్ఈ డేటా ప్రకారం.. ఐపీవోలో కంపెనీ విక్రయానికి 85,34,681 షేర్లను అందుబాటులో ఉంచగా మొత్తం 79,95,96,646 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 96.30 రెట్లు సబ్‌స్క్రయిబ్ కాగా.. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ కేటగిరీ 94.66 రెట్లు సబ్‌స్క్రైబ్ అందుకుంది. అలాగే రిటైల్ పెట్టుబడిదారుల కేటగిరీ కూడా భారీగా 90.46 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
కంపెనీ వ్యాపారం..
అహ్మదాబాద్, గుజరాత్‍లో కంపెనీ తయారీ యూనిట్ కలిగి ఉంది. డిసెంబరు 2017లో స్థాపించబడిన సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ప్రధానంగా అమెరికా, కెనడా, యూకే నియంత్రిత మార్కెట్‌ల కోసం అనేక రకాల ఔషధ ఉత్పత్తులను అభివృద్ధి, తయారు చేస్తుంది. ఇదే క్రమంలో కంపెనీ అనేక అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లకు కూడా సేవలు అందిస్తోంది. గడచిన త్రైమాసికం చివరి నాటికి యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ ట్రీట్‌మెంట్‌లతో సహా కీలకమైన చికిత్సా రంగాల్లో కంపెనీ 55 ఉత్పత్తులను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలలో పంపిణీదారులు, ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని కంపెనీ ఏర్పరచుకుంది. అలాగే ఇండియా, అమెరికాలో మూడు ప్రత్యేక R&D సౌకర్యాలను కలిగి ఉంది. అలాగే 43 దేశాల్లో ఎమర్జింగ్ మార్కెట్‌ల్లో పనిచేస్తుం, క్రిటికల్ కేర్ ఇంజెక్టబుల్స్, ఏపీఐలను తయారు చేస్తోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications