Trafiksol IPO: దేశీయంగా ఐపీవోల కోలాహలం నడుస్తోంది. ఏడాది చివరికి వచ్చినప్పటికీ కొత్తగా మార్కెట్లోకి వస్తున్న కంపెనీల జాబితా మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎక్కువగా ఎస్ఎమ్ఈ ఐపీవోలు రావటం మనం గమనిస్తూనే ఉన్నాం. వీటితో జగ జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెబీ సంచలన నిర్ణయం తీసుకుంటూ ఒక కంపెనీ ఐపీవోను క్యాన్సీల్ చేయటం దలాల్ స్ట్రీల్‍లో పెద్ద చర్చకు దారితీసింది.
అసలు సెబీ ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుంది. దీనికి దారితీసిన పరిణామాలను పరిశీలిస్తే.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ట్రాఫిక్సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.45 కోట్లు సమీకరించటానికి ఎస్ఎమ్ఈ కేటగిరీలో తన ఐపీవోను ప్రారంభించింది. అయితే మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ షేర్ల లిస్టింగ్ నిలిపివేసిన తర్వాత ప్రస్తుతం సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఐపీవో కోసం ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మెుత్తాన్ని వారం లోపు తిరిగి రిఫండ్ చేయాల్సిందేనని ఆదేసిస్తూ ఈ ప్రక్రియను పూర్తిగా బీఎస్ఈ పర్యవేక్షించాలని తన ఆర్డర్‍లో పేర్కొంది.

ఐపీవోలో పెట్టుబడిదారులకు దాదాపు షేర్లు అలాట్ అయ్యి 3 నెలలు గడవటంపై సెబీ హోల్ టైమ్ మెంబర్ అశ్వనీ భాటియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు ఆలస్యాల కారణంగా మరింతకాలం జాప్యం చేయటం భావ్యం కాదని, ప్రస్తుతం కంపెనీని పెట్టుబడిదారులకు సంబంధించిన ఐపీవో డబ్బును తిరిగి వెనక్కి ఇవ్వమనటం సరైన నిర్ణయంగా పేర్కొన్నారు. వాస్తవానికి సెబీ దర్యాప్తులో ట్రాఫిక్సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ ప్రాస్పెక్టస్‌లో మెటీరియల్ మిస్టేట్‌మెంట్‌లతో పాటు 'షెల్ ఎంటిటీ'తో కుమ్మక్కైందని అనుమానం తర్వాత తాజా ఆర్డర్ వచ్చింది.
వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ మెుదటి వారంలో కంపెనీ ఐపీవో ఇన్వెస్టర్ల ముందుకు వచ్చింది. అయితే ఇన్వెస్టర్ల నుంచి భారీగా దీనికి స్పందన రావటంతో గ్రేమార్కెట్లో లిస్టింగ్ గెయిన్స్ 115 శాతం వరకు అంచనా వేయబడింది. అయితే సెప్టెంబర్ 17న కంపెనీ తన ఐపీవోను వాయిదా వేస్తున్నట్లు బీఎస్ఈ సంచలన ప్రకటన విడుదల చేయటంతో ఐపీవోకు పెద్ద బ్రేక్ పడింది. ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బును కంపెనీ వినియోగించుకోవటానికి ప్రస్తుతం అనుమతి లేదని అప్పట్లో బీఎస్ఈ ఆదేశించిన సంగతి తెలిసిందే. కంపెనీపై వచ్చిన ఫిర్యాదులు పరిష్కరింపబడే వరకు ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమచేయాలని బీఎస్ఈ ఆదేశించింది. అయితే నెలలు గడుస్తున్న దర్యాప్తు కొనసాగటంతో తాజాగా సెబీ ఈ డబ్బును కంపెనీ ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చేయాలని తన ఆదేశాల్లో స్పష్టం చేయటం గమనార్హం.
ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.44.87 కోట్లను సమీకరించాలని లక్ష్యంతో ఇష్యూని ప్రారంభించింది. దీనిలో భాగంగా పెట్టుబడిదారులకు సెప్టెంబర్ 10-12 వరకు సబ్‌స్క్రిప్షన్ అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం పూర్తిగా 64.10 లక్షల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేసింది. లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా ఉంచిన కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.65-70గా ప్రకటించింది.
కంపెనీ వ్యాపారం..
ట్రాఫిక్సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ 2018లో స్థాపించబడింది. కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కన్సల్టింగ్ అండ్ డెలివరీ సేవలతో సహా సమగ్ర తెలివైన రవాణా వ్యవస్థలు, ఆటోమేషన్ సొల్యూషన్‌లను అందిస్తోంది. కంపెనీ అన్ని ప్లాట్‌ఫారమ్‌ల కోసం రెడీమేడ్ అనుకూలీకరించిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లు, బిజినెస్ అప్లికేషన్‌లు, కంప్యూటర్ గేమ్‌లను అందిస్తుంది. ట్రాఫిక్సోల్ అనేది అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, టోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, టన్నెల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ వంటి అనేక రకాల ప్రాజెక్ట్‌లను నిర్వహించే ప్రత్యేక ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్ సేవలను అందిస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications