రూ.4,800 కోట్ల ఫ్రాడ్, మళ్లీ స్టాక్ మార్కెట్లోకి జేన్ స్ట్రీట్‌ ఎంట్రీ, ఒక్కసారిగా బీఎస్ఈ షేర్లకు జోష్

భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రముఖ లిక్విడిటీ ప్రొవైడర్ జేన్ స్ట్రీట్‌పై ఉన్న నిషేధం ఎత్తివేసారనే వార్తల మధ్య బీఎస్ఈ లిమిటెడ్ షేర్లు సోమవారం దూసుకుపోయాయి. దాదాపు 2.9% పెరిగి ఎన్ఎస్ఈలో రూ.2,519 వద్ద ముగిశాయి. జూలై 14 గడువుకి ముందు రూ. 4,844 కోట్ల చట్టవిరుద్ధ లాభాలను ఎస్క్రో ఖాతాలో జమచేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. జేన్ స్ట్రీట్‌కు భారత మార్కెట్లలో ట్రేడింగ్ అనుమతి లభించినట్లుగా బిజినెస్ స్టాండర్డ్ కథనాన్ని వెలువరించింది.ఈ కథనంలో సెబీ అధికారికంగా జేన్ స్ట్రీట్‌కు మార్కెట్ యాక్సెస్ పరిమితులు ఎత్తివేసినట్లు తెలిపింది.

ఈ నెల ప్రారంభంలో డెరివేటివ్స్ విభాగంలో గడువు తేదీల్లో సూచీ కదలికలను తారుమారు చేయడం ద్వారా మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందని సెబీ ఆరోపణలతో Jane Street ట్రేడింగ్‌కు నిషేధం విధించింది. జనవరి 2023 నుండి మార్చి 2025 వరకు జేన్ స్ట్రీట్ ఈ అవకతవకల ద్వారా రూ.36,502 కోట్ల లాభాలు పొందిందని దర్యాప్తులో తేలింది. అందులో ఇండెక్స్ ఆప్షన్లలో రూ.43,289 కోట్లు ఆర్జించినట్లు బయటపడ్డాయి.

BSE share rally Jane Street India trading SEBI clearance Indian stock market news derivatives trading NSE BSE updates Jane Street escrow deposit market liquidity boost Indian stock exchange stock market headlines BSE Jane Street

క్యాష్, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో రూ.7,687 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. వీటిలో రూ.4,840 కోట్లను "చట్టవిరుద్ధ లాభాలు"గా సెబీ ఫ్రీజ్ చేసింది. జేన్ స్ట్రీట్ ట్రేడింగ్ ఆగిపోవడంతో NSEలో ఇండెక్స్ ఆప్షన్ ప్రీమియం టర్నోవర్ గణనీయంగా పడిపోయింది. జూలై 17 వారాంతపు గడువు రోజున టర్నోవర్ రూ. 39,625 కోట్లకు పడిపోయింది. ఇది జూన్ నెల సగటు రూ. 60,605 కోట్ల కంటే 35% తక్కువ అని చెప్పుకోవచ్చు.

ఇక జేన్ స్ట్రీట్‌పై సెబీ చేసిన దర్యాప్తులో 18 గడువు ట్రేడ్లలో 15 అవకతవకలకు సంబంధించిన ఆధారాలు కనుగొంది. 2024 జనవరి 17న కంపెనీ రూ.734.93 కోట్ల లాభాలు కేవలం ఒకే ఒక రోజులో ఆర్జించింది. ఉదయం బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, ఫ్యూచర్స్‌లో రూ. 4,370 కోట్ల విలువైన భారీ కొనుగోళ్లు చేయడం..వెంటనే వాటిని విక్రయించడం ద్వారా సూచీని కుదిపేసింది. దాని బారిన పడిన రిటైల్ ఇన్వెస్టర్లను జేన్ స్ట్రీట్‌ తప్పుదారి పట్టించింది.

ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో సంస్థ రూ.4,370 కోట్ల విలువైన బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కొనుగోలు చేయగా, అదే సమయంలో రూ.32,115 కోట్ల విలువైన ఆప్షన్స్ను విక్రయించింది. అయితే, రోజు రెండవ భాగంలో జేన్ స్ట్రీట్ తన వ్యూహాన్ని మార్చి, రూ.5,372 కోట్ల విలువైన బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ను విక్రయించింది. ఈ సమన్వయ చర్య ఫలితంగా రూ.46,620 కోట్ల విలువైన పీక్ షార్ట్ ఆప్షన్ పొజిషన్ ఏర్పడింది, ఇది మార్కెట్ అస్థిరతని మరింత పెంచినట్లు విశ్లేషకులు తెలిపారు.

తదనంతర పరిణామాల మధ్య జేన్ స్ట్రీట్ ఎస్క్రో డిపాజిట్ పూర్తి చేసిన తర్వాత తమపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయమని సెబీకి విజ్ఞప్తి చేసింది. జూలై 3న మధ్యంతర ఉత్తర్వు ప్రకారం దీనికి సెబీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్‌లో మళ్లీ గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఎక్స్ఛేంజీలు దాని ట్రేడింగ్‌ను నిశితంగా పర్యవేక్షించనున్నాయి.

ఎస్క్రో డిపాజిట్ అంటే ఏమిటి?: ఎస్క్రో డిపాజిట్ అనేది ఒక ఒప్పందంలో, లావాదేవీకి సంబంధించిన డబ్బు లేదా ఆస్తులను, స్వతంత్ర మూడవ పక్షం (ఎస్క్రో ఏజెంట్) ద్వారా ఉంచే ఒక ప్రక్రియ. ఈ ఏజెంట్ ఒప్పందంలో పేర్కొన్న షరతులు నెరవేరే వరకు వాటిని భద్రంగా ఉంచుతారు. షరతులు నెరవేరిన తర్వాత, ఎస్క్రో ఏజెంట్ ఆ డబ్బు లేదా ఆస్తులను లబ్ధిదారునికి బదిలీ చేస్తాడు.

ఆన్‌లైన్ అమ్మకాలలో కొనుగోలుదారు చెల్లించిన డబ్బును ఎస్క్రో ఏజెంట్ ఉంచుతాడు. వస్తువు డెలివరీ అయ్యి, కొనుగోలుదారు సంతృప్తి చెందిన తర్వాత ఆ డబ్బు విక్రేతకు బదిలీ చేయబడుతుంది. కాగా రిటైల్ ఇన్వెస్టర్లను రక్షించడం, మార్కెట్ సమగ్రతను కాపాడడం లక్ష్యంగా సెబీ కఠిన చర్యలు చేపట్టింది. నిషేధం తొలగించడంతో ఎఫ్ & ఓ మార్కెట్‌లో లిక్విడిటీ కొంత మేరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+