భారతదేశంలోని ప్రముఖ ఐవేర్ రిటైల్ బ్రాండ్ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ త్వరలో జరగబోయే IPOకి ముందే మరో పెద్ద పెట్టుబడిని ఆకర్షించింది. మనీకంట్రోల్ సమీక్షించిన రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం..SBI మ్యూచువల్ ఫండ్ (SBI MF) లెన్స్‌కార్ట్‌లో రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడి లెన్స్‌కార్ట్ విలువను దాదాపు 7.7 బిలియన్ డాలర్లుగా నిర్ణయించడంతో.. ఇది ప్రీ-IPO దశలో ఉన్న అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.
SBI మ్యూచువల్ ఫండ్ ఉన్న రెండు ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (AIFలు) SBI Optimal Equity Fund, SBI Emergent Fund ద్వారా ఈ పెట్టుబడిని చేసింది. వీరు లెన్స్‌కార్ట్ సహ వ్యవస్థాపకురాలు నేహా బన్సాల్ నుండి ఒక్కో షేరుకు రూ. 402 చొప్పున మొత్తం 24.87 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఈ లావాదేవీ మొత్తం విలువ రూ. 100 కోట్లుగా నమోదు అయ్యింది. ఇది లెన్స్‌కార్ట్ IPOకి ముందు జరుగుతున్న పెద్ద పెట్టుబడిదారుల ప్రవేశాన్ని సూచిస్తోంది. ఇప్పటికే DMart వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని రూ.90 కోట్లతో లెన్స్‌కార్ట్ షేర్లను కొనుగోలు చేశారు. దీంతో లెన్స్‌కార్ట్‌పై పెద్ద సంస్థలు, బిలియనీర్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

లెన్స్‌కార్ట్ IPO అక్టోబర్ 29న యాంకర్ ఇన్వెస్టర్ల రౌండ్‌తో ప్రారంభమవుతుంది. ఆపై అక్టోబర్ 30 నుండి నవంబర్ 4 వరకు పబ్లిక్ ఇష్యూ కొనసాగుతుంది. కంపెనీ కొత్త షేర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్ల విక్రయాల ద్వారా మొత్తం రూ. 2,150 కోట్లు సేకరించాలనే లక్ష్యంతో ఉంది.
IPOలో సాఫ్ట్‌బ్యాంక్, KKR, క్రిస్‌క్యాపిటల్, ఆల్ఫా వేవ్, కేదారా క్యాపిటల్ వంటి ప్రస్తుత పెట్టుబడిదారులు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా తమ వాటాలో కొంత అమ్మకానికి పెట్టనున్నారు. లెన్స్‌కార్ట్ CEO, వ్యవస్థాపకుడు పేయుష్ బన్సాల్ కూడా కొంత వాటా విక్రయించనున్నారు.
కంపెనీ సమర్పించిన సవరించిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం.. IPO ద్వారా సమీకరించే నిధులను కొత్త స్టోర్ల విస్తరణ,అద్దె మరియు లీజు చెల్లింపులు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు, బ్రాండ్ మార్కెటింగ్, వ్యూహాత్మక కొనుగోళ్ల కోసం వినియోగించబడతాయి. ఈ నిధులు రాబోయే మూడు సంవత్సరాల్లో వినియోగించబడతాయి. OFS ద్వారా వచ్చిన ఆదాయం నేరుగా అమ్మకందారులకు వెళ్తుంది.
ఆర్థిక సంవత్సరం FY25లో లెన్స్‌కార్ట్ రూ. 297 కోట్ల నికర లాభం నమోదు చేసింది, ఇది FY24లో ₹10 కోట్ల నష్టంతో పోలిస్తే భారీ మార్పు. కంపెనీ ఆదాయాలు 23 శాతం పెరిగి రూ. 6,652 కోట్లకు చేరుకున్నాయి. FY26 Q1లో కూడా లెన్స్‌కార్ట్ బలమైన పనితీరు చూపింది. రూ.1,894.5 కోట్ల ఆదాయంపై రూ. 61.2 కోట్ల లాభాన్ని సాధించింది. EBITDA రూ. 336.6 కోట్లకు పెరిగింది. ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ.183.4 కోట్లతో పోలిస్తే గణనీయమైన వృద్ధిగా చెప్పవచ్చు.
ఫిడిలిటీ ఏప్రిల్ 2025 అప్‌డేట్‌లో లెన్స్‌కార్ట్‌ను 6.1 బిలియన్ డాలర్ల విలువగా అంచనా వేసింది. కానీ SBI MF తాజా లావాదేవీ ఆధారంగా, కంపెనీ విలువ 7.7 బిలియన్ డాలర్లకు చేరింది.ఇది IPOకి ముందు గణనీయమైన ప్రీమియంగా చెప్పవచ్చు. విశ్లేషకుల అంచనా ప్రకారం.. లిస్టింగ్ తర్వాత లెన్స్‌కార్ట్ భారతదేశంలో అత్యంత విలువైన వినియోగదారుల ఇంటర్నెట్ కంపెనీలలో ఒకటిగా నిలవనుంది. దేశంలోని అతిపెద్ద లిస్టెడ్ ఐవేర్ బ్రాండ్‌గా అవతరించనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications