స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న RS Brothers.. ఐపీఓ ద్వారా ఏకంగా రూ. 1500 కోట్లు టార్గెట్

RS Brothers IPO: దక్షిణ భారతదేశంలో ప్రముఖ బహుళ-బ్రాండ్ దుస్తుల రిటైల్ గొలుసుగా ఎదిగిన RSB Retail India Ltd (RS Brothers) స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ SEBIకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసింది. దీని ద్వారా సంస్థ దాదాపు రూ. 1,500 కోట్ల వరకు నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సంస్థ దాఖలు చేసిన DRHP ప్రకారం.. ఈ పబ్లిక్ ఇష్యూలో రూ. 500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూతో పాటు, ప్రమోటర్లు దాదాపు 2.98 కోట్ల ఈక్విటీ షేర్లను OFS (Offer For Sale) రూపంలో విక్రయించనున్నారు. ఇది కంపెనీ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించడానికి ఎంతో కీలకంగా మారనుంది.

ఆదాయ వినియోగానికి సంబంధించి.. కంపెనీ ఈ ఇష్యూలోనుంచి లభ్యమయ్యే నికర ఆదాయాన్ని మూడు ప్రధాన అంశాలపై ఖర్చుచేయాలని ప్లాన్ చేసింది. దాదాపు రూ.275 కోట్లు రుణ చెల్లింపులకు ఖర్చు చేయనుండగా.., మరో రూ. 118 కోట్లను RS Brothers, South India Shopping Mall లాంటి బ్రాండ్ల కింద కొత్త స్టోర్ల ఏర్పాటుకు ఖర్చు చేయనుంది. అలాగే మిగతా మొత్తాన్ని కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనుంది.

DRHP filing Indian retail IPO news upcoming IPOs in India capital markets Dalal Street listing Indian stock market SEBI filings RSB Retail fund raising IPO news India RSB Retail India IPO draft papers filed SEBI DRHP 1500 crore IPO RSB IPO news Indian retail sector IPO Dalal Street listing upcoming IPOs in India capital markets India RSB Retail fundraise RS Brothers IPO IPO

2008లో ప్రారంభించిన RSB Retail సంస్థ పలు బ్రాండ్ లతో మార్కెట్లో ఎదిగింది. South India Shopping Mall, RS Brothers, Kanchipuram Narayani Silks, D Royal, Value Zone Hyper Mart వంటివి ప్రధాన బ్రాండ్ ఫార్మాట్‌లుగా ఉన్నాయి. ఈ సంస్థ ప్రీమియమ్ నుండి వాల్యూ సెగ్మెంట్ల వరకూ అన్ని రకాల వినియోగదారులకు ఎథ్నిక్ వేర్, క్యాజువల్స్, ఫార్మల్స్ వంటి విభిన్న దుస్తుల ఎంపికను అందిస్తుంది. 2025 మార్చ్ 31 నాటికి కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 22 నగరాల్లో మొత్తం 73 స్టోర్లను నిర్వహిస్తోంది.

2025 ఫిస్కల్ ఇయర్‌లో ఈ సంస్థ రూ. 2,694 కోట్ల ఆదాయాన్ని నమోదు చెయ్యగా.. రూ. 104.4 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది సంస్థ బలమైన ఆపరేషన్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. టెక్నోపాక్ నివేదిక ప్రకారం.. భారత రిటైల్ రంగం వేగంగా విస్తరిస్తోంది. FY25 నాటికి మొత్తం మార్కెట్ పరిమాణం రూ. 92.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇందులో దుస్తుల మార్కెట్ సుమారు రూ. 6.9 లక్షల కోట్ల విలువతో అత్యంత ప్రాధాన్యత కలిగిన క్యాటగరిగా ఉంది. అలాగే దక్షిణ భారత రాష్ట్రాలు ఈ మార్కెట్‌లో 28 శాతం వరకు వాటాను నియంత్రిస్తున్నాయి. టెక్నోపాక్ అంచనాల ప్రకారం ఈ ప్రాంత్ మార్కెట్ 12 శాతం CAGR తో వృద్ధి చెందుతూ FY29 నాటికి రూ. 3.05 లక్షల కోట్లకు పెరిగే అవకాశముందని తెలిపింది.

ఈ పబ్లిక్ ఇష్యూ నిర్వహణ కోసం RSB Retail.. Motilal Oswal Investment Advisors, HDFC Bank, IIFL Capital Services వంటి ప్రముఖ మర్చంట్ బ్యాంకర్లను నియమించుకుంది. పరిశీలకులు చెబుతున్నట్లుగా, సంస్థ ఈ ఐపీఓ ద్వారా సమీకరించే నిధులతో బలమైన విస్తరణ దశను ప్రారంభించనుంది. దక్షిణ భారత విభాగంలో ఉన్న బ్రాండ్ విశ్వసనీయతను బట్టి చూస్తే, ఈ గుడ్‌విల్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఇది సరైన సమయంగా కనిపిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. RSB Retail India యొక్క IPO ప్రయాణం రిటైల్ రంగాన్ని మార్చబోతోందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+