Deepak Builders IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మార్కెట్లో నేడు తెరచుకున్న ఒక ఐపీవో వెనుక ఇన్వెస్టర్లు పడ్డారు. తెరుచుకున్న గంటలోపే డబ్బులు కుమ్మరించి షేర్లను దక్కించుకోవటం కోసం భారీగా దరఖాస్తులు వేశారు. ఐపీవో క్లోజ్ అవటానికి ఇంకా సమయం ఉండటంతో ఇన్వెస్టర్లకు బెట్టింగ్ అవకాశం రెండు రోజులు మిగిలే ఉంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దీపక్ బిల్డర్స్ అండ్ ఇంజనర్స్ కంపెనీ ఐపీవో గురించే. నేడు పెట్టుబడిదారుల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకున్న కేవలం గంటలోనే భారీ స్పందన కనిపించింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా స్పందన కనిపించింది. దీని ప్రభావంతో మెుదటి గంటలోనే రిటైల్ ఇన్వెస్టర్లకు ఐపీవోలో కంపెనీ కేటాయించిన కోటా పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఎలాగైనా షేర్లను దక్కించుకోవాలని రిటైల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఐపీవో వెనుక పరిగెడుతున్నారు. ఇదే క్రమంలో కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి శుక్రవారం రోజునే రూ.78.01 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ప్రస్తుతం రిటైల్ కోటా 1.81 శాతానికిపైగా సబ్‌స్క్రైబ్ అయింది.

కంపెనీ ఐపీవో వివరాలను పరిశీలిస్తే.. కంపెనీ తాజా ఐపీవో నుంచి మెుత్తంగా రూ.260.04 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో తాజా ఈక్విటీ ఇష్యూ కింద రూ.217.21 కోట్లను సమీకరించటానికి దాదాపు 1.07 కోట్ల ఫ్రెష్ షేర్లను విక్రయానికి ఉంచింది. అలాగే మిగిలిన మెుత్తం ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంటుందని వెల్లడైంది. మెయిన్ కేటగిరీలో వస్తున్న కంపెనీ ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో అక్టోబర్ 28న లిస్టింగ్ కానున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.192-203గా నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 73 షేర్లుగా ఉంటంతో ఒక లాట్ కొనుగోలుకు రూ.14,819గా ఉంది.
ఐపీవోపై బ్రోకరేజ్ మాట ఇదే..!
ప్రస్తుతం మార్కెట్లో ఐపీవోపై క్రేజ్ కొనసాగుతున్న వేళ చాలా మంది బ్రోకరేజ్ అభిప్రాయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ కంపెనీ ఐపీవో వాల్యుయేషన్ సరైనదని తెలిపిందిగా ఉన్నట్లు పేర్కొంది. 2017లో స్థాపించబడిన కంపెనీ ఉత్తర భారతదేశంలో ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ సేవలను విస్తరిస్తోంది. కంపెనీ ఆదాయాలు సైతం మెరుగ్గానే ఉన్నాయి. కంపెనీ మెజారిగా ప్రభుత్వ ప్రాజెక్టులను నిర్వహిస్తోందని వెల్లడైంది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications