Suzlon Energy: మూడు నెలల్లో 30 శాతం పడిపోయిన సుజ్లాన్ స్టాక్.. ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా..!

సుజ్లాన్ షేర్లు గత కొద్ది రోజులుగా పడిపోతున్నాయి. సెప్టెంబరు 25న శుక్రవారం నాడు సుజ్లాన్ షేర్లు 1 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. సుజ్లాన్ షేర్లు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయి. గత వారంలో 7.16 శాతం పడిపోగా.. రెండు వారాల్లో 8.97 శాతం పడిపోయింది. ఇక ఒక నెలలో 13.92 శాతం క్షీణించాయి. గత మూడు నెలల్లో స్టాక్ 29.60 శాతం పడిపోయింది. సంవత్సరం కాలంగా ఈ స్టాక్ 23.41 శాతం పడిపోయింది. రీపవర్ చేసే అవకాశం భారత్ లో 30 GW, యూరప్‌లో 50 GW విలువైనదిగా ఉంటుందని సుజ్లాన్ గ్రూప్ వైస్ ఛైర్మన్ మరియు సహ-వ్యవస్థాపకుడు గిరీష్ తంతి తెలిపారు. 2030 నాటికి 100 GW పవన శక్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు విరించారు.

భారతదేశంలో పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి గ్రిడ్ సంసిద్ధతను కీలకమైన అడ్డంకులలో ఒకటిగా గుర్తించినట్లు గిరీష్ తంతి తెలిపారు. 2030 నాటికి దేశం 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్ధ్యం, పవన శక్తి నుంచి 100 గిగావాట్ల విస్తృత లక్ష్యం దిశగా పని చేస్తున్నట్లు వివరించారు. ట్రాన్స్‌మిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందడానికి ప్రస్తుతం దాదాపు ఐదు సంవత్సరాలు పడుతుందని, ఇది సంప్రదాయ థర్మల్, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంతో పోల్చదగింది కాదన్నారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు సాధారణంగా చాలా తక్కువ అభివృద్ధి సమయాలను కలిగి ఉంటాయన్నారు. పవన, సౌర ప్రాజెక్టులను రెండేళ్లలోపు అభివృద్ధి చేయవచ్చని, పునరుత్పాదక సామర్థ్యం జోడింపులకు అనుగుణంగా గ్రిడ్ డెవలప్‌మెంట్ టైమ్‌లైన్‌లను దాదాపు 12-18 నెలలకు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

Suzlon Energy

సుజ్లాన్ ఎనర్జీ స్టాక్‌లో బహుళ భారీ ట్రేడ్‌ల తరువాత సెప్టెంబర్ 24, గురువారం నాడు 3.6% క్షీణించింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం దాదాపు 3.2 కోట్ల సుజ్లాన్ షేర్లు చేతులు మారాయి. ఇది ఈక్విటీలో 0.23 శాతానికి సమానం. సుజ్లాన్ ఎనర్జీలో ప్రమోటర్లు 11.71 శాతం వాటాను కలిగి ఉండగా, పబ్లిక్ వాటాదారులు మిగిలిన 88.29% వాటాను కలిగి ఉన్నారు. పబ్లిక్ వాటాదారులలో భారతీయ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో 6.47 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్ ప్రముఖ వాటాదారులలో 2.88 శాతం కలిగి ఉంది. శుక్రవారం సుజ్లాన్ ఎనర్జీ షేర్ ధర బీఎస్ఈలో ఒక్కొక్కటి రూ.40.83 వద్ద ప్రారంభమైంది.

స్టాక్ ఇంట్రాడే గరిష్టంగా రూ.41.09, ఇంట్రాడే కనిష్టంగా రూ.40.13ని తాకింది. సుజ్లాన్ ఎనర్జీ ఈ సంవత్సరం ప్రారంభంలో నమోదైన కనిష్ట స్థాయిల నుంచి ఇటీవలి బౌన్స్‌ బ్యాక్ అయ్యాయని ఏంజెల్ వన్‌లోని టెక్నికల్ అనలిస్ట్ - ఈక్విటీ & డెరివేటివ్స్ హితేష్ రాఠీ అన్నారు. షేరు దాదాపు రూ.61కి బలమైన ప్రతిఘటనను ఎదుర్కొంటుందని, అయితే రూ.39 కీలకమైన సపోర్ట్ జోన్‌గా ఉందని రాఠీ చెప్పారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+