Reliance Jio IPO రేసులో ట్విస్ట్.. విదేశీ ఇన్వెస్టర్లతో అంబానీ గొడవ? అసలేం జరుగుతోంది?

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, దేశంలోనే అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కి రిలయన్స్ జియో సర్వం సిద్ధం చేసుకుంటోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కి చెందిన ఈ టెలికాం , డిజిటల్ విభాగం.. రాబోయే రెండు వారాల్లోనే సెబీ (SEBI) కి డ్రాఫ్ట్ పేపర్లను (DRHP) సమర్పించే అవకాశం ఉందని సమాచారం. సుమారు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 33,000 కోట్లు) నిధుల సేకరణే లక్ష్యంగా రాబోతున్న ఈ పబ్లిక్ ఇష్యూలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ఐపీఓ మొత్తం 'ఫ్రెష్ ఈక్విటీ ఇష్యూ' (Fresh Issue) రూపంలోనే ఉండబోతోంది. అంటే, ఇందులో పాత ఇన్వెస్టర్లు తమ వాటాలను అమ్మే ఆఫర్ ఫర్ సేల్ (OFS) కాంపోనెంట్ ఏదీ ఉండకపోవచ్చు.

Reliance Jio IPO Launch Share Price Impact Valuation RIL DRHP Filing SEBI

విదేశీ ఇన్వెస్టర్లతో రేట్ల గొడవ.. అంబానీ ఎందుకు తగ్గారు?

మీడియా నివేదికల ప్రకారం.. జియోలో వాటాలు ఉన్న గ్లోబల్ ఇన్వెస్టర్లకు, ప్రమోటర్ అయిన ముఖేష్ అంబానీకి మధ్య గత కొన్ని వారాలుగా ఐపీఓ వాల్యుయేషన్ (ధర) విషయంలో ఒక చిన్నపాటి టగ్ ఆఫ్ వార్ నడిచింది. గూగుల్, మెటా (ఫేస్‌బుక్), కేకేఆర్, సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ వంటి దిగ్గజాలు 2020లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ. 1.52 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి 32.9% వాటాను దక్కించుకున్నాయి. ప్రస్తుతం మెటాకు 9.99%, గూగుల్‌కు 7.73% వాటాలు ఉన్నాయి.
ఐదేళ్ల పాటు వేచి చూసిన ఈ అంతర్జాతీయ ఇన్వెస్టర్లు.. ఐపీఓ ప్రైస్‌ను వీలైనంత ఎక్కువగా ఉంచి భారీ లాభాలు లాగాలని చూశారు. కానీ, రిలయన్స్ ప్రమోటర్లు మాత్రం రేటును అగ్రెసివ్‌గా పెంచితే లిస్టింగ్ రోజున స్టాక్ నష్టపోతుందని, తద్వారా సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతారని భావించారు.

రిటైల్ ఇన్వెస్టర్లకు లాభాలు వచ్చేలా స్పేస్ ఇవ్వడం కోసమే అంబానీ ఈ ఓఎఫ్ఎస్ (OFS) ప్లాన్‌ను పక్కనబెట్టి, కేవలం కొత్త షేర్లను మాత్రమే జారీ చేయాలని నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులలో దాదాపు రూ. 25,000 కోట్లను జియోపై ఉన్న అప్పులను తగ్గించడానికి వాడుకోనున్నారు.

రిలయన్స్ షేర్ ప్రైస్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతిలో జియోకి సంబంధించిన 67% వాటా ఉంది. ఈ కొత్త ఐపీఓ స్ట్రక్చర్ వల్ల రిలయన్స్ వాటా కేవలం 2.5% మాత్రమే తగ్గుతుంది కాబట్టి ప్రమోటర్ కంట్రోల్ బలంగానే ఉంటుంది. గడచిన కొంతకాలంగా రిలయన్స్ షేరు ధర షార్ట్ టర్మ్‌లో నెగెటివ్‌గా ట్రేడ్ అవుతోంది. వారం రోజుల్లో 7% పైగా, ఈ ఏడాది ప్రారంభం (YTD) నుండి ఏకంగా 15% వరకు ఈ స్టాక్ నష్టపోయింది.

ఇలాంటి టైంలో జియో ఐపీఓ రావడం రిలయన్స్ ఇన్వెస్టర్లకు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు. కాంతిలాల్ ఛగన్‌లాల్ సెక్యూరిటీస్ నిపుణులు మహేష్ ఓఝా మాట్లాడుతూ.. ఈ లిస్టింగ్ వల్ల రిలయన్స్ హోల్డింగ్ కంపెనీగా చాలా పెద్ద వాల్యూ అన్‌లాకింగ్ (Value Unlocking) జరుగుతుందని చెప్పారు. మార్కెట్లో కేవలం 2.5% ఫ్రీ ఫ్లోట్ షేర్లు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల జియో షేర్లకు విపరీతమైన డిమాండ్ (Scarcity Premium) ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల పేరెంట్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ బిజినెస్ రేటింగ్ పెరిగి, షేరు ధర మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉంది.

పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల మార్కెట్ సెంటిమెంట్ కాస్త బలహీనపడటంతో మార్చిలో రావాల్సిన ఈ ఫైలింగ్ కొంచెం ఆలస్యమైంది. అయితేనేం.. ఈ IPO ట్రేడింగ్ డెబ్యూ రోజున మార్కెట్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+