Reliance Jio IPO: దేశంలోనే అతిపెద్ద తొలి పబ్లిక్ ఆఫర్ (IPO)రాబోతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాదిలోనే మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తే జియో ఐపీఓ ద్వారా భారీ మొత్తంలో నిధులు సమీకరించాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే, భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా జియో రికార్డు సృష్టించనుంది.
గత నవంబరులో అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెఫ్రీస్ రిలయన్స్ జియో విలువను సుమారు 180 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16.20 లక్షల కోట్లు)గా అంచనా వేసింది. ఈ విలువ ఆధారంగా చూస్తే, జియోలో కేవలం 2.5 శాతం వాటా విక్రయించినా కూడా సంస్థకు 4 నుంచి 4.5 బిలియన్ డాలర్లు (రూ.36 వేల నుంచి రూ. 40,500 కోట్లు) సమీకరించే అవకాశం ఉంది. ఇదే స్థాయిలో నిధులు సమీకరిస్తే, ఇప్పటివరకు దేశంలో జరిగిన అన్ని ఐపీఓలను జియో అధిగమించినట్లే అవుతుంది.

ప్రస్తుతం రిలయన్స్ జియోకు 50 కోట్లకు పైగా చందాదారులు ఉండగా.. ఇది దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా కొనసాగుతోంది. మొబైల్ సేవలతో పాటు డేటా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ మరియు క్లౌడ్ సేవల రంగాల్లో జియో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించింది. ఈ నేపథ్యంలో జియో ఐపీఓ కోసం దేశీయ, అంతర్జాతీయ మదుపర్లు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత ఆరు సంవత్సరాలుగా జియో తన వ్యాపారాన్ని కేవలం టెలికాం వరకు పరిమితం చేయకుండా కృత్రిమ మేధ (AI), డిజిటల్ ఎకోసిస్టమ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్ టెక్నాలజీ రంగాల్లోకి విస్తరించింది. ఈ ప్రయాణంలో KKR, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వంటి ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి భారీగా నిధులు సమీకరించింది.
జియో ఐపీఓ ముసాయిదాను సిద్ధం చేసే పనిలో మోర్గాన్ స్టాన్లీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు పాల్గొంటున్నట్లు సమాచారం. గత ఏడాది ఆగస్టులో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ముకేశ్ అంబానీ.. 2026 ప్రథమార్థంలో జియో ఐపీఓ వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. అయితే, మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల నిర్ణయాల ఆధారంగానే తుది తేదీ నిర్ణయించనున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం సెబీ నిబంధనల ప్రకారం.. పెద్ద కంపెనీలు ఐపీఓ ద్వారా నిధులు సమీకరించాలంటే కనీసం 5 శాతం వాటా విక్రయించాలి. అయితే ఈ నిబంధనను 2.5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. జియో పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని, కేవలం 2.5 శాతం వాటానే విక్రయించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. అయితే జియో ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలోనే వస్తుందా లేదా కొత్త షేర్ల జారీ కూడా ఉంటుందా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇటీవల హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.27,870 కోట్ల ఐపీఓ పూర్తిగా ఓఎఫ్‌ఎస్‌గా రావడం గమనార్హం. జియో విషయంలో కూడా ఇలాంటి మోడల్‌ను అనుసరిస్తారా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications