Reliance Jio IPO 2026: భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 29న జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. జియో IPOను 2026 మొదటి అర్ధభాగంలో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. సెబీ నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత.. జూన్ 2026 నాటికి లిస్టింగ్ పూర్తి చేయాలనేది కంపెనీ ఉద్దేశంగా తెలిపారు.
ఈ IPO భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత పెద్ద పబ్లిక్ ఇష్యూ కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు రికార్డు హ్యుందాయ్ మోటార్ ఇండియా పేరుతో ఈ రికార్డు ఉంది, 2024 అక్టోబర్‌లో కంపెనీ దాదాపు రూ. 27,870 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూను తీసుకొచ్చింది. అంతకుముందు LIC (2022లో రూ. 21,000 కోట్లు), Paytm (2021లో రూ. 18,300 కోట్లు), Coal India (2010లో రూ. 15,199 కోట్లు) తీసుకువచ్చింది. Reliance Power (2008లో రూ. 11,563 కోట్లు), GIC (2017లో రూ. 11,176 కోట్లు) వంటి IPOలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి.

జియో IPOలో ఎంత శాతం షేర్లు అమ్మబడతాయో ముఖేష్ అంబానీ స్పష్టంగా చెప్పనప్పటికీ, మార్కెట్ వర్గాలు కంపెనీ సుమారు 10 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 66.3 శాతం వాటాను కలిగి ఉంది. అదనంగా మెటా (10 శాతం), గూగుల్ (7.7 శాతం), అలాగే పలు ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులు దాదాపు 16 శాతం వాటాలను కలిగి ఉన్నార
జియో ఎంటర్‌ప్రైజ్ విలువ 136 బిలియన్ డాలర్ల నుండి 154 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ఏప్రిల్‌లో జెఫరీస్ నివేదిక ప్రకారం..మార్చి 2026 నాటికి జియో విలువ 136 బిలియన్ డాలర్ల వరకు పెరగవచ్చని పేర్కొంది. ఈ అంచనాలు జియో IPOపై పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని మరింతగా పెంచుతున్నాయి.
జియో 10 ఏళ్లలో 500 మిలియన్ల (50 కోట్ల) వినియోగదారులను దాటింది. ఇది భారత టెలికాం రంగంలో ఒక గొప్ప మైలురాయిగా పరిగణించబడుతోంది. భారతదేశపు ప్రాథమిక మార్కెట్ ప్రస్తుతం బలంగా వృద్ధి చెందుతున్న సందర్భంలో జియో IPOకి సరైన సమయం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2025లో ఇప్పటివరకు 50 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయ్యాయి. వాటిలో టాటా క్యాపిటల్, గ్రో, బోట్, ఫిజిక్స్ వాలా, జెప్టో, ఓయో వంటి పేరున్న కంపెనీలు రాబోయే నెలల్లో IPOలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితి మార్కెట్‌లో పెట్టుబడిదారుల ఆసక్తి ఎంతగా పెరిగిందో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications