IPO News: దుమ్మురేపిన Rekha Jhunjhunwala కంపెనీ ఐపీవో.. 43% బంపర్ ప్రీమియం లిస్టింగ్..
Inventurus Knowledge IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ నెల ముగియటానికి, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్న వేళ ఐపీవోల రాక మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీల పనితీరు ఒత్తిడితో చిత్తైన వేళ ప్రస్తుతం లిస్టింగ్ గెయిన్స్ కోసం ఐపీవోలపైనే బెట్టింగ్ వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టిన ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి ఈ కంపెనీని ప్రముఖ ఇన్వెస్టర్ రేఖా జున్‍జున్‍వాలా నేతృత్వంలో నిర్వహించబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు మెయిన్ కేటగిరీలో వచ్చిన కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర కంటే 43 శాతం ప్రీమియం ధర రూ.1,900 వద్ద జాబితాను నమోదు చేయగా.. బీఎస్ఈలో స్టాక్ 39.65 శాతం ప్రీమియం రేటు రూ.1,856 వద్ద ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. ఇష్యూ పెట్టుబడిదారుల నుంచి భారీగా డిమాండ్ చూడటంతో మెుత్తంగా 52.68 రెట్లు బిడ్స్ అందుకుంది. ప్రధానంగా క్వాలిఫైడ్ ఇన్వెస్టర్ల కేటగిరీ అత్యధికంగా 80.64 రెట్లు సబ్‍స్క్రిప్షన్ అందుకుంది.

ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2,497.92 కోట్లను సమీకరించాలని లక్ష్యంతో వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద వస్తున్న ఐపీవో. తాజా ఐపీవో కింద కంపెనీ 1.88 కోట్ల ఈక్విటీ షేర్లు ఓఎఫ్ఎస్ సేల్ కోసం ఉంచింది. సాధారణ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు అందుబాటులో ఉంచబడింది.
ఈ క్రమంలో కంపెనీ నేడు తన ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.1265-1329 మధ్య ప్రకటించింది. అలాగే కనీస పెట్టుబడి కోసం లాట్ పరిమాణాన్ని 11 షేర్లుగా ఉంచింది. దీనివల్ల రిటైల్ పెట్టుబడిదారులు ఐపీవోలో పాల్గొనటానికి కనీసం రూ.14,619 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఇదే క్రమంలో కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీకి 10 శాతం, నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం కేటాయించగా, మిగిలిన వాటాలను క్వాలిఫైడ్ ఇన్టిట్యూషనల్ బయ్యర్స్ కోసం రిజర్వు చేసింది. ఇక కంపెనీ ప్రమోటర్ల విషయానికి వస్తే.. సచిన్ గుప్తా, రేఖా జున్‍జున్‍వాలా, ఆర్యమాన్ జున్‍జున్‍వాలా ట్రస్ట్, ఆర్యవీర్ జున్‍జున్‍వాలా ట్రస్ట్, నిష్ఠా జున్‍జున్‍వాలా ట్రస్ట్ కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్నారు.
2006లో స్థాపించబడిన కంపెనీ హెల్త్ కేర్ రంగంలోని సంస్థలకు అడ్మినిస్ట్రేషన్ వర్క్ నిర్వహణ సేవలను అందిస్తోంది. కంపెనీ వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు వారి వ్రాతపని, పరిపాలనా పనులను నిర్వహించడంలో సహాయం చేస్తుంది. IKS హెల్త్ క్లినికల్ సపోర్ట్, మెడికల్ డాక్యుమెంటేషన్ మేనేజ్‌మెంట్, వర్చువల్ మెడికల్ స్క్రైబింగ్ వంటి సేవలను అందిస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,857.94 కోట్లుగా నమోదు కాగా.. నికర లాభం రూ.370.49 కోట్లగా నమోదైంది.


Click it and Unblock the Notifications