ప్రస్తుతం దేశంలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫ్యూచర్ లో రియల్ ఎస్టేట్ లో డేటా సెంటర్లు కీలక పాత్ర పోషించనున్నాయి. డేటా సంస్థలకు తగ్గట్టుగా స్థలాలను రెడీ చేసుకుంటే ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు అపార్ట్‌మెంట్లు, ఆఫీస్ స్పేస్‌ల నుంచి కొత్త రకం మోడల్ కు మారబోతోంది. అదే డేటా సెంటర్ ల్యాండ్స్. డేటా సెంటర్ల (Data Centres) కోసం స్థలాలకు డిమాండ్ ఊహించని విధంగా పెరిగింది. చాలా కంపెనీలు సరైన పవర్ సప్లైతో కూడిన ల్యాండ్స్ కోసం చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే.. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు కొత్త ప్లాన్ ను అమలు చేయాల్సి ఉంటుంది. అదెలాగంటే..
ల్యాండ్ కాదు, 'పవర్'ఫుల్ ల్యాండ్ కావాలి!
గతంలో డేటా సెంటర్ ఆపరేటర్లు ఖాళీగా ఉండే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ను కొనుగోలు చేసి నెలల తరబడి విద్యుత్ కనెక్షన్లు, ఫైబర్ కేబుల్స్, అనుమతుల కోసం ఎదురుచూసేవారు. కానీ ఈ రోజుల్లో క్లౌడ్ కంపెనీలకు సమయమే డబ్బు! అందుకే డెవలపర్లు ఇప్పుడు కేవలం స్థలాలను అమ్మడం లేదు. వారు ఆ స్థలాన్ని ఒక 'రెడీ-టు-ఆపరేట్' ప్రాపర్టీగా మార్చి అమ్ముతున్నారు. దీనినే రియల్ ఎస్టేట్ పరిభాషలో 'ప్లగ్ అండ్ ప్లే క్యాంపస్' అంటున్నారు.
ప్లగ్ అండ్ ప్లే అంటే..
ప్లగ్ అండ్ ప్లే అంటే.. ముందుగానే స్థలంలో అన్ని ఏర్పాట్లు చేసి అందించడం. అంటే హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా కోసం డెడికేటెడ్ పవర్ ఫీడ్స్ ఏర్పాటు చేయాలి. కనీసం 100 మెగా వాట్ల వరకు విద్యుత్ గ్రిడ్ కనెక్షన్‌లు. ఉండాలి. అత్యంత వేగవంతమైన ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ ఉండాలి. డేటా సెంటర్ కోసం అవసరమైన రెడీమేడ్ కూలింగ్ షెల్స్ ను ఏర్పాటు చేయాలి. అలాగే నిర్మాణ అనుమతుల కోసం ముందుగానే క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఏర్పాటు చేయాలి. ఇలాంటి స్థలాలకు ఫ్యూచర్ లో ఫుల్ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. సాంప్రదాయ పద్ధతిలో 30 నెలలు పట్టే నిర్మాణం ఈ 'ప్లగ్ అండ్ ప్లే' మోడల్ ద్వారా చాలా తక్కువ సమయంలోనే ఆపరేషన్స్ మొదలు పెట్టవచ్చు. రియల్ ఎస్టేట్ పెట్టుబడి వేగంగా లాభాలు చూపడానికి ఇది కీలకం!
ఎంత స్థలం అవసరం?
డేటా సెంటర్ల కోసం స్థలం ఎంపిక అనేది వాటి అవసరాన్ని బట్టి ఉంటుంది. పెద్ద క్లౌడ్ కంపెనీలకు 50 నుంచి 100 మెగా వాట్ల విద్యుత్ అవసరం. స్థలం సుమారు 10 నుంచి 50 ఎకరాలు ఉండాలి. చిన్న సంస్థలు అయితే 10 నుంచి 20 మెగా వాట్ల విద్యుత్ సరిపోతుంది. స్థలం 2 నుంచి 5 ఎకరాలు ఉండాలి. ఇక ఎడ్జ్ సెంటర్లకు అయితే.. 1 నుంచి 5 మెగావాట్ల విద్యుత్ కావాలి. స్థలం 1 నుంచి 2 ఎకరాలు సరిపోతుంది.
ఈ ఏరియాల్లో డిమాండ్!
డేటా సెంటర్ల కోసం కంపెనీలు ముఖ్యంగా నగరాల పరిసర ప్రాంతాల వైపు చూస్తున్నాయి. అంటే నవీ ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా వంటి నగరాల్లో లేదా సిటీ అవుట్ స్కర్ట్స్ లో డేటా సెంటర్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా ఏపీ ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున డేటా సెంటర్లకై ప్రతిపాదనలు వచ్చాయి. కాబట్టి అమరావతి, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో కూడా ఈ తరహా ప్లగ్ అండ్ ప్లే రియల్ ఎస్టేట్ కు డిమాండ్ ఉంటుంది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
సాంప్రదాయ రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు ఇప్పుడు ప్లగ్ అండ్ ప్లే రియల్ ఎస్టేట్ వైపు దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఖాళీ స్థలాల యుగం ముగిసింది. ఇప్పుడు రెడీ-టు-ఆపరేట్, ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫారమ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో అత్యధిక రాబడి పొందొచ్చు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!



Click it and Unblock the Notifications