RBL Bank Shares Price: దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆర్బీఎల్ బ్యాంక్ తాజాగా స్టాక్ మార్కెట్ వార్తల్లోకెక్కింది. ఈ కంపెనీలో దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎన్బీడీ (Emirates NBD) సంస్థ మైనారిటీ స్టాక్ కొనుగోలు చేసేందుకు రెడీ అవుతోందంటూ బిజినెస్ సర్కిల్లో వార్తలు గుప్పుమన్నాయి.
ఈ వార్తలు వైరల్ కావడంతో వెంటనే ఆర్‌బీఎల్ బ్యాంక్ స్పందించింది. జాతీయ ఛానల్ సీఎన్ బీసీకి ఇచ్చిన ప్రకటనలో ఈ వార్తలు పూర్తిగా అబద్దమని అలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. ఎమిరేట్స్ ఎన్బీడీతో డీల్ వార్తలు అబద్దం.. అది ఊహాజనితమైనదిగా పేర్కొంటూ..అలాంటిదేమైనా ఉంటే కంపెనీ అధికార ప్రకటన ద్వారా తెలియజేస్తుందని చెప్పుకొచ్చింది.
అయితే రూమర్స్ వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లో RBL షేర్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అయితే కంపెనీ ప్రకటన తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి. నిన్న 4 శాతం పైగా షేర్ల ధరలు పెరిగాయి. వరుసగా 4వ ట్రేడింగ్ రోజు కంపెనీ లాభాలతో ముగిసింది. జూన్ నెలలో RBL బ్యాంక్ షేర్లు 21 శాతం లాభ పడగా.. గత ఆరు నెలల్లో బ్యాంక్ షేర్లు 64 శాతం మేర పుంజుకున్నాయి. గత 5 రోజుల్లోనే 7 శాతం పుంజుకున్నాయి. మొత్తం ఎనిమిది సెషన్లలో ఆర్బీఎల్ బ్యాంకు షేర్లు ఏడు సార్లు లాభాల్లోనే ముగియడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.

ఈసీలో వచ్చిన కథనం ప్రకారం. ఎమిరేట్స్ ఎన్బీడీ సంస్థ RBL బ్యాంక్‌లో మైనారిటీ వాటా తీసుకునేందుకు చర్చల్లో ఉన్నట్టు పేర్కొంది. ఇది భారత బ్యాంకింగ్ రంగంలోకి ఆ సంస్థ ప్రవేశానికి పునాది అవుతుందని చెప్పుకొచ్చింది. ఇక భారత బ్యాంకుల్లో విదేశీ సంస్థలకు 15% కంటే ఎక్కువ వాటా ఉండడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతించదనే విషయం విదితమే. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులు ఇస్తుంది. అయితే ఆర్బీఎల్ బ్యాంక్ చేసిన ప్రకటనతో అదంతా పుకారేనని తేలిపోయింది.
ఈ మధ్య కాలంలో పలు విదేశీ కంపెనీలు భారత బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. CSB బ్యాంక్‌లో ఫెయిర్‌ఫ్యాక్స్ కంపెనీ అధిక వాటాను కొనుగోలు చేసింది. అలాగే డీబీఎస్ బ్యాంక్ (DBS) లక్ష్మీ విలాస్ బ్యాంకుతో విలీనానికి అనుమతిచ్చింది. జపాన్‌కు చెందిన SMBC సంస్థ Yes Bankలో 20% స్టేక్ కొనుగోలు చేయడానికి RBI అనుమతి కోరింది.ఈ పరిణామాల నేపథ్యంలో ఎమిరేట్స్ ఎన్బీడీ కూడా భారత్ లో ఎంట్రీకి ఆశలు పెట్టుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కంపెనీ ప్రకటనతో అతి అబద్దమేనని తేలిపోయింది.
ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థ సిటీ గ్రూప్ కూడా ఇటీవల RBL బ్యాంక్ పై 90-రోజుల పాజిటివ్ కాటలిస్ట్ వాచ్ జారీ చేసింది. బ్యాంక్ రాబోయే త్రైమాసికాల్లో నికర ఆదాయం (RoA) 45-50 బేసిస్ పాయింట్లు మెరుగవుతుందని అంచనా వేసింది. తాజాగా ధరను రూ. 230 నుంచి రూ. 285 కు పెంచింది.అంటే ప్రస్తుతం ఉన్న ధర కంటే సుమారుగా 15% లాభాల అవకాశాన్ని సూచించింది. జాయింట్ లయబిలిటీ గ్రూప్ (JLG), క్రెడిట్ కార్డ్ విభాగాల్లో బలమైన ప్రావిజనింగ్ వల్ల క్రెడిట్ ఖర్చులు తగ్గి లాభదాయకత పెరగొచ్చని సిటీ పేర్కొంది. ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ రంగం మొత్తంగా మంచి పెరుగుదలను చూపుతోంది.నిఫ్టీ బ్యాంక్ సూచీ ఆల్‌టైమ్ హైకి చేరిన నేపథ్యంలో, RBL షేరు కూడా అద్భుతమైన లాభాలను సాధించిందనే చెప్పుకోవచ్చు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications