credit score : ఇకపై వారానికోసారి క్రెడిట్ స్కోర్ అప్‌డేట్! దీనివల్ల లాభమా? నష్టమా?
ఇకపై మీ క్రెడిట్ స్కోర్ (credit score) పెరగడానికి లేదా తగ్గడానికి వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కొత్త రూల్ తీసుకురాబోతోంది. ఏప్రిల్ 2026 నుంచి వారానికోసారి క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ అవుతుంది. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నెలకు రెండుసార్లు మాత్రమే క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ అవుతుంది. అయితే దీన్ని ఇకపై ప్రతి ఏడు రోజులకు అప్‌డేట్ చేయాలని కొత్త రూల్ తీసుకురానున్నారు. ఇది రుణగ్రహీతలకు భారీ ఉపశమనం కలిగించే అంశం. ఎలాగంటే..
RBI ప్రతిపాదనలో ఏముంది?
RBI యొక్క "క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ (1వ సవరణ) డైరెక్షన్స్, 2025" ప్రకారం.. అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (CICs) రుణగ్రహీత డేటాను నెలలో ఐదు సార్లు - ప్రతి నెలా 7వ, 14వ, 21వ, 28వ తేదీన అలాగే చివరి రోజున తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. బ్యాంకులు, NBFCలు నెలకు ఒకసారి పూర్తి క్రెడిట్ రికార్డులను పంపుతూనే.. ఈ మధ్యలో వచ్చే వారపు కట్-ఆఫ్ తేదీలలో కొత్తగా వచ్చిన మార్పులను పంపాలి. వీటిలో కొత్త లోన్స్ లేదా కార్డులు జారీ చేయడం, ఖాతాలు మూసివేయడం, తిరిగి చెల్లింపుల వివరాల వంటివి ఉంటాయి.
వీకెండ్ అప్‌డేట్స్ ఎలా పనిచేస్తాయి?
ప్రతి నెలా బ్యాంకులు కొత్తగా జరిగిన ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ తగిన అప్ డేట్స్ పంపాలి. ఉదాహరణకు, EMI చెల్లించడం లేదా అకౌంట్ క్లోజ్ చేయడం ఇలాంటివన్నీ అప్‌డేట్‌గా పంపాలి. దీని అర్థం ఏమిటంటే.. ఎవరైనా తమ క్రెడిట్ కార్డును క్లోజ్ చేసినా లేదా రుణం పూర్తిగా చెల్లించినా లేదా బకాయిలను క్లియర్ చేసి వారి రీపేమెంట్ ట్రాక్ రికార్డును మెరుగుపరుచుకున్నా.. కొద్ది రోజుల్లోనే వారి credit score ఇంప్రూవ్ అవుతుంది.
బెనిఫిట్స్ ఇవే..
- ఈ కొత్త రూల్ దాదాపు రియల్ టైమ్ అప్‌డేట్ లా పని చేస్తుంది. దీనివల్ల బకాయిలను చెల్లించిన వెంటనే చాలా త్వరగా credit score అప్ డేట్ అవుతుంది.
- ఈ కొత్త రూల్ వల్ల లోన్స్ వేగంగా అప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. రుణాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇకపై నెలవారీ అప్‌డేట్‌ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. మెరుగైన credit score ను చూపి వెంటనే రుణం పొందవచ్చు.
- చాలా బ్యాంకులు రుణం ధరలను credit score తో ముడిపెడుతున్నాయి. కాబట్టి, మెరుగైన స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీ రేట్లు మరింత త్వరగా లభిస్తాయి.
- క్రెడిట్‌ను పునర్నిర్మించుకునే వారికి ప్రయోజనం ఉంటుంది. గతంలో లోపాలు ఉన్నవారు.. ఇప్పుడు క్రెడిట్‌ను వేగంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
- ప్రతి ఏడు రోజులకు credit score అప్‌డేట్ అవ్వడం వల్ల.. రుణాలు, క్రెడిట్ కార్డులు, మెరుగైన వడ్డీ రేట్లు వంటి చాలా లాభాలు ఉంటాయి. ఇది సమాన్యులకు మేలు చేస్తుంది. ఇది భారతదేశంలో క్రెడిట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చనుంది.


Click it and Unblock the Notifications