Multibagger Stock: 11 నెలల్లో రూ.425 నుంచి రూ.1278 చేరిన స్టాక్ ఇదే..!
2026లో స్టాక్ మార్కెట్లు అనుకున్న స్థాయిలో రాణించలేదు. కానీ స్టాక్స్ మాత్రం మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించాయి. ఆ మల్టీబ్యాగర్ స్టాక్‌లలో రేమండ్ షేర్లు ఒకటిగా ఉంది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 2026లో ఒక్కో షేరుకు రూ.425.60 నుంచి రూ.1,278.80కి పెరిగింది. తన వాటాదారులకు ఈ ఏడాది ప్రారంభం నుంచి 200 శాతం రాబడిని అందించింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఆరు నెలల్లో 135 శాతానికి పైగా రాబడి ఇవ్వగా.. ఒక నెలలో 20 శాతానికి పైగా పెరిగింది. ఒక సంవత్సరంలో రేమండ్ షేర్లు తమ వాటాదారులకు 165% రాబడిని ఇచ్చాయి. గత వారం శుక్రవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పటికీ, రేమండ్ షేరు ధర 8 శాతానికి పైగా పెరిగి ఎన్ఎస్ఈలో ఒక్కో షేరుకు రూ.1,278.80 వద్ద ముగిసింది.
ఈ కంపెనీ డిఫెన్స్, ఇంజనీరింగ్ రంగంలోకి రీబ్రాండింగ్ చేసుకోవడం, నిరంతర ఆర్డర్ల రావడం, క్యాపెక్స్ విస్తరణ, పెరుగుతున్న ఆర్డర్లను తీర్చడానికి విజయవంతమైన నిధుల సమీకరణ, కంపెనీ రీబ్రాండింగ్ కారణంగా స్టాక్‌కు రీ-రేటింగ్ జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇది సంవత్సరం పొడవునా కొనసాగిన బలమైన కొనుగోళ్లను ప్రేరేపించిందని అంచనా వేస్తున్నారు. 2026లో రేమండ్ షేర్ల పెరుగుదలకు కారణంగా అంచనా వేస్తున్నారు. కంపెనీ రక్షణ, ఏరోస్పేస్ రంగాలలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిందని గుర్తు చేశారు. పూర్తిస్థాయి ఇంజనీరింగ్ కంపెనీగా మారిన తర్వాత రేమండ్ షేర్లకు రీ-రేటింగ్ లభించిందని అంచనా వేస్తున్నారు.

రక్షణ, ఏరోస్పేస్ తయారీ రంగం ఆధారంగా పెట్టుబడిదారులు స్టాక్‌కు రీ-రేటింగ్ ఇచ్చారని నిపుణులు చెబుతున్నారు. ఈ కంపెనీకి ప్రముఖ భారతీయ రక్షణ సంస్థ నుంచి 300కు పైగా విడిభాగాల రకాల కోసం సంవత్సరానికి దాదాపు రూ.33 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చినట్లు చెబుతున్నారు. రేమండ్ లైఫ్‌స్టైల్, రేమండ్ రియల్టీ విభజనల తరువాత, రేమండ్ లిమిటెడ్ ఇప్పుడు గ్రూప్ ఇంజనీరింగ్ వ్యాపారానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. కంపెనీ పేరును రేమండ్ ఏరోస్పేస్, డిఫెన్స్ & ఇంజనీరింగ్ లిమిటెడ్‌గా మార్చడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
సెప్టెంబర్ 2026లో బోర్డు మినర్వా వెంచర్స్ ఫండ్‌కు ఒక్కో వారెంట్‌కు రూ.645 చొప్పున 33.28-33.29 లక్షల వరకు కన్వర్టిబుల్ వారెంట్లను జారీ చేయడానికి ఆమోదం తెలిపింది. దాదాపు రూ.214.71 కోట్ల వరకు సమీకరించింది. దీనికి తర్వాత వాటాదారులు కూడా ఆమోదం తెలిపారు. ఆ సమయంలో ఉన్న మార్కెట్ స్థాయిల కంటే ఎక్కువ ధరకు వారెంట్లను నిర్ణయించడం, తదనంతర భారీ ట్రేడింగ్ వాల్యూమ్‌లు ధరలో ఆకస్మిక పెరుగుదలకు దారితీశాయని అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications