ఫుడ్ డెలివరీ విభాగంలో టాప్ లో దూసుకుపోతున్న స్విగ్గి, జోమోటా అధినేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు ప్రముఖ రైడర్ యాప్ ర్యాపిడో అధినేత రెడీ అవుతున్నారు. మార్కెట్లో ఈ రెండింటికన్నా అత్యంత తక్కువ ధరకే ఫుడ్ డెలివరీని అందించేందుకు ర్యాపిడో శరవేగంగా పావులు కదుపుతోంది. ఈ వార్తలతో ఒక్కసారిగా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ లిమిటెడ్ తో పాటు జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ లిమిటెడ్ షేర్లు సోమవారం పడిపోయాయి.
జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ షేరు విలువ ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 2 శాతం నష్టంతో రూ.256 వద్ద ముగియగా.. స్విగ్గీ షేరు విలువ 2.63 శాతం నష్టంతో రూ364.90 వద్ద క్లోజ్ అయింది. ఓలా, ఉబర్ తరహాలో క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ర్యాపిడో ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశిస్తుందనే వార్తలు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato)లను కుదిపేస్తున్నాయి. గత 12 నెలల్లో ఎటర్నల్ 40.38% పెరిగినప్పటికీ, ఇది సంవత్సరం నుండి నేటి వరకు 7.18% పడిపోయింది. మరోవైపు..స్విగ్గీ సంవత్సరం నుండి నేటి వరకు 32.56%,దాని లిస్టింగ్ నుండి 20% తగ్గింది.

కాగా ఇప్పటివరకు ఫుడ్ డెలివరీ విభాగంలో ఈ రెండు కంపెనీలు రారాజుగా వెలుగొందుతున్నాయి. మధ్యలో కొన్ని కంపెనీలు వచ్చినా ఈ రెండింటి దెబ్బకు పోటీలో నిలబడలేకపోయాయి. ఇప్పుడు క్యాబ్ సేవలందిస్తున్న ర్యాపిడో (Rapido) తన సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అయితే మార్కెట్లోకి అడుగుపెట్టకముందే స్విగ్గి, జోమోటాలను వణికించింది. ఫుడ్ విభాగంలో ఎంట్రీ ఇచ్చే వార్తలకే ఆ రెండు కంపెనీలు షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇక పూర్తి స్థాయిలో వస్తే పరిస్థితి ఏంటనే దానిపై ఆ రెండు కంపెనీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
ముఖ్యంగా ర్యాపిడ్ కంపెనీ అనుసరించబోయే ఫిక్స్‌డ్ కమీషన్ మోడల్ స్విగ్గీ, జొమాటోను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ర్యాపిడో మోడల్ ఓ సారి చూసుకున్నట్లయితే...రూ.400లోపు ఆర్డర్లకు 25 రూపాయలు..అలాగే రూ.400పైబడిన ఆర్డర్లకు 50 రూపాయలు చొప్పున హోటళ్లు/ రెస్టారంట్ల నుంచి కమీషన్ తీసుకోనుంది. ఈ నిర్ణయంతో స్విగ్గి, జోమోటాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో 16-30 శాతం కమీషన్ తీసుకుంటున్నాయి. దీంతో పోలిస్తే ర్యాపిడో తీసుకునే కమీషన్ 8-15శాతం మధ్యనే ఉండనుంది.
జులై నెలలో బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఫుడ్ సేవలకు ర్యాపిడో శ్రీకారం చుట్టబోతోందని సమాచారం. ఇప్పటికే రెస్టారంట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికి ర్యాపిడో యాప్‌లోనే రెస్టారంట్ల లిస్ట్ కూడా కనిపించనుందని ర్యాపిడో అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే స్విగ్గీ, జొమాటో గుత్తాధిపత్యానికి ర్యాపిడో గండి కొడుతుందా లేక తెర వెనక్కి వెళ్లిపోతుందా అనేది ర్యాపిడ్ వ్యాపారంలోకి ప్రవేశించే వరకు తెలియదు. అయితే ఫిక్స్‌డ్ కమీషన్ మోడల్ మాత్రం ఆ రెండు కంపెనీలకు చెక్ పెట్టే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications