Rajputana Biodiesel IPO: డిసెంబర్ మాసం నిజంగా ఐపీవో ఇన్వెస్టర్లకు కలిసొచ్చిందని చెప్పుకోవాలి. వరుసగా మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఐపీవోలు ఊహించని లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లు ఎంత ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ఐపీవోలు మాత్రం గురిచూసి కొట్టినట్లు భారీ లాభాలను తొలిరోజు లిస్టింగ్‌తోనే ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రాజ్‌పుతానా బయోడీజిల్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో బలమైన జాబితాను నమోదు చేయటంతో షేర్లు పొందిన ఇన్వెస్టర్ల డబ్బు రెట్టింపు అయ్యింది. ముందుగా షేర్లు ఇష్యూ ధర కంటే 90 శాతం ప్రీమియం ధర రూ.247 వద్ద ఒక్కోటి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. అయితే జాబితా తర్వాత కూడా కొనసాగిన గొనుగోళ్లతో కంపెనీ షేర్ ధర రూ.259.35 స్థాయికి పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు దాదాపు తొలిరోజునే 100 శాతం రాబడితో తమ డబ్బును రెండింతలు చేసుకున్నారు. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.24.70 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో ఎన్ఎస్ఈలో నేడు జాబితాను నమోదు చేసింది.

కంపెనీ తన ఐపీవో ఇష్యూను సాధారణ ఇన్వెస్టర్ల కోసం నవంబర్ 26 నుంచి నవంబర్ 28 వరకు సబ్‍స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.123-130గా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 1000 షేర్లుగా నిర్ణయించటంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.1,30,000 కనీసం పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. అయితే కంపెనీ ఐపీలో బంపర్ లిస్టింగ్ గెయిన్స్ కారణంగా తొలిరోజే పెట్టుబడిదారులు రూ.1.30 లక్షలు రాబడిగా ఒక్కో లాట్ పై అందుకున్నారు. ఈ క్రమంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.6.70 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఐపీవోకి ముందు కంపెనీలో 90 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా ప్రస్తుతం 65.68 శాతానికి తగ్గింది.
కంపెనీ ఐపీవో ఇష్యూ ప్రారంభమైన నాటి నుంచే విశేష స్పందనను పొందింది. ఐపీవో మొత్తం 718.81 రెట్లు సబ్‌స్క్రైబ్ అందుకోగా.. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 746.57 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ 1345.96 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల విభాగం 177.38 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకున్నాయి. ఇక కంపెనీ వ్యాపారం విషయానికి వస్తే.. రాజ్‌పుతానా బయోడీజిల్ 2016లో స్థాపించబడింది. కంపెనీ జీవ ఇంధనాలు, వాటి ఉప ఉత్పత్తులను తయారీ సరఫరాలో ఉంది. రాజస్థాన్‌లోని ఫూలేరాలో కంపెనీ ఉత్పత్తి సౌకర్యం 4000 చదరపు మీటర్లుగా ఉంది. కంపెనీ ఆమోదించిన ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 30 కిలోలీటర్లు. కంపెనీ బయో-డీజిల్, క్రూడ్ గ్లిజరిన్, కాస్టిక్ పొటాష్ ఫ్లేక్స్, వేస్ట్ స్లడ్జ్, వాడిన వంట నూనె, ఎస్టెరీడ్ ఫ్యాటీ యాసిడ్, మిథనాల్, సిట్రిక్ యాసిడ్, రిఫైన్డ్ రైస్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, సోడియం మెథాక్సైడ్, RBD పామ్ స్టెరిన్, సెమీ-లైసర్ జాబ్ వర్క్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications