Rajesh Power IPO: డిసెంబర్ నెల ప్రారంభమైనప్పటికీ ఈక్విటీ మార్కెట్లు మాత్రం ఇంకా ఒడిదొడుకుల్లోనే ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ క్రమంలో నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ ఐపీవోలు మాత్రం సూపర్ లాభాల లిస్టింగ్ నమోదు చేశాయి. దీంతో ఐపీవోలపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం పండుగ చేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రాజేష్ పవర్ సర్వీసెస్ కంపెనీ షేర్ల గురించే. కంపెనీ షేర్లు నేడు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్ట్ అయ్యాయి. తొలిరోజే ఐపీవో ఇష్యూ రేటు కంటే 90 శాతం ప్రీమియం ధర రూ.636 వద్ద అడుగుపెట్టడంతో ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు. వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమైన వేళ స్టాక్ మాత్రం గ్రేమార్కెట్లో ఇన్వెస్టర్లు అంచనాలకు అనుగుణంగా బలమైన జాబితాను నమోదు చేసింది. దీనికి తోడు లిస్టింగ్ తర్వాత కూడా కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్ల నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో స్టాక్ ధర రూ.668.30 స్థాయికి ఎగబాకింది. దీంతో తొలిరోజే ఇన్వెస్టర్లు ఏకంగా 100 శాతం లిస్టింగ్ గెయిన్స్ పొందారు.

వాస్తవానికి ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.160.47 కోట్లను సమీకరించింది. అయితే ఇందులో రూ.93.47 కోట్లకు తాజా ఈక్విటీ విక్రయం ఉండగా.. మిగిలిన రూ.67 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించటానికి 20 లక్షల షేర్లను ఇష్యూలో విక్రయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో నవంబర్ 25 నుంచి నవంబర్ 27 వరకు అందుబాటులో ఉంది. అలాగే కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.319-335గా ఉంచింది. ఈ క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 400 షేర్లుగా నిర్ణయించటంతో ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనటానికి కనీసం రూ.1.34 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.44.77 కోట్లను సమీకరించింది.
ఐపీవో ఇష్యూ బుక్కింగ్ గురించి పరిశీలిస్తే రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 31.96 రెట్లు, ఎన్ఐఐ విభాగం 138.46 రెట్లు, క్యూఐబీ పోర్షన్ 46.39 సార్లు సభ్యత్వాన్ని పొందాయి. తాజా ఐపీవో ద్వారా సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ కేబుల్ గుర్తింపు, టెస్టింగ్ అండ్ ఫాల్ట్ లొకేషన్ పరికరాల సహా అనేక కీలక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని భావిస్తోంది. ఇదే క్రమంలో ఈ సొమ్ములో కొంత భాగాన్ని 1300 KW DC సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి, ఎలక్ట్రోలైజర్‌ల వంటి అనుబంధ పరికరాలతో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యం, అంతర్గత అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి నిధులను ఉపయోగించాలని చూస్తోంది. 1971లో స్థాపించబడిన రాజేష్ పవర్ సర్వీసెస్ లిమిటెడ్ రాష్ట్ర ట్రాన్స్ మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, ప్రైవేట్ యుటిలిటీలు పరిశ్రమలకు కన్సల్టెన్సీని అందిస్తుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications