Stock market: రూ. 100 ని కోటి రూపాయలు చేసే ఫార్ములా! మార్కెట్ దిగ్గజం చెప్పిన ఆ 3 రహస్యాలేంటి?
భారత స్టాక్ మార్కెట్ (Stock market) ఇప్పుడు ప్రపంచం చూపును తనవైపు తిప్పుకుంటోంది. ప్రముఖ మార్కెట్ దిగ్గజం, మోతీలాల్ ఓస్వాల్ కో-ఫౌండర్ రామ్ దేవ్ అగర్వాల్ గారు ఇండియాను ఒక వేగంగా దూసుకెళ్లే 'ఫెరారీ' కార్ తో పోల్చారు. తాజాగా జరిగిన ఒక ఇన్వెస్టర్ల వేడుకలో ఆయన మాట్లాడుతూ, వచ్చే 12 ఏళ్లలో సెన్సెక్స్ ఏకంగా 3,00,000 మార్కును తాకుతుందని జోస్యం చెప్పారు. అంటే ఇప్పుడున్న స్థాయి కంటే కొన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందన్నమాట!

విజన్, ధైర్యం, ఓపిక.. ఇవే మల్టీబ్యాగర్ రహస్యాలు
చాలామంది ఇన్వెస్టర్లు తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలని చూస్తారు. కానీ, రామ్ దేవ్ అగర్వాల్ గారి ప్రకారం ఒక షేరు మల్టీబ్యాగర్ (అంటే పెట్టిన పెట్టుబడికి వందల రెట్లు లాభం ఇవ్వడం) అవ్వాలంటే మూడు విషయాలు చాలా ముఖ్యం. అవి..
- విజన్: ఏ రంగం భవిష్యత్తులో బాగుంటుందో ముందే ఊహించడం.
- ధైర్యం: నమ్మకం ఉన్న స్టాక్ పడిపోయినా అమ్మకుండా ఉంచుకోవడం.
- ఓపిక: కాంపౌండింగ్ మ్యాజిక్ జరగాలంటే చాలా కాలం వేచి చూడాలి.
చివరి కొన్ని ఏళ్లలోనే సంపద సృష్టించబడుతుందని, 100 రెట్లు లాభం ఇచ్చే స్టాక్ చివరి ఐదు ఏళ్లలోనే అసలైన మ్యాజిక్ చూపిస్తుందని ఆయన వివరించారు.
భారత్ ఎందుకు ఫెరారీ?
దక్షిణ కొరియా మార్కెట్ (KOSPI) , భారత సెన్సెక్స్ రెండూ ఒకే రోజు (1980, జనవరి 1) మొదలయ్యాయి. కానీ ఈరోజు కొరియా మార్కెట్ 5,000 పాయింట్ల దగ్గర ఉంటే, మన భారత మార్కెట్ 80,000 పాయింట్లు దాటి దూసుకుపోతోంది. మన దేశంలో కంపెనీలు సగటున ఏడాదికి 14 శాతం వృద్ధిని సాధిస్తుంటే, అమెరికా వంటి దేశాల్లో అది కేవలం 7 శాతంగానే ఉంది. అందుకే భారత్ లాంటి వేగంగా ఎదిగే దేశంలో పెట్టుబడి పెట్టడం సురక్షితమని ఆయన అభిప్రాయపడ్డారు.
వీటి జోలికి అస్సలు వెళ్లకండి!
పెట్టుబడుల విషయంలో ఆయన కొన్ని కఠినమైన రూల్స్ పాటిస్తారు. ఒక కంపెనీకి 'రిటర్న్ ఆన్ ఈక్విటీ' (RoE) 20 శాతం కంటే తక్కువ ఉంటే.. ఆ కంపెనీ మీటింగ్‌కి కూడా వెళ్లనని ఆయన తెగేసి చెప్పారు. అలాగే, యాజమాన్యం (Promoters) నిజాయితీగా లేకపోతే, అలాంటి స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే వాళ్ళు నరకానికి వెళ్తూ మిమ్మల్ని కూడా తీసుకెళ్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కంపెనీ ప్రెజెంటేషన్లు మాత్రమే చూడకుండా, స్వయంగా ఫ్యాక్టరీలకు వెళ్లి అక్కడి పరిస్థితులు గమనించాలని సూచించారు.
తదుపరి మల్టీబ్యాగర్లు ఎక్కడ ఉన్నాయి?
ప్రస్తుతం 'క్విక్ కామర్స్' (10 నిమిషాల్లో డెలివరీ చేసే యాప్స్) రంగం భారత్ లో ఒక విప్లవంలా మారుతోందని ఆయన చెప్పారు. ఇది ఒకప్పుడు టెలికాం రంగం ఎలా ఎదిగిందో, ఇప్పుడు క్విక్ కామర్స్ కూడా అలాగే ఎదిగే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. అలాగే పెరుగుతున్న డీమ్యాట్ అకౌంట్ల వల్ల బ్రోకింగ్ కంపెనీలు, ఎక్స్ఛేంజీలు కూడా బాగా లాభపడతాయని ఆయన అంచనా వేశారు. ఆశ్చర్యకరంగా, ఇంత అనుభవం ఉన్న ఆయన కూడా BSE స్టాక్ 50 రెట్లు పెరిగినా ఒక్క రూపాయి కూడా అందులో సంపాదించలేకపోయాడని నిజాయితీగా ఒప్పుకున్నారు.
మొత్తానికి రామ్ దేవ్ అగర్వాల్ గారి మాటలు వింటే, కాస్త ఓపికతో సరైన కంపెనీలను ఎంచుకుంటే స్టాక్ మార్కెట్ (Stock market) లో కోటీశ్వరులు అవ్వడం అసాధ్యమేమీ కాదని అర్థమవుతుంది.


Click it and Unblock the Notifications