Quadrant Future Tek IPO: కొత్త ఏడాది రెండవ వారంలో ఐపీవోల రద్దీ తిరిగి ప్రారంభమైపోయింది. వద్దన్నా వరుసగా ఐపీవోలు క్యూ కడుతున్నాయి. దీంతో దేశీయ ఇన్వెస్టర్లలో జోరు కొనసాగుతూనే ఉంది. బెట్టింగ్ వేసేందుకు తాము సిద్ధమే అంటూ ఎగబడుతున్న వేళ ఐపీవో ప్రారంభానికి ముందే గ్రేమార్కెట్లో అదరగొడుతున్నాయి. అస్థిర ఈక్విటీ మార్కెట్లలో బలమైన రాబడులను తెచ్చిపెడుతున్నాయి ఐపీవోలు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వస్తున్న ఐపీవో తాజా ఇష్యూ ద్వారా మార్కెట్ల నుంచి తన మూలధన అవసరాల కోసం రూ.290 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ పూర్తిగా కోటి తాజా ఈక్విటీ షేర్లను ఐపీవోలో విక్రయానికి ఉంచాలని నిర్ణయించింది. వాస్తవానికి రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం కంపెనీ ఐపీవో జనవరి 7 నుంచి జనవరి 9 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే షేర్ల అలాట్మెంట్ జనవరి 10న నిర్ణయించబడుతుందని తెలుస్తోంది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కంపెనీ షేర్లు ఏకకాలంలో జనవరి 14న ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.

కంపెనీ ఇప్పటికే తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.275 నుంచి రూ.290గా నిర్ణయించింది. దీంతో కంపెనీ ఐపీవోలో పార్టిసిపేట్ చేసేందుకు లాట్ పరిమాణాన్ని 50 షేర్లుగా నిర్ణయించటంతో ఒక లాట్ కొనుగోలుకు రూ.14,500 కనీసం వెచ్చించాల్సి వస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కొనుగోలు నుంచి బెట్టింగ్ వేయవచ్చు. ఐపీవో తెరచుకోకముందే ఇన్వెస్టర్ల నుంచి భారిగా స్పందన కనిపించటంతో గ్రేమార్కెట్లో ఒక్కో షేరుకు రూ.180 ప్రీమియం పలుకుతోంది. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే షేర్ ఒక్కోటి మార్కెట్లో 62.07 శాతం ప్రీమియం ధర రూ.470 వద్ద జాబితా అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ తాజా ఐపీవో నుంచి సేకరించే మెుత్తాన్ని దీర్ఘకాలిక మూలధన అవసరాలతో పాటు రుణ చెల్లింపులకు, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ అభివృద్ధి కోసం ఉపయోగించాలని నిర్ణయించింది.
కంపెనీ వ్యాపారం..
వాస్తవానికి కంపెనీ 2015 సెప్టెంబరులో స్థాపించబడింది. ఈ సంస్థ తర్వాతి తరం రైలు కంట్రోల్ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థ కవచ్ ప్రాజెక్టపై పనిచేస్తోంది. ఇది భారత ప్రభుత్వం కోసం దీనిని అభివృద్ధి చేస్తోంది. ఇది రైళ్ల భద్రతను పెంచుతూ ప్రమాధాలను అరికట్టి ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు చేపట్టిన ప్రాజెక్ట్. కంపెనీకి ఎలక్ట్రాన్ బీమ్ రేడియేషన్ సెంటర్‌తో కూడిన ప్రత్యేక కేబుల్ తయారీ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది. ట్రైన్ కంట్రోల్ & సిగ్నలింగ్ డివిజన్ కోసం స్పెషాలిటీ కేబుల్స్, హార్డ్‌వేర్ తయారీ, టెస్టింగ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం.. విలేజ్ బాస్మా, తహసిల్ బానూర్, డిస్ట్ మొహాలిలో కంపెనీ ఫ్యాక్టరీలను కలిగి ఉంది. ఈ క్రమంలో ప్రముఖ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ దిలీప్ దవ్డా ఐపీవోపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ AVoid చేయాలని పెట్టుబడిదారులకు సూచించారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications