Quadrant Future Tek IPO: బ్రేకు లేకుండా స్టాక్ మార్కెట్లోకి కొత్త ఏడాది కూడా ఐపీవోలు క్యూ కట్టాయి. అయితే గత ఏడాదితో పోల్చితే ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఐపీవోలు వస్తూనే ఉన్నాయి. ఒకపక్క స్టాక్ మార్కెట్లు భారీ ఓలటాలిటీతో ఇన్వెస్టర్లను గందరగోళానికి గురిచేస్తుండగా.. ఐపీవోలు మాత్రం మంచి రాబడులను అందించటం చాలా మందిని ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.290 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఐపీవోలో కంపెనీ కోటి తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం జనవరి 7న ప్రారంభమైన ఐపీవో 9 వరకు అందుబాటులో ఉండనుంది. ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న భారీ స్పందన కారణంగా రెండు రోజుల్లోనే ఐపీవో 135 రెట్లు సబ్‌స్క్రిప్షన్ చూసింది. అయితే బెట్టింగ్ వేయాలనుకునే వారికి ఇప్పటికీ మరో రోజు అవకాశం అందుబాటులో ఉంది.

జనవరి 14న కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.275-290గా నిర్ణయించింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనటానికి కనీసం రూ.14,500 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని వెల్లడైంది. అయితే కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.130.50 కోట్లను సమీకరించింది. ఐపీవో తర్వాత ప్రమోటర్లకు కంపెనీలో ఉన్న వాటా 93.33 శాతం నుంచి 70 శాతానికి తగ్గిపోనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం కంపెనీ ఐపీవో ఇష్యూ సబ్ స్క్రిప్షన్ కోసం తెరచి ఉండగా గ్రేమార్కెట్లో మాత్రం భారీ లాభాలు పలుకుతోంది. పెట్టుబడిదారులు కంపెనీ షేర్లను దక్కించుకునేందుకు భారీగా దరఖాస్తులు సమర్పిస్తున్న వేళ 73 శాతం ప్రీమియం పలుకుతోంది. అంటే ఒక్కో షేరుపై లిస్టింగ్ రోజున ఇన్వెస్టర్లు రూ.210 లాభాన్ని పొందవచ్చని తెలుస్తోంది. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే స్టాక్ ధర లిస్టింగ్ రోజున రూ.500 వద్ద ఎంట్రీ ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
కంపెనీ వ్యాపారం..
వాస్తవానికి కంపెనీ 2015 సెప్టెంబరులో స్థాపించబడింది. ఈ సంస్థ తర్వాతి తరం రైలు కంట్రోల్ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థ కవచ్ ప్రాజెక్టపై పనిచేస్తోంది. ఇది భారత ప్రభుత్వం కోసం దీనిని అభివృద్ధి చేస్తోంది. ఇది రైళ్ల భద్రతను పెంచుతూ ప్రమాధాలను అరికట్టి ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు చేపట్టిన ప్రాజెక్ట్. కంపెనీకి ఎలక్ట్రాన్ బీమ్ రేడియేషన్ సెంటర్‌తో కూడిన ప్రత్యేక కేబుల్ తయారీ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది. ప్రముఖ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ దిలీప్ దవ్డా ఐపీవోపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ Avoid చేయాలని పెట్టుబడిదారులకు సూచించారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications