Quadrant Future Tek IPO: సంక్రాంతి కోడి పందాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉంటదో.. స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం ఐపీవోలపై ప్రజలకు అంత క్రేజ్ కొనసాగుతోంది. రెండు చోట్లా ప్రజలు పందెం వేసేది కాసుల కోసమే. ఈ క్రమంలో పెట్టుబడిదారులు ఈక్విటీలను పక్కనపెట్టి ఐపీవోలపై తమ ఫోకస్ కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ కంపెనీ ఐపీవో గురించే. తాజాగా కంపెనీ ఐపీవో ఇష్యూలో పాల్గొన్న పెట్టుబడిదారులకు షేర్ల అలాట్మెంట్ స్టేటస్ ఫైనలైజ్ చేసింది. పెట్టుబడిదారులు బీఎస్ఈ వెబ్‌సైట్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు. పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందనను చూడటంతో గ్రేమార్కెట్లో స్టాక్ భారీ ప్రీమియం ధర పలుకుతోంది. ప్రస్తుతం కంపెనీ షేర్లు వాస్తవ ఇష్యూ ధర కంటే రూ.171 ప్రీమియం వద్ద ఉన్నాయి. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే స్టాక్ ఒక్కోటి రూ.461 వద్ద జాబితా కావొచ్చని తెలుస్తోంది.

మెయిన్ బోర్డు కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.290 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఐపీవోలో కంపెనీ కోటి తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం జనవరి 7న ప్రారంభమైన ఐపీవో 9 వరకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జనవరి 14న కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఐపీవో కోసం కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.275-290గా నిర్ణయించింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనటానికి కనీసం రూ.14,500 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. అయితే కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.130.50 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఐపీవో తర్వాత ప్రమోటర్లకు కంపెనీలో ఉన్న వాటా 93.33 శాతం నుంచి 70 శాతానికి తగ్గనుంది.
కంపెనీ వ్యాపారం..
వాస్తవానికి కంపెనీ 2015 సెప్టెంబరులో స్థాపించబడింది. ఈ సంస్థ తర్వాతి తరం రైలు కంట్రోల్ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థ కవచ్ ప్రాజెక్టపై పనిచేస్తోంది. ఇది భారత ప్రభుత్వం కోసం దీనిని అభివృద్ధి చేస్తోంది. ఇది రైళ్ల భద్రతను పెంచుతూ ప్రమాధాలను అరికట్టి ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు చేపట్టిన ప్రాజెక్ట్. కంపెనీకి ఎలక్ట్రాన్ బీమ్ రేడియేషన్ సెంటర్‌తో కూడిన ప్రత్యేక కేబుల్ తయారీ సౌకర్యాన్ని కలిగి ఉంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications