లక్నోకు చెందిన పీటీసీ ఇండస్ట్రీస్ షేర్లు ఈ రోజు స్టాక్ మార్కెట్లో దూసుకుపోయాయి. రక్షణ రంగంలో బ్రహ్మోస్ నుంచి పీటీసీకి భారీ ఆర్డర్ రావడంతో షేర్లు దుమ్మురేపాయి. గురువారం కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం.. సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి కార్యక్రమంలో ఉపయోగించే కీలకమైన టైటానియం కాస్టింగ్‌లను సరఫరా చేయడానికి బ్రహ్మోస్ ఏరోస్పేస్ రూ. 100 కోట్లకు పైగా ఆర్డర్ ఇచ్చింది.
అయితే పీటీసీ ఇండస్ట్రీస్‌కి ఇది కొత్త విషయమేమి కాదు. 2019 నుంచే కంపెనీ బ్రహ్మోస్‌తో అనుబంధం కలిగి ఉంది. అప్పటి నుంచి ఇది ప్రత్యేకమైన టైటానియం భాగాలు, ముడి పదార్థాలు సరఫరా చేస్తూ వస్తోంది. తాజా ఆర్డర్ ఈ భాగస్వామ్యంలో మరో అడుగు ముందుకేసినట్లేనని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ తన ప్రకటనలో..ఈ ఆర్డర్ మా దేశం స్వదేశీకరణ ప్రయత్నాల (ఆత్మనిర్భర్ భారత్) దిశగా ముందుకు సాగుతున్న సమయానికి వచ్చినందుకు గర్వంగా ఉందని పేర్కొంది.
భారత రక్షణ రంగానికి PTC Industries ఇప్పటికే విశ్వసనీయ భాగస్వామిగా ఉంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు మిషన్-క్లిష్టమైన భాగాలను అందిస్తోంది.అంతర్జాతీయ స్థాయిలో కూడా పీటీసీ మంచి గుర్తింపు సంపాదించింది. సఫ్రాన్, డసాల్ట్ ఏవియేషన్, BAE సిస్టమ్స్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వంటి ప్రపంచ ఏరోస్పేస్ దిగ్గజాలకు టైటానియం, సూపర్ అల్లాయ్ కాస్టింగ్‌లను ఎగుమతి చేస్తోంది.

కేవలం ప్రస్తుత ఆర్డర్లకే పరిమితం కాకుండా, కంపెనీ ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లో కొత్త తయారీ కేంద్రంలో పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా టైటానియం, సూపర్ అల్లాయ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇది రాబోయే సంవత్సరాల్లో కంపెనీకి మరిన్ని ఆర్డర్లు దక్కే అవకాశాన్ని పెంచుకోబోతోంది. కాగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇచ్చిన కొత్త ఆర్డర్‌ను కంపెనీ 24 నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
వ్యాపార ప్రపంచంలో ఈ వార్త వెలువడిన వెంటనే పీటీసీ ఇండస్ట్రీస్ షేర్లు రాకెట్ లాగా దూసుకుపోయాయి. ఇంట్రాడేలో రూ. 13,778 గరిష్టాన్ని తాకాయి. తర్వాత రూ. 14,559.45 వద్ద ముగిసాయి. అయితే తర్వాత లాభాల స్వీకరణ (profit booking) కారణంగా మధ్యాహ్నం 1:48 గంటలకు NSEలో షేర్ ధర రూ.13,470కి తగ్గి 1.4 శాతం నష్టంతో ట్రేడయ్యాయి. అయితే 21 ఆగస్టు 2020న ఒక్కో షేర్ ధర కేవలం రూ. 291.16 ఉన్న కంపెనీ షేర్లు విలువ 22 ఆగస్టు 2025 నాటికి అదే షేర్ ధర రూ.14,559.45కి పెరిగింది. దీని ప్రకారం.. ఐదు సంవత్సరాల్లో 4, ,800 శాతం కంటే ఎక్కువ రాబడి అందించింది. ఒక వ్యక్తి అప్పట్లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి వాటిని హోల్డ్ చేసి ఉంటే..నేడు ఆ పెట్టుబడి విలువ రూ. 50 లక్షలుగా మారి ఉండేది.
చిన్న పరిశ్రమగా మొదలైన పీటీసీ ఇండస్ట్రీస్.. ఈ రోజు భారత రక్షణ రంగంలో నమ్మకమైన భాగస్వామి గా మన్ననలు పొందింది. దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా గొప్ప పేరు తెచ్చుకుంది. భారీ ఆర్డర్లు, భవిష్యత్తు పెట్టుబడులు, షేర్ మార్కెట్‌లో అద్భుతమైన రాబడులు - ఇవన్నీ కలిపి పీటీసీని పెట్టుబడిదారుల కలల స్టాక్‌గా నిలబెట్టాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications