Robert Kiyosaki: ఏఐ బబుల్ పేలడం పక్కా.. స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతాయి, 1999లో ఇదే జరిగింది..!

ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఆయన బంగారం, వెండి, రాగి, బిట్ కాయిన్లు, స్టాక్ మార్కెట్ తో పాటు పలు అంశంలపై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తాజాగా ఆయన స్టాక్ మార్కెట్ల గురించి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించే చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఏఐ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీగా డబ్బు సంపాదించవచ్చని చాలామంది పెట్టుబడిదారులు నమ్ముతున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే 1999 నాటి పరిస్థితులను ఆయన వివరిస్తున్నారు. అప్పట్లో ఇంటర్నెట్‌ కంపెనీలపై కూడా ఇలాగే భారీ అంచనాలు ఉండేవని గర్తు చేశారు.

ఏఓఎల్, నెట్‌స్కేప్, పెట్స్ డాట్ కామ్ వంటి సంస్థలను భవిష్యత్తు కంపెనీలుగా భావించారు. అయితే కొంతకాలానికే డాట్‌కామ్‌ బబుల్‌ పేలడంతో అనేక కంపెనీల విలువలు కుప్పకూలాయిని రాబర్ట్ కియోసాకి గుర్తు చేశారు. పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏఐ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు, అధిక వాల్యుయేషన్లు ఏర్పడ్డాయని తెలిపారు. ఇవి ఒక దశలో తీవ్రమైన దిద్దుబాటుకు దారితీయవచ్చని హెచ్చరించారు. ఏఐ రంగంలో దాదాపు 1.4 ట్రిలియన్‌ డాలర్ల విలువకు ప్రమాదం ఉందని, పరిస్థితి తీవ్రంగా మారితే స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం సంభవించే అవకాశం ఉందన్నారు.

robert kiyosaki

ఏఐ రంగంలో ప్రస్తుతం ఎన్విడియా వంటి కంపెనీలు అత్యంత కీలకంగా మారాయన్నారు. ఏఐ మోడళ్లకు అవసరమైన చిప్‌లకు భారీ డిమాండ్‌ ఉండటంతో కంపెనీపై పెట్టుబడిదారుల ఆసక్తి కూడా పెరిగిందని గుర్తు చేశారు. అయితే.. జిమ్‌ రికార్డ్స్‌ మాత్రం ఇలాంటి అధిక అంచనాలున్న కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఏఐ రంగంలో బబుల్‌ ఏర్పడితే కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. అందుకే మార్కెట్‌ పడిపోయినా.. తట్టుకోగల పెట్టుబడులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఏఐ నిజంగా ఉపయోగపడే టెక్నాలజీనా? అనే ప్రశ్న కాదు. అది ఇప్పటికే అనేక రంగాల్లో ఉపయోగపడుతోందన్నారు.

కానీ ఆ టెక్నాలజీపై ఉన్న అంచనాలు, కంపెనీల షేర్‌ ధరలు వాటి వాస్తవ వ్యాపార ఫలితాల కంటే చాలా ముందుకు వెళ్లాయా? అన్నదే ప్రశ్న అన్నారు. 1999లో కూడా ఇంటర్నెట్‌ నిజమైన భవిష్యత్తే. కానీ ఆ పేరుతో వచ్చిన ప్రతి కంపెనీ విజయవంతం కాలేదని రాబర్ట్ కియోసాకి గుర్తు చేశారు. చివరికి బబుల్‌ పేలినప్పుడు మంచి కంపెనీలు కూడా మార్కెట్‌ పతనమయ్యాయని పేర్కొన్నారు. ఏఐ విషయంలోనూ ఇదే పరిస్థితి వస్తుందేమోనన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి. మార్కెట్‌ 80 శాతం పడిపోతుంది, 1.4 ట్రిలియన్‌ డాలర్లు ఆవిరవుతాయి ఊహాగానాలను నమ్మాల్సిన పని లేదు కానీ.. జాగ్రత్త ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+