Polycab Shares: నేడు ఇంట్రాడేలో పాలిక్యాబ్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల తాకిడిని చూశాయి. దీంతో స్టాక్ ధరల్లో పెరుగుదల నమోదైంది. అయితే కంపెనీకి సంబంధించిన వచ్చిన సానుకూల వార్త దీనికి కారణంగా తెలుస్తోంది.
వాస్తవానికి పాలిక్యాబ్ సంస్థ దేశీయ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎనుంచి భారీ ఆర్డర్ దక్కించుకుంది. ఒక ప్రాజెక్టు కోసం బిడ్డింగ్ లో పాల్గొన్న కంపెనీ అత్యంత తక్కువ ధరకు బిడ్ చేయటంతో ఏకంగా రూ.4100 కోట్ల విలువైన మెగా డీల్ చేజిక్కించుకుంది. దీంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో గరిష్ఠ ధర రూ.6,934.15కి చేరుకున్నాయి. దీనికి ముందు కంపెనీ షేర్లు అక్టోబర్ 15న రూ.7,607 వద్ద 52 వారాల గరిష్ఠ ధరను తాకింది. కంపెనీ షేర్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి అక్టోబర్ 15 వరకు స్టాక్ లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల సంపద డబుల్ అయ్యింది. ఈ కాలంలో కంపెనీ షేర్లు 100 శాతం పెరుగుదలను చూశాయి. కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.6915 వద్ద స్థిరపడ్డాయి. నేడు మార్కెట్ల ర్యాలీలో స్టాక్ ధర 4.26 శాతం పెరగటంతో రూ.282.45 లాభపడ్డాయి.

కంపెనీ టెలికాం సంస్థ నుంచి పొందిన ఆర్డర్ వివరాలను పరిశీలిస్తే.. పాలిక్యాబ్ కర్ణాటక, గోవా, పుదుచ్చేరిల్లో భారత్ నెట్ కింద మిడిల్ మైల్ నెట్‌వర్క్ నిర్మాణం, అప్‌గ్రేడేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం అతి తక్కువ బిడ్డర్‌గా నిలిచినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ప్రకారం వెల్లడైంది. డిజైన్ బిల్డ్ ఆపరేట్ అండ్ మెయింటెయిన్ (DBOM) మోడల్‌లో కంపెనీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. దాదాపు రూ.4100 కోట్ల విలువైన ప్రాజెక్టును కంపెనీ రానున్న 3 ఏళ్ల కాలంలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ఈ ప్రాజెక్టు నిర్వహణను తర్వాతి 10 ఏళ్ల పాటు కంపెనీ ఒప్పందం కింద కొనసాగించాల్సి ఉంది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో పాలిక్యాబ్ ఇండియా రూ.5498.4 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4217.7 కోట్ల కంటే 30 శాతం అధికం. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.445.21 కోట్లుగా ఉంది. ఇది కిందటి ఏడాది వచ్చిన రూ.429.77 కోట్ల కంటే 3 శాతం అధిక నికర లాభం. అలాగే ప్టెంబర్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 17% పెరిగుదలను నమోదు చేసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లకు పైగా ఉంది. బలమైన మార్కెట్ డిమాండ్‌తో రెండవ త్రైమాసికం, అర్ధ-వార్షిక ఆదాయాలు, లాభాలను అందించడం ద్వారా ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగాన్ని తాము బలమైన నోట్‌తో ముగించినట్లు ఆర్థిక పనితీరుపై ఇందర్ జైసింఘని, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications