ప్రముఖ ఆన్ లైన్ లెర్నింగ్ సంస్థ ఫిజిక్స్‌వాలా (PhysicsWallah) మంగళవారం స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఎంట్రీతోనే ఈ సంస్థ ఊహించని విధంగా భారీ లాభాలను అందించింది. అంచనాల కంటే కూడా ఎక్కువ లాభాలను ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
లిస్టింగ్ ఇలా..
ఫిజిక్స్‌వాలా ఐపీఓ (IPO) ధర రూ.109 గా నిర్ణయించగా.. NSE లో రూ.145 , BSE లో రూ.143.10 వద్ద లిస్ట్ అయింది. అంటే ఐపీఓ ధర కంటే ఏకంగా 33 శాతం ఎక్కువ. ఇంత పెద్ద లాభాన్ని అస్సలు ఊహించలేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. లిస్టింగ్ తర్వాత కూడా షేర్ వాల్యూ మరింత పెరిగి మొదటిరోజు మధ్యాహ్నం నాటికి రూ. 151.15 వద్ద ట్రేడ్ అయింది.

ఫిజిక్స్‌వాలా అంటే..
అలఖ్ పాండే స్థాపించిన ఫిజిక్స్‌వాలా అనేది మొదట ఒక చిన్న యూట్యూబ్ ఛానెల్ గా ఉండేది. ఆ తర్వాత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్ ఇచ్చే ప్లాట్‌ఫారమ్‌గా మారింది. ఇందులో జేఈఈ (JEE), నీట్ (NEET), యూపీఎస్సీ (UPSC) తో పాటు వివిధ రాష్ట్ర స్థాయి పరీక్షలకు కోచింగ్ ఇస్తారు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఇది పెద్ద ఎడ్యుటెక్ కంపెనీగా మారింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎడ్యుకేషన్ బ్రాండ్స్ లో ఇదీ ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థకు యూట్యూబ్‌లో 13.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. దేశవ్యాప్తంగా 303 హైబ్రిడ్ లెర్నింగ్ సెంటర్‌లను నడుపుతోంది.
అంత డిమాండ్ ఎందుకంటే..
యూట్యూబ్ చానెల్ గా ఉన్నప్పట్నుంచే ఫిజిక్స్ వాలాకు మంచి పేరుంది. విద్యార్థుల్లో నమ్మకం, తక్కువ ధరలకే కోచింగ్ ఇవ్వడం, ఆన్‌లైన్ తో పాటు -ఆఫ్‌లైన్ లో కూడా కోచింగ్ ఇవ్వడం వంటి కారణాల వల్ల ఈ బ్రాండ్ కు డిమాండ్ పెరింది. ప్రస్తుతం మనదేశంలోని లాభాలు సంపాదిస్తున్న అతికొద్ది ఎడ్‌టెక్ కంపెనీలలో ఇదొకటి.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
చాలామంది ఇన్వెస్టర్లు ఈ కంపెనీ లాంగ్ టర్మ్ గ్రోత్ పై నమ్మకం ఉంది అని చెప్తున్నారు. ఈ సంస్థపై విద్యార్థలకు ఉన్న నమ్మకం, కంపెనీ లాభాల్లో ఉండడం, ఆఫ్ లైన్ మార్కెట్ కూడా బలంగా ఉండడం వంటివి ఈ కంపెనీకి ఉన్న పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ విషయానికొస్తే.. ఎడ్యుటెక్ రంగాల్లో పోటీ ఎక్కువ ఉంటుంది. సరైన రిజల్ట్స్ చూపించకపోతే బ్రాండ్ వాల్యూ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టాలి. లేదా ప్రస్తుతానికి కొంత లాభాన్ని ఇప్పుడు బుక్ చేసుకుని, మిగిలిన వాటిని స్టాప్ లాస్ పెట్టుకుని కొంతకాలం పాటు ఉంచుకోవచ్చు.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్‌లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications