భారత్ స్టాక్ మార్కెట్‌పై గురిపెట్టిన ఫోన్ పే, ఐపీఓ ద్వారా 1.5 బిలియన్ డాలర్ల నిధులు సమీకరణే లక్ష్యంగా..

PhonePe IPO: భారత్ స్టాక్ మార్కెట్లో మరో సంచలనం జరగబోతోంది.దేశంలోని స్టాక్ మార్కెట్లోకి మరో ఫిన్ టెక్ కంపెనీ రాబోతోంది. లక్షల కోట్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓలోకి రానుంది ప్రముఖ డిజిటల్ చెల్లింపు సంస్థ ఫోన్ పే..అవును మీరు విన్నది నిజం..త్వరలోనే భారత ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే త్వరలో భారత స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 1.5 బిలియన్ల డాలర్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓలోకి రానుందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.

అమెరికన్ రిటైల్ చైన్ వాల్‌మార్ట్ నుండి పెట్టుబడిని కలిగి ఉన్న ఈ డిజిటల్ చెల్లింపు సంస్థ ఆగస్టు ప్రారంభంలో IPO కోసం సెబీకి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పత్రాలు సమర్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కంపెనీ గత ఫిబ్రవరిలోనే ఐపీఓకు సన్నాహాలు ప్రారంభించామని, భారత స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాలని ఆలోచిస్తున్నట్లుగా తెలిపింది. తాజాగా ఎంట్రీపై వచ్చే వార్తలు దీనికి మరింత బలాన్నిస్తున్నాయి.

PhonePe IPO PhonePe 1 5 billion IPO Walmart-backed PhonePe PhonePe DRHP PhonePe IPO 2025 India fintech IPO PhonePe valuation PhonePe UPI market digital payments IPO Indian startup IPOs PhonePe stock listing PhonePe public issue PhonePe fundraising Indian tech IPOs fintech unicorn India 1 5 IPO IPO

2015లో భారత్ లో స్థాపించిన PhonePe ప్రస్తుతం 61 కోట్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లను కలిగి ఉంది. ప్రతిరోజూ దాదాపు 340 మిలియన్ల (34 కోట్ల రూపాయలు) విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. కాగా ఒక్క మే నెలలో 25.14 లక్షల కోట్ల విలువైన 18.68 బిలియన్ లావాదేవీలు యూపీఐ ( యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌) ద్వారా జరిగాయి. ఇది భారత్ లో సరికొత్త రికార్డు కాగా.. ఇందులో PhonePe ఒక్కటే రూ. 12.56 లక్షల కోట్ల విలువైన 8.68 బిలియన్ లావాదేవీలను నమోదు చేసింది. అంటే యూపీఐ లావాదేవీల్లో సగభాగం ఫోన్ పే ద్వారానే జరిగాయి. తరువాత స్థానంలో గూగుల్ పే ఉండగా మూడవ స్థానంలో పేటీఎం ఉంది.

ఫోన్ పో తొలుత సింగపూర్ లో తన ప్రస్థానం ప్రారంభించగా తర్వాత అది భారతదేశంలో సెటిల్ అయింది. ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించిందని వార్తలు వస్తున్నాయి. ఈ PhonePe IPO స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయితే భారత ఫిన్‌టెక్ పరిశ్రమ చరిత్రలో అతిపెద్ద IPO అయ్యే అవకాశం ఉంది. ఫోన్‌పే తన IPO సక్సెస్ ప్రక్రియ కోసం దేశ విదేశ బ్యాంకుల సహాయం కూడా తీసుకోనుంది.

వీటిలో కోటక్ మహీంద్రా క్యాపిటల్, JP మోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, మోర్గాన్ స్టాన్లీ వంటి ప్రముఖ బ్యాంకులను పెట్టుబడిగా ఎంచుకుంది. ఈ బ్యాంకులన్నీ పెట్టుబడిదారులకు కంపెనీ పబ్లిక్ ఆఫర్‌ను చేర్చడంతో పాటు వాటాల విక్రయంలో సహాయపడనున్నాయి. ఇక 2023లో రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, TVS క్యాపిటల్ ఫండ్స్ వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థలు PhonePeలో 100 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని పెట్టాయి. అప్పుడు దాని విలువ 12 బిలియన్లు డాలర్లుగా ఉంది.

ఇక భారతదేశంలో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన మొట్టమొదటి ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం. దీని షేరు ధర ప్రస్తుతం రూ.2,150 నుండి రూ.880కి పడిపోయింది.దాదాపు 58.92 శాతం తగ్గింది.దాని తర్వాత ఐపీఓలోకి మొబిక్విక్ వచ్చింది. డిసెంబర్ 2024లో లిస్టింగ్ అయినమొబిక్విక్ రూ. 279 ఇష్యూ ధర వద్ద రూ. 440 గరిష్ట స్థాయిని తాకింది. అయితే ప్రస్తుతం ఇది 14.9 శాతం తగ్గి రూ. 236 వద్ద దాని ధర ట్రేడవుతోంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+