Multibagger Stock: అదరగొడుతున్న ఫార్మా మల్టిబ్యాగర్ స్టాక్ ఇదే..!
ఫార్మాస్యూటికల్ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ షేర్లు సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాదాపు 9 శాతం పెరిగి రూ.1,897.30 వద్ద ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి (Q2FY27) సంబంధించి బలమైన పనితీరు కనబరచడంతో స్టాక్ లో కొనుగోళ్లు పెరిగాయి. ఎన్ఎస్ఈ లో ఈ షేరు స్వల్పంగా తగ్గి రూ.1,738.80 వద్ద ప్రారంభమైనప్పటికీ వెంటనే పుంజుకుని లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత కొంత లాభాలను కోల్పోయినప్పటికీ సానుకూల ధోరణిలోనే కొనసాగింది. ఉదయం 11 గంటల సమయానికి ఈ షేరు 4.7 శాతం లాభంతో రూ.1,825.90 వద్ద ట్రేడవుతోంది. ఈ పెరుగుదలతో, ఎన్ఎస్ఈలో అత్యధిక విలువతో ట్రేడైన షేర్లలో ఒకటిగా సాయి లైఫ్ సైన్సెస్ నిలిచింది.
ఎన్ఎస్ఈ డేటా ప్రకారం దాదాపు 65 లక్షల షేర్లు చేతులు మారగా వీటి విలువ రూ.1,197.23 కోట్లుగా ఉంది. మార్కెట్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ 2026లో దలాల్ స్ట్రీట్‌లో 'మల్టీబ్యాగర్' స్టాక్‌గా సాయి లైఫ్ సైన్సెస్ అవతరించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు ఈ ఫార్మా షేరు 105 శాతం లాభపడగా, ఇదే కాలంలో నిఫ్టీ 50 సూచీ 5 శాతం క్షీణించింది. గత ఏడాది కాలంలో ఈ షేరు 112 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో (FY27) సాయి లైఫ్ సైన్సెస్ ఏకీకృత నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 17 శాతం పెరిగి రూ.98 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.84 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

Q2FY27లో కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 23 శాతం వృద్ధితో రూ.659 కోట్లకు చేరుకుంది. సమీక్షా కాలంలో ఎబిట్డా 20 శాతం పెరిగి రూ.187 కోట్లకు చేరుకోగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.156 కోట్లుగా నమోదైంది. ఆదాయం ఆధారంగా ఈ త్రైమాసికంలో ఎబిట్డా మార్జిన్ గత ఏడాది ఇదే కాలంలోని 29 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది. FY27 మొదటి ఆరు నెలల కాలానికి తమ క్యాపెక్స్ వ్యయం రూ.621 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది. రూ.1,100 నుంచి రూ.1,300 కోట్ల మొత్తం క్యాపెక్స్ అంచనాకు అనుగుణంగానే ఇది కొనసాగుతోంది. గత త్రైమాసికంలో చేర్చుకున్న మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ ఇంటిగ్రేటెడ్ సహకారంతో కార్యకలాపాలను ప్రారంభించినట్లు కూడా కంపెనీ ప్రకటించింది.
సాయి లైఫ్ సైన్సెస్ సీఆర్ఓ, సీడీఎంఓ వ్యాపారాలలో బలమైన పనితీరు, పటిష్టమైన ఆదాయాల పంపిణీ, ప్రపంచ ఫార్మా అవుట్సోర్సింగ్ అవకాశాన్ని అందిపుచ్చుకునే దాని సామర్థ్యంపై పెరుగుతున్న విశ్వాసం కారణంగా దాని రేటింగ్ గణనీయంగా పెరిగిందని ఎస్బీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. 1999లో స్థాపించిన సాయి లైఫ్ సైన్సెస్ కాలక్రమేణా కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (CRDMO)గా రూపాంతరం చెందింది. ఈ కంపెనీకి హైదరాబాద్, బీదర్, మాంచెస్టర్, బోస్టన్లలో తయారీ కేంద్రాలు ఉన్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications