తక్కువ టైంలో మంచి లాభాల కోసం చూసేవాళ్లు ఎక్కువగా పెన్నీ స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంటారు. ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తుంటాయి. అయితే వీటితో కొన్ని సార్లు ప్రమాదం కూడా ఉంటుంది. వీటిలో ఎంత వేగంగా లాభాలు వస్తాయో.. అంతకంటే వేగంగా నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కొన్ని పెన్నీ స్టాక్స్ భారీ నష్టాల్లో ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

చాలా తక్కువ ధరకు అంటే సుమారు రూ.20 లేదా రూ.50 అంతకంటే తక్కువ ధరకు లభించే స్టాక్స్ ను పెన్నీ స్టాక్స్ అంటుంటారు. ఇవి కొన్నిసార్లు రూ.10 కంటే కూడా తక్కువ ధరకు లభిస్తాయి. ఇవి తక్కువ షేరు ధరలో లభిస్తాయి. కాబట్టి ఎక్కువ షేర్లు కొనొచ్చు. అలాగే కొన్నిసార్లు ఎక్కువ లాభాన్ని కూడా ఇస్తాయి. అయితే ప్రస్తుతం కొన్ని పెన్నీ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. అలాంటి కొన్ని స్టాక్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
నష్టాల్లో ఉన్న టాప్ 10 పెన్నీ స్టాక్స్(penny stocks)
గత నెల రోజుల్లో కొన్ని పెన్నీ స్టాక్స్ 20% నుంచి ఏకంగా 65% వరకు భారీగా పతనమయ్యాయి. రూ. 1,000 కోట్ల లోపు మార్కెట్ క్యాపిటలైజేషన్, రూ. 20 లోపు షేర్ ధర ఉన్న కొన్ని స్టాక్స్‌ను పరిశీలించినప్పుడు ఈ పతనం కనిపించింది. తక్కువ ధరలో ఉండి చురుకుగా ట్రేడవుతున్న పెన్నీ స్టాక్స్‌లో ఎంత పెద్ద ప్రమాదం దాగి ఉందో దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు.
- Mehai Technology: నెల రోజుల్లో -65% నష్టం. ప్రస్తుతం ధర రూ. 2.41.
- Avance Technologies: నెల రోజుల్లో- 58% నష్టం. ప్రస్తుతం ధర రూ. 1.15.
- Spright Agro: నెల రోజుల్లో -41% నష్టం. ప్రస్తుతం ధర రూ. 0.63.
- Kretto Syscon: నెల రోజుల్లో -31% నష్టం. ప్రస్తుతం ధర రూ. 0.97.
- Padam Cotton Yarns: నెల రోజుల పనితీరులో -30% నష్టం. ప్రస్తుతం ధర రూ. 3.00
- Growington Ventures India: నెల రోజుల్లో -30% నష్టం. ప్రస్తుతం ధర రూ. 1.04.
- Empower India: నెల రోజుల పనితీరు గమనిస్తే -27% నష్టం. ప్రస్తుతం ధర రూ. 1.61
- Vantage Knowledge Academy: నెల రోజుల్లో -26% నష్టం. ప్రస్తుతం ధర రూ. 2.00
- Harshil Agrotech: నెల రోజుల పనితీరు గమనిస్తే -22% నష్టం. ప్రస్తుతం ధర రూ. 0.54.
- Welcure Drugs & Pharmaceuticals: నెల రోజుల్లో -22% నష్టం. ప్రస్తుతం ధర రూ. 0.58
పెన్నీ స్టాక్స్... ఎందుకంత ప్రమాదం?
పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది చాలా అస్థిరతతో కూడుకున్నది. వాటి తక్కువ లిక్విడిటీ వల్ల ధరల్లో భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ కంపెనీల గురించిన పబ్లిక్ డిస్‌క్లోజర్‌లు తక్కువగా ఉండటం వలన ధరలు మ్యానిప్యులేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరు ఆపరేటర్లు కృత్రిమంగా ధరలను పెంచి, అమాయక పెట్టుబడిదారులను ట్రాప్ చేసి, ఆ తర్వాత స్టాక్‌ను అమ్ముకుని బయటపడే ప్రమాదం ఉంది. ఫలితంగా, స్టాక్ ధరలు ఒక్కసారిగా పడిపోతాయి.
పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాల్సినవి
పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేవారు, కచ్చితమైన స్ట్రాటజీతో ఉండాలి. రిస్క్ ను కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఏ కంపెనీలోనైనా పెట్టుబడి పెట్టే ముందు, ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్, భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. ఎక్కువ లాభాల ఆశతో, అధిక ప్రమాదాల జోలికి పోవద్దు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం ఉత్తమం.
(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications