Penny Stock: గడచిన కొన్ని వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లోని లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వరుసగా వెలవరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా సంస్థలు తమ పెట్టుబడిదారులకు డివిడెండ్, బోనస్ షేర్స్ రూపంలో బహుమతులను అందిస్తూనే ఉన్నాయి. మార్కెట్లు ఒడిదొడుకులతో పతనంలో ఉన్నప్పటికీ ఈ చర్యలు ఇన్వెస్టర్లకు ఊరటను కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కేబీసీ గ్లోబల్ అనే పెన్నీ స్టాక్ గురించే. ఈ క్రమంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై మరో షేరును ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని సంస్థ తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును హోల్డ్ చేస్తున్న అర్హులైన పెట్టుబడిదారులకు కంపెనీ బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించింది.

కంపెనీ తన బోనస్ షేర్లను ఇన్వెస్టర్లకు అందించే ప్రక్రియను రానున్న 60 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన రికార్డు తేదీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి కంపెనీ ప్రకటించే రికార్డు తేదీనాటికి ఎవరైతే ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ ఖాతాల్లో షేర్లను హోల్డ్ చేస్తూ కంపెనీ బుక్స్ ప్రకారం వారు పెట్టుబడిదారులుగా పరిగణించబడతారు. ఈ పెట్టుబడిదారులు మాత్రమే ఉచిత షేర్లను పొందటానికి అర్హులుగా మారతారు. అందువల్ల ఉచిత బోనస్ షేర్లకు అర్హత పొందటానికి ముందుగా షేర్లను కలిగి ఉండటం ముఖ్యం.
గతంలో కూడా కంపెనీ తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను అందించిన రికార్డును కలిగి ఉంది. చివరిగా కంపెనీ 2021లో తన పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై 4 బోనస్ షేర్లను ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కంపెనీ షేర్లు రెండు సార్లు విభజనకు గురయ్యాయి. 2020లో స్టాక్ ను ఐదు భాగాలుగా స్ప్లిట్ చేయగా.. 2021లో కూడా కంపెనీ షేర్లను మరోసారి విభజించింది. దీంతో స్టాక్ ముఖ విలువ రూ.1కి తగ్గించబడింది. గడచిన ఏడాది కాలంగా కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు దాదాపు 46 శాతం నెగటివ్ రాబడిని అందుకున్నారు. నేడు మార్కెట్లో ఊదయం 9.38 గంటల సమయంలో స్టాక్ ధర ఒక్కోటి రూ.1.13 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.2.56గా ఉండగా, 52 వారాల కనిష్ఠ ధర రూ.1.08గా ఉంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications