ఒక్క మార్పుతో పీబీ ఫిన్‌టెక్ షేర్లు 43 శాతం ఢమాల్.. పాలసీబజార్ పతనం వెనుక అసలు నిజాలు..

PB Fintech Share: దేశీయ ప్రముఖ బీమా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పాలసీబజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ షేర్లలో పతనం నాలుగవ రోజు కూడా నిరాటంకంగా కొనసాగుతోంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు ధర ఏకంగా ఆరు శాతానికి పైగా క్షీణించి రూ. 1,081 వద్దకు జారిపోయింది. వరుసగా నాలుగో రోజు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో గడచిన నాలుగు రోజుల్లోనే పీబీ ఫిన్‌టెక్ షేరు విలువ ఏకంగా 43 శాతం మేర కరిగిపోయి ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

ఈ అనూహ్య పతనానికి బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ తీసుకువచ్చిన నూతన ముసాయిదా ప్రతిపాదనలే ప్రధాన కారణం. హెల్త్, మోటార్, లైఫ్ ఇన్సూరెన్స్ విక్రయాలపై బీమా ఏజెంట్లు, డిజిటల్ అగ్రిగేటర్లకు చెల్లించే కమిషన్లపై స్పష్టమైన పరిమితులు విధించాలని ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. సాధారణంగా పాలసీబజార్ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు పాలసీలను కొనుగోలు చేసినప్పుడు ఆయా బీమా కంపెనీలు చెల్లించే కమీషన్ల పైనే పీబీ ఫిన్‌టెక్ ప్రధాన ఆదాయం ఆధారపడి ఉంటుంది. నూతన నిబంధనలు అమల్లోకి వస్తే ఒక్కో పాలసీపై వచ్చే కమీషన్ తగ్గి, కంపెనీ ఆదాయంపై నేరుగా దెబ్బపడే అవకాశం ఉందన్న భయాలు మార్కెట్లో మొదలయ్యాయి.

PB Fintech Share PB Fintech Shares PB Fintech Share Price Policybazaar Share Policybazaar Stock PB Fintech Crash PB Fintech Stock Crash IRDAI Proposals IRDAI Commission Cap Insurance Commission Cap Insurance Stocks PB Fintech News PB Fintech 43 Fall Policybazaar Share Crash IRDAI Insurance Rules Insurance Distribution Reform PB Fintech Revenue PB Fintech Earnings PB Fintech Share PB Fintech Shares PB Fintech Share Price Policybazaar Share Policybazaar Stock

తాజా పరిస్థితిపై పీబీ ఫిన్‌టెక్ యాజమాన్యం స్పందిస్తూ.. ఖర్చుల నియంత్రణను మినహాయించి చూస్తే, ఈ ప్రతిపాదనలు ఇప్పటి రూపంలోనే అమలులోకి వస్తే ప్రధాన రాబడిపై సుమారు 30 శాతం ప్రతికూల ప్రభావం పడవచ్చని ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే ఈ ప్రభావాన్ని అధిగమించేందుకు నూతన నియామకాల వేగాన్ని తగ్గించడంతో పాటు మార్కెటింగ్, ప్రకటనల వ్యయాలను గణనీయంగా పునఃసమీక్షించుకోవాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

Also Read

ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ, దేశీయ బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌ఎస్‌బిసి సంస్థ ఈ షేరు రేటింగ్‌ను 'హోల్డ్'కు కుదించడమే కాకుండా లక్ష్య ధరను రూ. 2,100 నుండి రూ. 1,150కి సవరించింది. మోతీలాల్ ఓస్వాల్ 'న్యూట్రల్' రేటింగ్‌తో రూ. 1,150 లక్ష్యంగా పేర్కొంది. మరోవైపు బెర్న్‌స్టీన్ సంస్థ నిబంధనల వల్ల కంపెనీ బీమా ఆదాయాలు 40 శాతం వరకు తగ్గి.. 2028 ఆర్థిక సంవత్సరం లాభాలపై 34 శాతం దాకా ప్రభావం ఉండొచ్చని అంచనా వేసినప్పటికీ, దీర్ఘకాలికంగా 'అవుట్‌పెర్ఫార్మ్' రేటింగ్‌తో రూ. 2,310 టార్గెట్ ధరను సమర్థించింది.

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు కూడా తీవ్ర నష్టాల్లో పయనించడం పీబీ ఫిన్‌టెక్ షేరుపై మరింత ఒత్తిడిని పెంచింది. ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్లో చోటుచేసుకున్న పతనం కూడా ఈ షేరును ముంచెత్తింది. అయితే ఈ స్టాక్ భవిష్యత్తు ప్రధానంగా మూడు కీలకాంశాలపై ఆధారపడి ఉండనుంది. మొదటిది ఏంటంటే.. అక్టోబర్ 25న సూచనల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత ఐఆర్‌డీఏఐ ఖరారు చేసే తుది నిబంధనలు. రెండవది.. తుది రూల్స్ వచ్చాక నికర ఆదాయంలో పడే అసలు వ్యత్యాసం. మూడవది.. వ్యయ నియంత్రణల ద్వారా నష్టాన్ని పూడ్చుకునే కంపెనీ నిర్వహణ సామర్థ్యం. రాబోయే రోజుల్లో వెలువడే ఈ అధికారిక డేటాయే షేరు తదుపరి దిశను నిర్దేశించనుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+