నేడు మంగళవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఈ రోజుకు షేర్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 24450 వద్ద గ్రీన్ మార్కులో ఉండగా, నిఫ్టీ కూడా 80845 వద్ద గ్రీన్ మార్కులో స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 53685 వద్ద, నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీస్ 24296 వద్ద ఉన్నాయి. బిఎస్‌ఇలో ఇంట్రాడే ట్రేడ్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇన్ఫో ఎడ్జ్ సహా 251 స్టాక్‌లు ఏడాదిలో సరికొత్త గరిష్టాలను తాకాయి.
డిక్సన్ టెక్నాలజీస్, ఒబెరాయ్ రియాల్టీ, పిబి ఫిన్‌టెక్ (పాలసీబజార్), క్యాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్, ఇక్లెర్క్స్ సర్వీసెస్, అఫిల్ (ఇండియా), దీపక్ ఫెర్టిలైజర్స్, పెట్రోకెమికల్స్ అలాగే కేన్స్ టెక్నాలజీ ఇండియా కూడా 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్న స్టాక్‌లలో నిలిచాయి. మరోపక్క భారత స్టాక్ మార్కెట్‌లో మంచి కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్ 598 పాయింట్లు లేదా 0.74 శాతం లాభపడి 80,845.75 వద్ద, 25 స్టాక్స్ గ్రీన్‌లో ముగిసింది. నిఫ్టీ 50181 పాయింట్లు అంటే 0.75 శాతం పెరిగి 24,457.15 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ షేర్లు టాప్ గెయినర్లుగా ఉండగా భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, సన్ ఫార్మా షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. ఇండెక్స్ పరంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ అండ్ టూబ్రో, ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్‌ల షేర్లు ఆ క్రమంలో ముందు వరుసలో నిలిచాయి.
ఈ రోజు కొన్ని స్టాక్స్ సరికొత్త ఆల్ టైం హైని చూశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ సూచీ 0.92 శాతం అండ్ స్మాల్‌క్యాప్ సూచీ 1.03 శాతం చొప్పున పెరిగాయి. BSEలో లిస్ట్ చేసిన సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లో దాదాపు రూ.449.7 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.453.5 లక్షల కోట్లకు పెరిగింది, పెట్టుబడిదారులను ఒకే రోజులో సుమారు రూ. 3.8 లక్షల కోట్లతో ధనవంతులుగా చేసిందని చెప్పవచ్చు.
ఈరోజు చూస్తే నిఫ్టీ ఇండెక్స్ 0.75% పెరుగుదలను చూస్తూ 24,276.05 వద్ద ట్రేడింగ్ సెషన్‌ను ముగించింది. రోజంతా నిఫ్టీ గరిష్టంగా 24,481.35 వద్ద కనిష్ట స్థాయి 24,280.00 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ 80,949.1 నుండి 80,244.78 మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది, చివరికి 0.74% లాభంతో 80,248.08 వద్ద ముగిసింది.
మిడ్‌క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ 50 కంటే మంచి పనితీరును కనబరిచింది, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 0.83% లాభంతో ముగిసింది. ఇక స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా నిఫ్టీ 50ని అధిగమించాయి, ఎందుకంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 18,845.05 వద్ద ముగిసింది,ఇది 158.5 పాయింట్లు లేదా 0.84% పెంపును సూచిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications