Onyx Biotec IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు భారీగానే కొనసాగుతున్నప్పటికీ ఐపీవోల మార్కెట్ మాత్రం చెక్కుచెదరకుండా ముందుకు సాగుతోంది. వాస్తవానికి గతవారం వచ్చిన ఐపీవోలు ఆరోగ్యకరమైన లాభాలతో లిస్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు కొత్తగా స్టార్ట్ అయిన ఇష్యూలపై కూడా తమ ఫోకస్ కొనసాగిస్తున్నారు. దీంతో కొన్ని ఐపీవోలను కొనుగోలు చేసేందుకు భారీగా ఆకర్షితులవుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఒనిక్స్ బయోటెక్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి ఈ ఐపీవో ఇష్యూ ప్రారంభమైన గంటల్లోనే ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందనతో పూర్తిగా సబ్‍స్క్రైబ్ చేయబడింది. దేశంలోని ఐపీవో దరఖాస్తుదారులు బెట్టింగ్ వేసేందుకు ఇది నవంబర్ 13న ప్రారంభమైంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కంపెనీ ఐపీవో 10 రెట్లు సబ్‌స్రిప్షన్ అందుకుంది. వాస్తవానికి ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లో లిస్టింగ్ కోసం వస్తున్న కంపెనీ ఎన్ఎస్ఈలో జాబితా కానుంది. చిన్న కంపెనీ ఐపీవో అయినప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం భారీగా బెట్టింగ్ వేయటంతో ఐపీవో సర్కిల్‌లో ఇది చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. నేడు గ్రేమార్కెట్లో ఒక్కో షేరుపై రూ.15 ప్రీమియం పలుకుతోంది.

వాస్తవానికి కంపెనీ తన తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.29.34 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లోకి వస్తోంది. ఈ క్రమంలో కంపెనీ పెట్టుబడిదారులకు పూర్తిగా 48.1 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి అందుబాటులో ఉంచింది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం నవంబర్ 13 నుంచి నవంబర్ 18 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ క్రమంలో ఐపీవో తన ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.58-61గా ఉంచింది. పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా ప్రకటించటంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.1.22 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టాల్సివచ్చింది. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8.33 కోట్లను సమీకరించింది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం 50 శాతం వాటాలకు లాక్ ఇన్ పిరియడ్ డిసెంబర్ 19, 2024గా ఉంది. అలాగే 90 రోజుల లాక్ ఇన్ పిరియడ్ ఫిబ్రవరి 17న ముగియనుంది.
కంపెనీ వ్యాపారం..
2005లో స్థాపించబడిన కంపెనీ ఫార్మా రంగంలో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఇది దిగ్గజ ఫారమా కంపెనీలకు ఇంజెక్షన్ల కోసం స్టెర్లైట్ వాటర్ సరఫరా చేస్తోంది. భారత- విదేశీ మార్కెట్‌ల కోసం డ్రై పౌడర్ ఇంజెక్షన్‌లు, డ్రై సిరప్‌ల సమగ్ర శ్రేణిని అందజేస్తూ కాంట్రాక్ట్ తయారీదారుగా పనిచేస్తుంది. హెటెరో హెల్త్‌కేర్ లిమిటెడ్, మ్యాన్‌కైండ్ ఫార్మా లిమిటెడ్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అరిస్టో ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మాక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సహా అనేక ప్రముఖ ఫార్మా కంపెనీలకు సేవలను అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి దేశంలో రెండు తయారీ యూనిట్లు ఉన్నాయి. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ వార్షిక ప్రాతిపదికన నికర లాభం 64.35 శాతం వృద్ధిని నమోదు చేయగా.. ఆదాయం 35.99 శాతం పెరుగుదలను చూసింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications