IT Stocks: దూసుకెళ్లిన ఐటీ స్టాక్స్.. భారీగా పెరిగిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్..!
గత రెండేళ్లుగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్న భారత ఐటీ స్టాక్స్.. గత రెండు నెలల నుంచి కాస్త తెరుకుంటున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ భారత ఐటీ కంపెనీలు ఒత్తిడిలోనే ఉన్నాయి. తాజాగా
గురువారం భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) స్టాక్స్ భారీగా పుంజుకున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ నేతృత్వంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టాక్స్‌లో కొనసాగుతున్న బలహీనత మధ్య భారతీయ ఐటీ స్టాక్స్ నిలకడగా రాణిస్తున్నాయి. మరోవైపు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ భారీ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది.
ఉదయం దాదాపు 11:10 గంటలకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.3 శాతం అధికంగా ట్రేడవుతూ, అగ్రగామి రంగ లబ్ధిదారుగా నిలిచింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ ఇండెక్స్ 33,000 మార్కును దాటి, 33,037 గరిష్ట స్థాయిని తాకింది. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 390 పాయింట్లు పెరిగి 84,328 వద్ద ముగియగా, నిఫ్టీ 50 65 పాయిం ట్లు 25,884 వద్ద ముగిసింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లోని 10 షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. విప్రో 4.2 శాతం పెరిగి రూ. 196.9కి చేరడంతో లాభాల్లో అగ్రగామిగా నిలిచింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ సుమారు 3 శాతం చొప్పున లాభపడగా, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్‌టీఎం సుమారు 2 శాతం చొప్పున పురోగమించాయి.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టెక్ మహీంద్రా 1.7 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ 50లో అత్యధిక లాభాలు పొందిన టాప్ 10 షేర్లలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ ఉన్నాయి. ఎంఫసిస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్, కోఫోర్జ్ కూడా స్వల్ప లాభాలతో ట్రేడయ్యాయి. ఇటీవలి సెషన్లలో భారతీయ ఐటీ స్టాక్‌లు ప్రపంచ ఏఐ-సంబంధిత టెక్నాలజీ స్టాక్‌లతో వ్యతిరేక సంబంధాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఏఐ స్టాక్స్ పడిపోతే భారత ఐటీ స్టాక్స్ పెరుగుతున్నాయి. ఏఐ స్టాక్స్ పెరిగితే భారత ఐటీ స్టాక్స్ తగ్గుతున్నాయి. అయితే ఐటీ స్టాక్స్ ఇంకా పెరిగాల్సిన అవసరం ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications