Jeweller Stocks: ఊపు మీద ఉన్న జ్యువెలరీ స్టాక్స్.. భారీగా పెరిగిన పీసీ, కల్యాణ్ జ్యువెలర్ షేర్లు..!
భారత స్టాక్ మార్కెట్ అంతటా నెలకొన్న విస్తృత సానుకూల సెంటిమెంట్‌లో భాగంగా సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో పీసీ జ్యువెలర్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా, టైటాన్ కంపెనీ మొదలైన ఆభరణాల కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. దీపావళి, దసరా, నవరాత్రి, దుర్గా పూజ వేడుకల కోసం పెట్టుబడిదారులు సిద్ధమవుతున్న తరుణంలో పండుగ సీజన్‌కు ముందు ఈ పెరుగుదల చోటుచేసుకుంది. సోమవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్‌లో పీసీ జ్యువెలర్ సుమార్ 1.5 శాతం, టైటాన్ కంపెనీ లిమిటెడ్ షేర్లు దాదాపు 1.5% పెరిగాయి. అయితే ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 4.5% ర్యాలీతో కళ్యాణ్ జ్యువెలర్స్ వీటిలో అగ్రగామిగా నిలిచింది.
జ్యువెలర్స్ స్టాక్స్ ఈ రోజే కాదు.. గత కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. ధంతేరస్, దీపావళి పండుగలు సమీపిస్తుండటంతో, అక్టోబర్ ఆరంభం కీలకమైన ఆభరణాల కొనుగోలు సీజన్‌కు నాంది పలుకుతుందని బోనాంజా సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అభినవ్ తివారీ తెలిపారు. భారతదేశంలో బంగారం, ఆభరణాల డిమాండ్‌కు ఇది సాంప్రదాయకంగా అత్యంత బలమైన కాలాల్లో ఒకటన్నారు. అందువల్ల, పండుగల సందర్భంగా అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నందున మార్కెట్ ముందుగానే సిద్ధమవుతోందని పేర్కొన్నారు. బంగారం ధరలు బలపడటం కూడా ఆభరణాల స్టాక్‌ల సెంటిమెంట్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్నారు.

ఇటీవల బంగారం దిగుమతులపై ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం వల్ల మార్కెట్లో ఆభరణాల వినియోగం పుంజుకుంది. దీనివల్ల వ్యవస్థీకృత జువెలరీ రీటైలర్ల ప్రాఫిట్ మార్జిన్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆభరణాల కంపెనీలు ఈ వారం తమ సెప్టెంబర్-త్రైమాసిక తాత్కాలిక అమ్మకాల వివరాలను విడుదల చేస్తాయని భావిస్తున్నారు. కానీ ఈ వివరాలు ఇంకా విడుదల కాలేదు. అందువల్ల, నేటి ర్యాలీ చాలావరకు అంచనాలపై ఆధారపడి ఉందని తివారీ పేర్కొన్నారు. ఉదయం 11:30 గంటలకు, కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు బీఎస్ఈలో 4.72% పెరిగి ఒక్కో షేరుకు రూ.554.50 వద్ద ట్రేడయ్యాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.57,266.04 కోట్లుగా ఉంది.
పీసీ జ్యువెలర్ షేర్లు 1.25% పెరిగి ఒక్కో షేరుకు రూ.12.98 వద్ద ముగిశాయి. ఈ స్టాక్ ఇంట్రాడేలో గరిష్టంగా షేరుకు రూ.13.31, కనిష్టంగా ₹12.94 స్థాయిలను తాకింది. ఈ జ్యువెలరీ స్టాక్ గత ఆరు నెలల్లో 57% రాబడిని అందించగా, ఏడాది కాలంలో 3% క్షీణతను నమోదు చేసింది. ఉదయం 11:40 గంటలకు, టైటాన్ కంపెనీ షేర్లు BSEలో 1.40% లాభంతో షేరుకు రూ.4,587.15 వద్ద ట్రేడ్ అయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Mcap) రూ.4,07,240.83 కోట్లుగా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
