స్టాక్ మార్కెట్లో ఓలా షేర్లు కుప్పకూలినా.. కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. కారణం ఇదొక్కటే..

గత ఒక నెలలో స్టాక్ మార్కెట్లో సంచలనాలు రేపిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు ఈ రోజు కుప్పకూలాయి. దాదాపు 8 శాతం మేర పడిపోయాయి. గత ఒక నెలలో ఈ స్టాక్ 77% వరకు పెరిగింది. నూతన ఎంట్రీ స్టాక్‌లలో ఉత్తమ ప్రదర్శన చేసిన వాటిలో ఒకటిగా నిలిచింది. ఇంత ఊపు మీద ఉన్న Ola షేర్లు నేడు పడిపోయాయి.

ఎందుకంటే తాజా GST 2.0 సంస్కరణల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం వాటిపై 5 శాతం GST కొనసాగుతుంది. దీనివల్ల పెట్టుబడిదారులలో కొంత నిరుత్సాహం కనిపించింది.గురువారం ట్రేడింగ్‌లో ఓలా షేర్లు రూ.63.71 వరకు పడిపోయాయి. ఆ తర్వాత కొంత రికవరీ చేసి మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో రూ.65 చుట్టూ ట్రేడయ్యాయి.

ఓలా ఎలక్ట్రిక్ పెరుగుదలకు ప్రధాన కారణం ఏంటంటే.. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ఓలా Gen 3 S1 స్కూటర్ లైనప్ ను అంగీకరించింది. ఈ సర్టిఫికేషన్‌తో.. కంపెనీ 2028 వరకు అమ్మకాల విలువలో 13% నుంచి 18% వరకు ప్రోత్సాహకాలను పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ ఆమోదం ఏడు Gen 3 మోడళ్లకు వర్తిస్తుంది. ఇవి కంపెనీ మొత్తం అమ్మకాలలో సగానికి పైగా వాటా కలిగి ఉన్నాయి. దీని వల్ల ఖర్చులు తగ్గడం, లాభాలు పెరగడం, కంపెనీ లాభదాయకతకు దగ్గర కావడం అనేది నిపుణుల అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ PLI పథకం కింద లభించిన ప్రోత్సాహకాలు, బలమైన సాంకేతిక సూచికలు, పెట్టుబడిదారుల విశ్వాసంగా కూడా చెప్పవచ్చు.

two-wheelers GST cut 350cc bikes GST rate petrol bikes GST impact Ola Electric EV stocks India electric two-wheeler stocks Ola Electric vs petrol bikes stock market news Ola Electric 8 GST 2 0 350cc GST EV GST 2 0

Religare Broking నిపుణులు అజిత్ మిశ్రా మాట్లాడుతూ.. ఓలా స్టాక్ గత రెండు వారాల్లోనే 40 శాతం కంటే ఎక్కువ పెరిగిందని, ఒక నెలలో 50 శాతం కంటే ఎక్కువ ర్యాలీ సాధించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది రూ. 65 నుంచి రూ. 68 వద్ద ముఖ్యమైన రెసిస్టెన్స్‌ను పరీక్షిస్తోందని చెప్పారు. ఆ స్థాయి దాటితే మధ్యకాలంలో స్టాక్ రూ. 80 నుంచి రూ. 90కి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఓలా స్టాక్ బలమైన బ్రేక్‌అవుట్ ఇచ్చిందని, అధిక గరిష్టాలు, అధిక కనిష్టాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆయన ప్రకారం, స్టాక్ రూ. 52 నుంచి రూ. 50కి తగ్గితే కొనుగోలు అవకాశం ఉందని మరోవైపు రూ. 57 దాటితే రూ. 62 నుంచి రూ. 70 వరకు వెళ్ళే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం GST 2.0లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఎటువంటి ఉపశమనం రాకపోవడం పెట్టుబడిదారులకు తాత్కాలిక నిరుత్సాహం కలిగించినా.. PLI పథకం కింద లభించిన ప్రోత్సాహకాలు దీర్ఘకాల వృద్ధికి బలమైన పునాది వేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఒక నెలలో 60 శాతం పెరుగుదల చూసిన ఓలా స్టాక్.. దీర్ఘకాలంలో కూడా పెట్టుబడిదారులకు డబ్బు వర్షం కురిపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

2024 ఆగస్టులో IPO ద్వారా మార్కెట్‌లోకి ఎంట్రీ

ఓలా ఎలక్ట్రిక్ 2024 ఆగస్టులో IPO ద్వారా మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. IPO ధర రూ.76. మొదటి రోజే గణనీయమైన పెరుగుదల నమోదు చేసి, ఆ తర్వాతి ఒక నెలలో దాదాపు 63% ర్యాలీ చేస్తూ రూ.123.9 వరకు చేరుకుంది. అయితే 2025 జూలైలో భారీ పతనాన్ని చవిచూసి రూ.39.6 కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం షేర్ మళ్లీ IPO ధర చుట్టుపక్కల రికవరీ సాధించడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఆగస్టు 2025 నాటికి ప్రభుత్వ వాహన్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం, బజాజ్ ఆటోను అధిగమించి ఓలా ఎలక్ట్రిక్ రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఆగస్టులో ఈ స్టార్టప్ 18,972 యూనిట్లు విక్రయించింది. అయితే, ఇది గత ఏడాదితో పోలిస్తే 31% తగ్గుదలగా చెప్పవచ్చు.

కాగా ఆగస్టు 26న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా కంపెనీ ఒక పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ARAI ఓలా Gen 3 స్కూటర్‌లకు PLI పథకం కింద అర్హత సర్టిఫికేషన్ మంజూరు చేసింది. ఈ సర్టిఫికేషన్ మొత్తం ఏడు Gen 3 మోడళ్లకు వర్తిస్తుంది. అవేంటంటే..S1 Pro 3 kWh, S1 Pro 4 kWh, S1 Pro+ 4 kWh, S1 X 2 kWh, S1 X 3 kWh, S1 X 4 kWh, S1 X+ 4 kWh..ఇవే ప్రస్తుతం కంపెనీ అమ్మకాలలో పెద్ద భాగాన్ని ఆక్రమిస్తున్నాయి.ఈ సర్టిఫికేషన్ వల్ల 2028 వరకు అమ్మకాల విలువలో 13%-18% ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇది Q2FY26 నుంచే లాభదాయకతపై గణనీయమైన ప్రభావం చూపనుంది.

తాజాగా హీలియోస్ మ్యూచువల్ ఫండ్ ఓలా ఎలక్ట్రిక్ షేర్లను తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంది. ఈ ఫండ్ హౌస్ CEO దిన్షా ఇరానీ మాట్లాడుతూ, ఓలాలో వృద్ధి అవకాశాలు ఉన్నాయని, ఇది జొమాటోతో పోల్చదగిన స్టోరీ అవుతుందని చెప్పారు.హీలియోస్ ఒకప్పుడు జొమాటో షేర్లను రూ.40 వద్ద కొనుగోలు చేసి, ఇప్పుడు ఆ స్టాక్ రూ.320 వరకు పెరిగిందని ఉదాహరణ చూపించారు. ఇదే తరహా వృద్ధి అవకాశాన్ని ఓలాలో కూడా చూస్తున్నామని వెల్లడించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+