IPO News: ఈవీ టూవీలర్ దిగ్గజం ఏథర్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నర్.. ఓలాకు ఇక చుక్కలే సామీ..

Ather Energy IPO: భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ రంగంలో అగ్రగామి ఆటగాడిగా కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ కొన్ని నెలల కిందట తన ఐపీవోను విజయవంతంగా మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే రంగంలో మరో కంపెనీ ఐపీవో లాంచ్ కాబోతోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఏథర్ ఎనర్జీ కంపెనీ ఐపీవో గురించే. ఏథర్ తన ఐపీవో లాంచ్ కోసం ఇప్పటికే మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం సెబీ ఏథర్ ఎనర్జీ ఐపీవోకు అనుమతిని ఇవ్వటంతో ఐపీవో ఇన్వెస్టర్లు పిచ్చెక్కిపోతున్నారు. డిసెంబర్ 23న కంపనీ సెబీ నుంచి అబ్జర్వేషన్ లెటర్ అందుకోగా తాజాగా ఐపీవోకు అనుమతిని పొందినట్లు ప్రకటించింది.

Ola electric competitor Ather Energy got nod from SEBI for IPO plans KNow details

ఏథర్ ఎనర్జీ డీఆర్హెచ్పీ డేటా ప్రకారం కంపెనీ తాజా ఈక్వటీ షేర్ల జారీ ద్వారా మార్కెట్ల నుంచి రూ.3,100 కోట్లను రైజ్ చేయాలని చూస్తోందని తెలుస్తోంది. దీనికి తోడు కంపెనీ ప్రమోటర్ల నుంచి 2.2 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ కూడా ఇందులో ఉంటుందని వెల్లడైంది. ఇదే క్రమంలో కంపెనీ ప్రీ ఐపీవో ప్లేస్మెంట్ ద్వారా రూ.620 కోట్లను సమీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏథర్ కంపెనీలో అతిపెద్ద పెట్టుబడిదారుగా హీరో మోటార్స్ కొనసాగుతోంది. హీరోమోటార్స్ కి కంపెనీలో 37.2 శాతం వాటాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే కంపెనీ ప్రస్తుత ఐపీవోలో ఉన్న ఆఫర్ ఫర్ సేల్ ప్రక్రియలో పాల్గొనటం లేదని వెల్లడైంది.

ప్రస్తుత ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ ప్రక్రియలో పాల్గొంటున్న పెట్టుబడిదారుల వివరాలను పరిశీలిస్తే.. టైగర్ గ్లోబల్, కలాడియం ఇన్వెస్ట్‌మెంట్స్, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, బిన్నీ బన్సల్ 3 స్టేట్ వెంచర్స్, కంపెనీ సహ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ తమ వాటాలను విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో తర్వాత దేశంలో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న రెండవ ఈవీ టూవీలర్ తయారీదారుగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఏథర్ ఎనర్జీ కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ దాదాపు 2.5 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ టార్గెట్ చేస్తోందని వెల్లడైంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,753 కోట్లుగా నమోదు చేసింది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+