ఒక్క వార్తతో రూ.లక్షల కోట్లు మాయం.. కుప్పకూలిన AI దిగ్గజం Nvidia షేర్లు.. ఎంత భారీ పతనమంటే..

Nvidia Market Cap Crash: అంతర్జాతీయ సాంకేతిక రంగంలోనూ, స్టాక్ మార్కెట్లలోనూ తిరుగులేని శక్తిగా వెలిగిన ప్రముఖ ఏఐ (AI) చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA) తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అక్టోబర్‌లో రికార్డు స్థాయికి చేరినప్పటి నుండి కంపెనీ ఏకంగా 1.6 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఈ నష్టం సుమారు 4.06 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ వార్షిక స్థూల దేశీయోత్పత్తి (GDP)లో దాదాపు మూడింట ఒక వంతుకు సమానం కావటం గమనార్హం.

52 వారాల గరిష్ఠ స్థాయి వద్ద ఉన్నప్పుడు ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు $5.88 ట్రిలియన్లుగా ఉండగా.. నవంబర్ 9 ముగింపు నాటికి అది $4.31 ట్రిలియన్లకు పడిపోయింది. కేవలం ఒక నెల వ్యవధిలోనే కంపెనీ కోల్పోయిన ఈ $1.57 ట్రిలియన్ల విలువ, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మొత్తం మార్కెట్ విలువ ($1.49 ట్రిలియన్లు) కంటే ఎక్కువ కావడం విశేషం. 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన $243.37 నుండి 26 శాతానికి పైగా పడిపోవడంతో సాంకేతికంగా ఎన్విడియా షేర్లు బేర్-మార్కెట్ పరిధిలోకి ప్రవేశించాయి. నవంబర్ 9న ఈ స్టాక్ $178.67 వద్ద ముగిసింది.

Nvidia Market Value Loss Nvidia 1 6 Trillion Loss China Spy Row Jensen Huang Investigation Nvidia Stock Crash Nvidia Market Cap AI Stocks Selloff Nvidia Bear Market Nvidia Nvidia Nvidia 1 6 Nvidia AI Nvidia

ఏఐ రంగానికి కంపెనీలు చేస్తున్న వ్యయంపై అనుమానాలు, నియంత్రణ సంస్థల అనిశ్చితికి తోడు కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన పరిణామాలు ఈ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. మీడియా నివేదికల ప్రకారం.. చైనా ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఆలిస్ హువాంగ్ అనే మహిళ ప్రమేయంతో కూడిన విదేశీ గూఢచార ఆపరేషన్ హువాంగ్‌ను లక్ష్యంగా చేసుకుందనే వార్తలపై కంపెనీ బోర్డు స్వతంత్ర విచారణ ప్రారంభించింది. ఆలిస్ హువాంగ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ అంగీకరించినట్లు సమాచారం. అయితే, అమెరికా జాతీయ భద్రతకు లేదా కంపెనీ రహస్యాలకు భంగం వాటిల్లలేదని ఎన్విడియా బోర్డు స్పష్టం చేసింది.

Also Read

వివాదాలు ఉన్నప్పటికీ కంపెనీ ఆర్థిక ఫలితాలు బలంగానే ఉన్నాయని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఎన్విడియా 2027 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో $96.2 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేయగా.. ఇందులో డేటా సెంటర్ వ్యాపారం వాటానే $89 బిలియన్లుగా (92% పైగా) ఉంది. నవంబర్ 17న వెలువడనున్న మూడవ త్రైమాసిక ఆదాయాల ప్రకటనలో కంపెనీ $108 బిలియన్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది.

పెట్టుబడిదారులు సెంటిమెంట్ విక్రయాలకు, కంపెనీ వాస్తవ వ్యాపార మౌలిక వృద్ధికి ఉన్న తేడాను గుర్తించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికీ వాల్ స్ట్రీట్ విశ్లేషకులు ఈ స్టాక్‌పై బుల్లిష్‌గానే ఉన్నారు. సగటున 12 నెలల ధర లక్ష్యాన్ని $327.14గా నిర్దేశించడం భవిష్యత్తులో ఈ స్టాక్ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని సంకేతమిస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+