Nvidia షేర్ల పతనం మరో 2008 ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..

Nvidia Crash: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్ దిగ్గజం ఎన్విడియాలో తలెత్తిన ఆకస్మిక నాయకత్వ సంక్షోభం, స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్ల భారీ పతనం ప్రపంచ ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ సీఈఓ పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో సీఎఫ్‌ఓ కోలెట్ క్రెస్ తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు ఒక్కసారిగా పెరిగాయి. గురువారం మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి ఎన్విడియా షేర్లు 8.55 శాతం కుప్పకూలి 158.88 డాలర్లకు చేరుకున్నాయి.

ఏఐ ఎకోసిస్టమ్‌లో ఎన్విడియా పోషిస్తున్న కీలక పాత్ర.. క్లౌడ్-సర్వీస్ నిబద్ధతలు, భారీ ఆర్థిక హామీల కారణంగా ఆ సంస్థకు "AI సెంట్రల్ బ్యాంక్" అనే పేరు స్థిరపడింది. ఈ నేపథ్యంలో ఎన్విడియాలో తలెత్తిన సంక్షోభం 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులకు దారితీస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఎన్విడియా సంక్షోభం 2008 నాటి బ్యాంకింగ్ పతనం లాంటి విపత్తును సృష్టించే అవకాశం తక్కువని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Nvidia crash Nvidia financial crisis 2008 financial crisis AI bubble crash global financial crisis Nvidia stock crash AI investment risks financial contagion IMF financial stability warning Nvidia 400 billion commitments AI financing risks global market crash Nvidia Nvidia 2008 AI Nvidia AI IMF

ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC) మాజీ ఛైర్ షీలా బేర్ అభిప్రాయం ప్రకారం.. ఎన్విడియా ఆర్థిక నిర్మాణం సంప్రదాయ బ్యాంకుల కంటే పూర్తిగా భిన్నమైనది. ఆకస్మిక డిపాజిట్ ఉపసంహరణలు, ద్రవ్య సంక్షోభాలను ఎదుర్కొనే బ్యాంకుల మాదిరిగా కాకుండా, ఎన్విడియా వాణిజ్యపరంగా అత్యంత విలువైన హార్డ్‌వేర్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. దీనికి తోడు సంస్థకు ఉన్న బలమైన ఈక్విటీ ఆధారం ఆర్థిక ఒడిదుడుకుల నుండి రక్షణ కల్పిస్తుంది. అయినప్పటికీ ఎన్విడియా, ఇతర ఏఐ సంస్థలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను నియంత్రణ సంస్థలు నిశితంగా పర్యవేక్షించాలని, ఎన్విడియా పతనమైతే మార్కెట్లో పెను సంచలనమే అవుతుందని ఆమె హెచ్చరించారు.

Also Read

మరోవైపు ఏఐ మౌలిక సదుపాయాల సంస్థలతో ఎన్విడియా కుదుర్చుకున్న సుమారు 400 బిలియన్ డాలర్ల ఆర్థిక నిబద్ధతలు ఆందోళన కలిగిస్తున్నాయని కొలంబియా బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ స్టిజ్న్ వాన్ న్యూవెర్బర్గ్ పేర్కొన్నారు. వీటిలో 36 బిలియన్ డాలర్ల క్లౌడ్-సర్వీస్ కొనుగోళ్లు, ఓపెన్‌ఏఐ (OpenAI), ఎస్‌బీ ఎనర్జీతో కూడిన ఒహాయో డేటా-సెంటర్ ప్రాజెక్టుకు 105 బిలియన్ డాలర్ల షరతులతో కూడిన హామీ, అలాగే ఒక భారీ క్రెడిట్ కార్యక్రమం కోసం 125 బిలియన్ డాలర్ల బ్యాక్‌స్టాప్ ఉన్నాయి.

ఈ నిబద్ధతలన్నీ ఒకేసారి చెల్లించాల్సినవి కాకపోవడం.. పైగా సంస్థకు దాదాపు 3.9 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండటం కొంత రక్షణనిస్తుందని ఆయన వివరించారు. అయితే, ఏఐ కంపెనీలు, ఇన్వెస్టర్ల మధ్య పెరుగుతున్న రుణ పరపతి (Leverage), ప్రైవేట్-క్రెడిట్ రుణాలు ఆర్థిక వ్యవస్థలో అస్థిరతను పెంచవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అధికారి జాసన్ వూ హెచ్చరించారు.

ఇక 1993లో ఎన్విడియాను స్థాపించి, సాధారణ గేమింగ్ గ్రాఫిక్స్ చిప్ సంస్థను ప్రపంచ ఏఐ దిగ్గజంగా తీర్చిదిద్దిన 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్ 33 ఏళ్ల ప్రస్థానం వివాదాస్పద పరిస్థితుల్లో ముగింపు దశకు చేరుకుంది. ఎన్విడియా ఎగ్జిక్యూటివ్ కింబర్లీ పావెల్, మెగాస్పీడ్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌లతో వ్యక్తిగత సంబంధాల ఆరోపణలు, ప్రత్యేకించి చైనా గూఢచర్య సంస్థలతో ఆలిస్ హువాంగ్‌కు సంబంధాలున్నాయన్న అమెరికా నిఘా వర్గాల అనుమానాలు ఈ సంక్షోభానికి దారితీశాయి. హువాంగ్‌ను విదేశీ గూఢచర్య సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయా అన్న అంశంపై ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించగా.. చైనా మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా నిరాధారమైనవిగా తోసిపుచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+