NSE vs JIO: మార్కెట్‌లోకి రెండు భారీ ఐపీఓలు.. ఏది ఎక్కువ లాభదాయకం?
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టానికి తెర లేవబోతోంది. ఇన్వెస్టర్లు దాదాపు పదేళ్లుగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఐపీఓ ఒకవైపు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించిన జియో ప్లాట్‌ఫార్మ్స్ (Jio) ఐపీఓ మరొకవైపు.. కేవలం రెండు రోజుల వ్యవధిలో మార్కెట్ లోకి రావడానికి సిద్ధమయ్యాయి.
ఈ రెండు కూడా భారతదేశ ఆర్థిక రంగాన్ని, డిజిటల్ రంగాన్ని శాసిస్తున్న దిగ్గజాలు. మరి ఈ రెండింటిలో ఏ కంపెనీ సైజ్ ఎంత? వాటి లాభాలు ఎలా ఉన్నాయి? ఇన్వెస్టర్లు దేనిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? అనే విషయాలను క్లియర్ గా కంపేర్ చేసి చూద్దాం.

1. ఐపీఓ సైజ్ , వాల్యుయేషన్ (Size & Valuation)
మొదటిగా సైజ్ విషయానికి వస్తే, రెండూ కూడా దాదాపు ₹5 లక్షల కోట్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్‌తో మార్కెట్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
• NSE: అన్‌లిస్టెడ్ మార్కెట్ అంచనాల ప్రకారం ఎన్ఎస్ఈ ఐపీఓ విలువ దాదాపు ₹28,000 నుండి ₹30,000 కోట్ల వరకు ఉండవచ్చు. దీని మార్కెట్ విలువ (Valuation) దాదాపు $55-57 బిలియన్లు (సుమారు ₹5 లక్షల కోట్లు) ఉండవచ్చని అంచనా.
• Jio: జియో ఐపీఓ పరిమాణం దాదాపు $4 బిలియన్లు అంటే ₹34,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. గ్లోబల్ అనలిస్టుల ప్రకారం జియో కంపెనీ టోటల్ వాల్యుయేషన్ దాదాపు $65-70 బిలియన్ల వరకు ఉండొచ్చు. అంటే ఇష్యూ సైజ్ పరంగా జియో కాస్త పెద్దదిగా ఉండబోతోంది.
2. ఆఫర్ స్ట్రక్చర్: ఎవరు షేర్లు అమ్ముతున్నారు?
ఈ రెండు కంపెనీల IPO లలో చాలా ముఖ్యమైన తేడా ఉంది.
• NSE ఐపీఓ: ఇది పూర్తిగా 'ఆఫర్ ఫర్ సేల్' (OFS). అంటే కంపెనీకి కొత్తగా ఎలాంటి నిధులు రావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా, టెమాసెక్ వంటి పాత ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న షేర్లను (దాదాపు 6% ఈక్విటీ) అమ్ముకుని బయటకు వెళ్తున్నారు.
• Jio ఐపీఓ: ఇందులో పాత ఇన్వెస్టర్లు (మెటా, ఆల్ఫాబెట్, కేకేఆర్ వంటి వారు) తప్పుకోవడం లేదు. కంపెనీ అదనంగా కొత్త షేర్లను (Fresh Issue) జారీ చేసి, ప్రజల నుండి నేరుగా పెట్టుబడులను సేకరించబోతోంది. ఆ నిధులను బిజినెస్ గ్రోత్ కోసం వాడుకుంటారు.
లాభాలు వర్సెస్ గ్రోత్ (Profitability Vs Growth)
ఇన్వెస్టర్లుగా మనం ఈ రెండు కంపెనీలలో దేని బిజినెస్ మోడల్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి.
• NSE బిజినెస్: ఇండియాలో జరిగే షేర్ల ట్రేడింగ్‌లో ఎన్ఎస్ఈ దే ఏకఛత్రాధిపత్యం. ముఖ్యంగా డెరివేటివ్స్ (F&O) ట్రేడింగ్‌లో ఇది ప్రపంచంలోనే నంబర్ వన్. ఈ కంపెనీ లాభాల మార్జిన్ చాలా ఎక్కువ. ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో ఎన్ఎస్ఈ ఏకంగా ₹18,700 కోట్ల ఆదాయంతో, ₹10,300 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది ఒక స్థిరమైన, క్యాష్ రిచ్ బిజినెస్.
• Jio బిజినెస్: జియో కేవలం టెలికాం కంపెనీ మాత్రమే కాదు, అదొక డిజిటల్ సామ్రాజ్యం. 50 కోట్ల కంటే ఎక్కువ మంది కస్టమర్లతో దూసుకుపోతోంది. ఇన్వెస్టర్లు జియోలో కేవలం ప్రస్తుత లాభాలను మాత్రమే చూడటం లేదు; భవిష్యత్తులో రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్స్ , 5G బిజినెస్ గ్రోత్‌ను చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు.
మీ పోర్ట్‌ఫోలియోకు ఏది సెట్ అవుతుంది?
సింపుల్‌గా చెప్పాలంటే, ఎన్ఎస్ఈ అనేది ఇండియాలో పెరుగుతున్న స్టాక్ మార్కెట్ క్రేజ్, సిప్ (SIP) ఇన్వెస్ట్‌మెంట్లపై పెట్టే పెట్టుబడి. ఇది లాంగ్ టర్మ్‌లో స్థిరమైన రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు జియో అనేది భారతదేశ డిజిటల్ విప్లవం , భవిష్యత్తు టెక్నాలజీపై పెట్టే పెట్టుబడి.
లిస్టింగ్ గెయిన్స్ (షార్ట్ టర్మ్ లాభాలు) ఆశించే వారి కంటే, లాంగ్ టర్మ్ కోసం చూసే ఇన్వెస్టర్లకు ఈ రెండు IPO లు ఒక అద్భుతమైన అవకాశంగా నిలుస్తాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ రెండింటిలో మీ ఛాయిస్ ఏంటో ముందే ప్లాన్ చేసి పెట్టుకోండి!


Click it and Unblock the Notifications