10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఎండ్ కార్డ్.. రూ. 30,000 కోట్లతో దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ IPO!

భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికీ 'నిఫ్టీ 50' (Nifty) గురించి బాగా తెలుసు. రోజూ మార్కెట్ పెరిగిందా, తగ్గిందా అని చూసే కోట్లాది మంది ఇన్వెస్టర్ల వెనుక ఉండి నడిపించే ఒకే ఒక్క పవర్‌ఫుల్ సంస్థ.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE). గత పదేళ్లుగా ఎన్నో ఆటంకాలు, వివాదాలు, రెగ్యులేటరీ సమస్యల వల్ల వాయిదా పడుతూ వచ్చిన NSE IPO ఎట్టకేలకు వాస్తవరూపం దాల్చబోతోంది. ఈ వారంలోనే కంపెనీ తన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ను సెబీకి సమర్పించింది. దాదాపు రూ. 30,000 కోట్ల విలువతో రాబోతున్న ఈ ఇష్యూ.. భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓగా సరికొత్త రికార్డు సృష్టించబోతోంది.

NSE IPO DRHP Filing 30000 Crore Largest Initial Public Offering Indian Stock Market News

పదేళ్ల సుదీర్ఘ ప్రయాణం.. ఆ లేట్ వెనుక ఉన్న అసలు కథ!

నిజానికి ఎన్‌ఎస్ఈ తన ఐపీఓ ప్లాన్స్‌ను మొదట 2016 లోనే ప్రారంభించింది. కానీ అదే సమయంలో వచ్చిన 'కో-లోకేషన్' (Co-location) వివాదం, గవర్నెన్స్ లోపాలు, సుదీర్ఘ లీగల్ పోరాటాల వల్ల ఈ ప్రక్రియ అక్కడికక్కడే నిలిచిపోయింది. ఎన్‌ఎస్ఈ వేదికగా ఎన్నో కంపెనీలు, స్టార్టప్‌లు మార్కెట్లోకి వచ్చి వేల కోట్లు వసూలు చేస్తున్నా.. ఆ ప్లాట్‌ఫామ్ రన్ చేసే మెయిన్ కంపెనీ మాత్రం అన్‌లిస్టెడ్‌గానే మిగిలిపోయింది. ఎట్టకేలకు ఈ ఏడాది డ్రాఫ్ట్ పేపర్స్ ఫైల్ చేయడంతో, మార్కెట్ వర్గాల దశాబ్ద కాలపు నిరీక్షణ ముగిసింది.

ఊహించని ఫైనాన్షియల్ పవర్.. ప్రతి రూ. 100 లో రూ. 50 లాభమే!

ఫ్యూచర్‌లో లాభాలు వస్తాయనే నమ్మకంతో మార్కెట్లోకి వచ్చే మిగతా స్టార్టప్‌ల లాంటిది కాదు ఎన్‌ఎస్ఈ. ఇది ఆల్రెడీ కాసులు కురిపించే ఒక పెద్ద సామ్రాజ్యం. అన్‌లిస్టెడ్ మార్కెట్ (గ్రే మార్కెట్) ట్రెండ్ ప్రకారం.. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ వాల్యూయేషన్ దాదాపు రూ. 5 లక్షల కోట్ల మార్కు వద్ద ఉంది. అంటే దేశంలోనే మోస్ట్ వాల్యూయబుల్ కంపెనీల లిస్ట్‌లో ఇది నిలవబోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో (FY26) ఎన్‌ఎస్ఈ మొత్తం ఆదాయం రూ. 18,713 కోట్లు కాగా.. అందులో నికర లాభం అక్షరాలా రూ. 10,300 కోట్లకు పైనే ఉంది! అంటే కంపెనీ సంపాదించే ప్రతి 100 రూపాయల రెవెన్యూలో రూ. 50 కి పైగా నికర లాభం అన్నమాట. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఏ బిజినెస్‌లోనూ చూడలేం.

ఈ ఐపీఓ (IPO) లో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్!

ఈ మెగా ఐపీఓ ద్వారా ఎన్‌ఎస్ఈ కంపెనీ ఎలాంటి కొత్త నిధులను (Fresh Capital) సేకరించడం లేదు. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో వస్తోంది. అంటే కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్న పాత ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద సంస్థలు తమ దగ్గరున్న వాటాలను అమ్మి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోబోతున్నారు. పదేళ్లుగా హోల్డ్‌లో ఉన్న వాళ్లకు తమ పెట్టుబడులను క్యాష్ చేసుకోవడానికి ఇదొక సువర్ణావకాశం.

సాధారణంగా మార్కెట్‌లో ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరిగినా, కొత్త ఇన్వెస్టర్లు అకౌంట్లు ఓపెన్ చేసినా, డెరివేటివ్స్ క్రేజ్ పెరిగినా.. వీటన్నింటి వల్ల అల్టిమేట్‌గా లాభపడేది ఎన్‌ఎస్ఈ మాత్రమే. అందుకే ఈ కంపెనీ షేర్లను సొంతం చేసుకోవడం అంటే.. భారతదేశ ఆర్థిక రంగా ప్రగతిపై బెట్ కట్టడమే అని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. మూడు దశాబ్దాలుగా ఎన్నో కంపెనీలకు నిధులు సమకూర్చిన ఎన్‌ఎస్ఈ.. ఇప్పుడు అదే మార్కెట్ స్టేజ్ పైకి ఇన్వెస్టర్ల ముందుకు వస్తోంది. మరి దీని విలువను మార్కెట్ ఎలా డిసైడ్ చేస్తుందో చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+