Stock Market: శనివారం పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు.. ఫిబ్రవరి 1న NSE, BSE ఓపెన్ అందుకే..

Budget 2025: మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ క్రమంలో ప్రజలు కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్ల గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో శనివారం కూడా ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నట్లు కీలక ప్రకటన రావటంతో అందరి చూపు ఈ విషయంపైనే కొనసాగుతోంది. అసలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

వాస్తవానకి ప్రతి ఏటా ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో కేంద్రం తన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజు. అయితే ఈ సారి ఫిబ్రవరి 1 శనివారం రావటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి కుదరటం లేదు. బడ్జెట్‌ ప్రకటనల ప్రకారం పెట్టుబడులు తీసుకునే నిర్ణయాలు ఎకానమీ పరిస్థితులను ప్రతిబంబిస్తాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు ట్రేడింగ్ చేసుకోవటానికి స్టాక్ మార్కెట్లను ప్రత్యేకంగా పనిచేసే విధంగా కీలక నిర్ణయం రావటంతో అందరిలోనూ కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసే ప్రతి ప్రకటన ఆయా రంగాల్లోని కంపెనీల షేర్లపై ప్రభావాన్ని చూపటం ఏటా మనం చూస్తూనే ఉన్నాం.

NSE BSE to remain open on saturday February 1st 2025 amid Union Budget announcement

అందుకే ఈ సారి బడ్జెట్ ప్రసంగం రోజున నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బడ్జెట్ సమర్పించబే ఫిబ్రవరి 1, 2025న స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు తెరవబడతాయని ప్రకటించబడింది. గతంలో 2015, 2020 సమయాల్లో సైతం ఇలాంటి ప్రత్యేక ఏర్పాటు చేయబడిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం కారణంగా ఫిబ్రవరి 1 పూర్తి ట్రేడింగ్ డేగా కొనసాగుతుందని బీఎస్ఈ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అంటే ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30 వరకు ట్రేడింగ్ విండో తెరవబడుతుంది. అయితే ఆ రోజు "T0" ప్రాతిపదికన ఎటువంటి ట్రేడింగ్ జరగదని కూడా స్పష్టం చేసింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ఫిబ్రవరి 1, 2025న వరుసగా 8వ సారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ క్రమంలో దేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు, విధానాలు, కార్యక్రమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు ఇందులో ఉంటాయి. ఒక పక్క ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తూ ఉండగానే మరోపక్క దేశీయ స్టాక్ మార్కెట్లు దానికి అనుగుణంగా ప్రభావితం అవుతుంటాయి. ఇన్వెస్టర్లు ఏఏ రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించబడ్డాయో వాటిపై బెట్టింగ్ వేసేందుకు ఇష్టపడుతుంటారు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+