IPO News: గ్రేమార్కెట్లో దూసుకుపోతున్న ఐపీవో.. ఇష్యూ డిసెంబర్ 4న ఓపెనింగ్, బెట్ వేస్తున్నారా?

Nisus Finance Services IPO: దేశీయంగా ఐపీవో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ఇన్వెస్టర్లు డిసెంబర్ మాసం కోసం ఎదురుచూస్తున్నారు. స్టాక్ మార్కెట్లు ఊహించిన స్థాయిలో రాబడులను అందించటంలో విఫలం కావటంతో చాలా మంది ప్రస్తుతం ఐపీవోలపై బెట్ వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తగినట్లుగానే రానున్న నెలలో వరుస ఐపీవోలు మార్కెట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు క్యూ కడుతున్నాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నిసస్ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీ ఐపీవో గురించే. రిటైల్ పెట్టుబడిదారుల సబ్‌స్క్రిప్షన్ కోసం డిసెంబర్ 4న ఇష్యూ ప్రారంభం అవుతోంది. అయితే ప్రారంభానికి ముందే గ్రేమార్కెట్లో కంపెనీపై భారీగా బెట్టింగులు చేస్తున్నారు చాలా మంది ఇన్వెస్టర్లు. ఈ క్రమంలో ఐపీవో డిసెంబర్ 4 నుంచి 6 వరకు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి అందుబాటులో ఉండనుంది. ఇందుకోసం కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను రూ.170-180గా నిర్ణయించింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో బీఎస్ఈలో జాబితా అవ్వటానికి డిసెంబర్ 11 తేదీగా నిర్ణయించబడిందని సమాచారం.

Nisus Finance Services Having 50 GMP per share even before IPO issue started Know details

కంపెనీ ప్రస్తుతం పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని 800 షేర్లుగా నిర్ణయించింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొనేందుకు కనీసం రూ.1.44 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.114.24 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో రూ.101.62 కోట్ల తాజా ఇష్యూ ఉండగా దీనికోసం 56.46 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. అలాగే మిగిలిన రూ.12.61 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయానికి ఉంచబడిందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం తన ఐపీవోలో 50 శాతం వాటాను క్వాలిఫైడ్ ఇన్టిట్యూషనల్ బయ్యర్ల కోసం ఉందుబాటులో ఉంచగా.. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతాన్ని రిజర్వు చేసింది. మిగిలిన వాటాను హెచ్ఎన్ఐ క్లయింట్ల కోసం కేటాయించింది.

ప్రస్తుతం గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.50 ప్రీమియం పలుకుతోంది. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే పెట్టుబడిదారులు ఇష్యూ ధరపై దాదాపు 28 శాతం లాభాన్ని తొలిరోజే పొందుతారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కో షేరు ధర రూ.230 వద్ద జాబితా అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కంపెనీ వ్యాపారం
2013లో స్థాపించబడిన నిసస్ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ లావాదేవీల సలహా సేవలు, ఫండ్ అండ్ అసెట్ మేనేజ్‌మెంట్, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ డెట్, కార్పోరేట్ క్లయింట్‌లకు మూలధన పరిష్కారాలతో సహా అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. ఐపీవో ద్వారా సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ IFSC-GIFT సిటీ, DIFC-దుబాయ్, FSC-మారిషస్ వంటి కీలక ఆర్థిక కేంద్రాల్లో ఫండ్ సెటప్‌ను స్కేల్ అప్ చేయడానికి, అదనపు లైసెన్స్‌లను పొందేందుకు, సౌకర్యం-ఫండ్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగించాలని నిర్ణయించింది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+