Sensex-Nifty: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూస్తున్నాయి. గడచిన వారం రోజులుగా స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఈ క్రమంలో వరుస నష్టాలు దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను కుదేలు చేశాయి. ఇప్పుడు చాలా మందిలో ఉన్న అనుమానాలు ఏంటంటే ఇంకెన్నాళ్లు ఈ పతనం కొనసాగుతుంది అనేదే.
ఈ ఏడాది ప్రారంభం నుంచి సెప్టెంబర్ వరకు మార్కెచ్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఏకంగా 20 శాతం వరకు భారీ ర్యాలీని చూశాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు నుంచి మార్కెట్లలో తీవ్ర ఒడిదోడుకులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్లు ఇటీవలి కాలంలో 10 శాతం మేర కరెక్షన్ చూశాయి. వాస్తవానికి రెండవ త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఫలితాలు మార్కెట్లను ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఇదే క్రమంలో భారతదేశం నుంచి పక్కనే ఉన్న చైనా మార్కెట్లకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ డబ్బును తరలించటంతో మార్కెట్లు పతనాన్ని చూస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ విక్టరీతో డాలర్ సైతం భారీగా బలపడటం మార్కెట్లలో సెంటిమెంట్లను పూర్తిగా మార్చేశాయి.

గత నెల చివర్లో అంటే సెప్టెంబర్ 29న బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ తన గరిష్ఠ స్థాయి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 శాతం అంటే 8,553.44 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో మరో సూచీ నిఫ్టీ సైతం 10 శాతానికి పైగా కరెక్షన్ చూసింది. ఈ క్రమంలో కొందరు మార్కెట్ నిపుణులు మాత్రం ఓవర్ వాల్యుయేషన్లే దీనికి కారణంగా చెబుతున్నారు. 2024లో ఎఫ్పీఐలు భారత్ మార్కెట్ల నుంచి 2,413 మిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోగా.. తైవాన్ మార్కెట్ల నుంచి 14,122 మిలియన్ డాలర్లు, థాయ్లాండ్ మార్కెట్ల నుంచి 3,606 మిలియన్ డాలర్లు వెనక్కి తీసుకున్నారు. అయితే కొరియన్ మార్కెట్లో 5,965 మిలియన్ డాలర్లు, ఇండోనేషియాలో 2,025 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది.
ప్రస్తుతం విదేశీ ప్రైవేట్ ఇన్వెస్టర్ల మెుత్తం పెట్టుబడులు భారతీయ మార్కెట్లలో ఏకంగా 12 ఏళ్ల కనిష్ఠానికి దిగజారాయి. రానున్న కొద్దిరోజుల పాటు ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో మెుదటి 15 రోజుల కాలంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఏకంగా రూ.22,420 కోట్ల మేర అమ్మకాలు చేపట్టారు. అదే గతనెలలో వీరి అమ్మకాలు రూ.94,017 కోట్లుగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లలోని అనేక మంది బ్రోకరేజీలు సైతం కంపెనీల ఆర్థిక త్రైమాసిక ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే క్రమంలో అమెరికా 10 ఏళ్ల బాండ్స్ పనితీరు రానున్న కొద్ది రోజుల పాటు మార్కెట్లలో ఓలటాలిటీ కొనసాగుతుందనే సంకేతాలు ఇస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు.
ఒకపక్క భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండగా.. చైనా, హాంకాంగ్, అమెరికా మార్కెట్ సూచీలు మాత్రం భారీగా లాభపడుతున్నాయి. మ్యూట్ చేయబడిన H1FY25 ఫలితాలు FY25 నిఫ్టీ EPS అంచనాల్లో మరింత డౌన్‌గ్రేడ్‌ల పరిధిని పెంచాయని జియోజిత్ నాయర్ చెప్పారు. ఆర్థిక సంవత్సరంలో రెండవ అర్థభాగంలో మంచి వర్షాలు, గ్రామీణ డిమాండ్ పెరుగుదల రానున్న కాలంలో కంపెనీల వ్యాపారాలను పెంచుతాయని అవి మార్కెట్లలో కంపెనీల షేర్ల పెరుగుదలకు దోహదపడతాయని నిపుణులు భావిస్తున్నారు. వీటిని చూస్తుంటే భారతీయ స్టాక్ మార్కెట్లలో కొద్ది రోజుల పాటు ఒడిదొడుకులు ఉంటాయని తెలుస్తోంది. ఇన్వెస్టర్లు దీనిని చూసి ఆందోళన చెందకుండా దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుమతించాలని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications