Next Week IPO's: ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండండి.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
వచ్చే వారం మూడు మెయిన్ బోర్డ్ ఐపీఓలు రానున్నాయి. వీటిలో పర్పుల్ స్టైల్ ల్యాబ్స్, దీపా జ్యువెలర్స్, రేస్ ఆఫ్ బిలీఫ్ ఉన్నాయి. ఎస్ఎంఈ విభాగంలో అశుతోష్ ఫైబర్, శాంతి ఇనార్గానిక్స్, ఫైకెమ్ టెక్నాలజీస్, ఫార్మ్ పీస్ ఐపీఓలు ఉన్నాయి. వచ్చే వారం లిస్టింగ్ కానున్న వాటిలో ఆగ్మాంట్ ఎంటర్‌ప్రైజెస్, హై-టెక్ ఇంజనీర్స్, స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్, సింబయోటెక్ ఫార్మాల్యాబ్, అను ప్రాజెక్ట్స్, ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్, ఏబీహెచ్ హెల్త్‌కేర్, మధుర్ నిట్, సుమాక్స్ ఇంజనీరింగ్, క్విక్ ఫోరెన్సిక్ సొల్యూషన్స్, లుమినో ఇండస్ట్రీస్, ప్రయారిటీ జ్యువెల్స్, పలుక్ టెక్నాలజీస్, కంప్లీట్ స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఉన్నాయి.
పెర్నియాస్ పాప్-అప్ షాప్ ఆపరేటర్ అయిన పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ లిమిటెడ్ ఆగస్టు 31న తన రూ.680 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను ప్రారంభించనుంది. ఒక్కో షేరుకు రూ.546 నుంచి రూ.575 వరకు నిర్దేశించారు. ఈ ఇష్యూ సెప్టెంబర్ 2న ముగుస్తుంది. ఒక లాట్‌లో 26 షేర్లు ఉంటాయి. ఈ ఐపీఓ పూర్తిగా 1.18 కోట్ల షేర్ల తాజా జారీ ఉంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (OFS) లేదు. వచ్చిన డబ్బంతా కంపెనీకే వెళ్లనుంది. పెర్నియాస్ పాప్-అప్ షాప్ అనేది ఒక మల్టీ-బ్రాండ్ లగ్జరీ ఓమ్ని-ఛానల్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్. ఇది పెళ్లి, ప్రత్యేక సందర్భాల దుస్తులపై దృష్టి సారించి, పురుషుల, మహిళల, పిల్లల దుస్తులు, యాక్సెసరీలు, ఆభరణాల విభాగాలలో లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తులను అందిస్తుంది. ఇది తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్, 14 అనుభవ కేంద్రాల ద్వారా 1,300 మందికి పైగా డిజైనర్ల నుంతి 2 లక్షలకు పైగా ఉత్పత్తులను అందిస్తుంది.

దీపా జ్యువెలర్స్ ఐపీఓ సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఒక్కో షేరుకు రూ.168 నుంచి రూ. 177గా నిర్ణయించారు. దీపా జ్యువెలర్స్ ఐపీఓలో రూ.250 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లు, ప్రమోటర్లు ఆశిష్ అగర్వాల్, సీమా అగర్వాల్‌ల ద్వారా రూ.209.72 కోట్ల విలువైన 1.18 కోట్లకు పైగా ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉన్నాయి. ఈ తాజా ఇష్యూ ద్వారా వచ్చే నిధులను, ఇన్వెంటరీని సేకరించడం, నిర్వహించడం దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు వినియోగించనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 84 షేర్లకు బిడ్ వేయాల్సి ఉంటుంది. 2016లో స్థాపించబడిన దీపా జ్యువెలర్స్, హాల్‌మార్క్ గల బంగారు ఆభరణాలను డిజైన్ చేసే, ప్రాసెస్ చేసే మరియు సరఫరా చేసే ఒక వ్యవస్థీకృత B2B సంస్థ.
'మామ్స్ బిలీఫ్' బ్రాండ్‌ను నిర్వహిస్తున్న 'రేస్ ఆఫ్ బిలీఫ్ లిమిటెడ్'ఐపీఓ సెప్టెంబర్ 1 ప్రారంభమై సెప్టెంబర్ 3న ముగియనుంది. ఐపీఓలో ఒక్కో షేరుకు రూ.227 నుంచి రూ.239గా నిర్ణయించారు.ఈ ఐపీఓలో భాగంగా రూ.125 కోట్ల విలువైన 52.30 లక్షల ఈక్విటీ షేర్ల జారీ చేయనున్నారు. ఈ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను 319 కొత్త కేంద్రాలను స్థాపించడంతో సహా, కంపెనీ విస్తరణ ప్రణాళికలకు వినియోగించనున్నారు. థెరపీ-మెటీరియల్ ఇన్వెంటరీ, సెంటర్ ఫిట్-అవుట్‌లు, టెక్నాలజీ హార్డ్‌వేర్‌తో సహా మూలధన వ్యయాల కోసం కూడా ఈ డబ్బును ఉపయోగించనున్నారు. ఒక లాట్‌లో 62 షేర్లు ఉంటాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications