IPO's: ఇన్వెస్టర్లు డబ్బులు సిద్ధంగా ఉంచుకోండి.. వచ్చే రానున్న ఐదు ఐపీఓలు ఇవే..!
వచ్చే వారం ప్రైమరీ మార్కెట్ లోకి 5 ఐపీఓలు రానున్నాయి. స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్ సంస్థ ఎన్‌క్యూబ్ ఎథికల్స్, మెడికల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఇంటిగ్రిస్ మెడ్‌టెక్, ఫస్ట్‌క్రై మద్దతు ఉన్న స్వరా బేబీ ప్రొడక్ట్స్‌తో సహా ఐదు కంపెనీలు వచ్చే వారం తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల ద్వారా దాదాపు రూ. 5,700 కోట్లు సమీకరించడానికి సిద్ధమయ్యాయి. మాతంగి రబ్బర్ ఐపీఓ డిసెంబర్ 1న ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 2న మోనోమార్క్ ఇంజనీరింగ్, స్వరా బేబీ ప్రొడక్ట్స్ ఐపీఓలు ప్రారంభం కానున్నాయి. ఎన్‌క్యూబ్ ఎథికల్స్ తన పబ్లిక్ ఇష్యూను డిసెంబర్ 3న ప్రారంభించనుండగా, ఇంటిగ్రిస్ మెడ్‌టెక్ ఐపీఓ డిసెంబర్ 4న ప్రారంభమవుతుంది.
ముంబైకి చెందిన ఎన్‌క్యూబ్ ఎథికల్స్, రూ. 2,800 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల శ్రేణిలో తన ఐపీఓను ప్రారంభించనుందని బ్యాంకర్లు చెప్పారు. కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం దాని ప్రమోటర్, ప్రస్తుత వాటాదారుల ద్వారా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో ఈ తొలి పబ్లిక్ ఆఫర్ ఉండనుంది. ఈ ఇష్యూ డిసెంబర్ 7న ముగియనుంది. ఈ ఐపీఓ పూర్తిగా ఆపర్ ఫర్ సేల్ రూపంలో ఉన్నందున, ఎన్‌క్యూబ్ ఎథికల్స్కు కంపెనీ ఎలాంటి డబ్బులు రావు. ఎవర్‌స్టోన్ క్యాపిటల్ మద్దతు ఉన్న వైవిధ్యభరితమైన మెడికల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అయిన ఇంటిగ్రిస్ మెడ్‌టెక్ తన ఐపీఓ ద్వారా రూ. 1,600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.

ఆర్‌హెచ్‌పీ ప్రకారం ఈ ఇష్యూలో రూ. 600 కోట్ల విలువైన ఫ్రెష్ ఇష్యూ షేర్లతో పాటు, 1.08 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంటుంది. ట్రాన్స్‌లూమినా థెరప్యూటిక్స్, ట్రాన్స్హెల్త్, సిపిసి డయాగ్నోస్టిక్స్, కెమోఫార్మ్, రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్స్తో సహా, దాని పూర్తి యాజమాన్యంలోని, స్టెప్-డౌన్ అనుబంధ సంస్థలన్నింటిలో రుణాలను తిరిగి చెల్లించడానికి లేదా ముందస్తుగా చెల్లించడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఫస్ట్‌క్రై మద్దతు ఉన్న, బేబీ డైపర్లు, పెద్దల డైపర్లు, స్త్రీల పరిశుభ్రత ఉత్పత్తులను కాంట్రాక్ట్ పద్ధతిలో తయారు చేసే 'స్వరా బేబీ ప్రొడక్ట్స్' ఐపీఓ ద్వారా రూ. 800 కోట్లు సమీకరించనుంది.
ఈ కంపెన ఒక్కో షేరుకు రూ. 105-111 నిర్ణయించింది. ఈ ఇష్యూలో రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ, రూ. 300 కోట్ల వరకు ఓఎఫ్ఎస్ (OFS) ఉంటాయి. ఈ ధరల శ్రేణి గరిష్ట స్థాయిలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మోనోమార్క్ ఇంజనీరింగ్ ఐపీఓ ద్వారా రూ. 175.5 కోట్లు సేకరించనుంది. ఐపీఓలో ఒక్కో షేరుకు రూ. 60-65 గా నిర్ణయించారు. ఈ ఇష్యూలో ఓఎఫ్ఎస్ భాగం లేకుండా, 2.70 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ ఉంటుంది. మాతంగి రబ్బర్ ఐపీఓ ద్వారా రూ. 125.2 కోట్లు సేకరించనుంది. ఒక్కో షేరు ధర రూ. 163-172 గా నిర్ణయించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications