Next Week IPO's: వచ్చే వారం ఐపీఓల జాతర.. ఇన్వెస్టర్లు సిద్దంగా ఉన్నారా..!
వచ్చే వారం రెంటోమోజో, కరమ్తారా ఇంజనీరింగ్, కనోహర్ ఎలక్ట్రికల్స్‌తో పాటు 11 ప్రధాన బోర్డు కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ల (IPOలు) ద్వారా రూ. 7,055 కోట్లు సమీకరించనున్నాయి. ఈ ఐపీఓలు సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ప్రారంభం కానున్నాయి. వీటిలో చాలా ఇష్యూలు మంగళవారం, బుధవారాల్లో సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న కంపెనీలు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్, ఇంజనీరింగ్, తయారీ, చెల్లింపులు, గుర్తింపు పరిష్కారాలు, ప్రత్యేక రసాయనాలు, ఆన్‌లైన్ అద్దె సేవల రంగాలకు చెందినవి. మొత్తం రూ. 7,055 కోట్లలో, రూ. 2,722 కోట్లు (39 శాతం) ప్రాథమిక మూలధన జారీ రూపంలో ఉన్నాయి, దీని ద్వారా వచ్చే ఆదాయం నేరుగా కంపెనీలకు వెళ్లనుంది.
రూ. 4,333 కోట్లు (61 శాతం) ఆఫర్ ఫర్ సేల్ గా ఉండనుంది. ఈ కొత్త ఇష్యూల ద్వారా వచ్చే నిధులను ప్రధానంగా వ్యాపార విస్తరణ, మూలధన వ్యయం, రుణ చెల్లింపు, నిర్వహణ మూలధన అవసరాలు, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ఐపీఓ సెప్టెంబర్ 7న ప్రారంభం అయి సెప్టెంబర్ 9న ముగుస్తుంది. ఐపీఓ ద్వారా రూ. 351 కోట్లకు పైగా సమీకరించనుంది. ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ఒక్కో షేరుకు రూ. 118-124 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇందులో రూ. 315.6 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీ చేయనుండగా.. రూ. 35.43 కోట్ల విలువైన 28.57 లక్షల షేర్ల ఆఫర్-ఫర్-సేల్ ఉన్నాయి.

ఆ తర్వాత సెప్టెంబర్ 8న మనోహర్ ఎలక్ట్రికల్స్ , ప్రసోల్ కెమికల్స్, గ్లాస్ వాల్ సిస్టమ్స్ (ఇండియా), తమ ఐపీఓలను ప్రారంభిస్తాయి. రెంటోమోజో , మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ , ఆర్సిల్ , ఎల్‌సిసి ప్రాజెక్ట్స్ , కరమ్‌తార ఇంజనీరింగ్, స్టీమ్‌హౌస్ ఇండియా సెప్టెంబర్ 9న తమ ఇష్యూలను ప్రారంభించనున్నాయి. మనోహర్ ఎలక్ట్రికల్స్ తన రూ. 1,056 కోట్ల ఇష్యూ కోసం ఒక్కో షేరుకు రూ. 601-632 ధరల శ్రేణిని ఖరారు చేసింది. ప్రసోల్ కెమికల్స్ తన రూ. 500 కోట్ల ఐపీఓ కోసం ఒక్కో షేరుకు రూ. 643-676 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇందులో రూ. 80 కోట్ల కొత్త షేర్ల జారీ, రూ. 420 కోట్ల వరకు విలువైన OFS ఉన్నాయి. గ్లాస్ వాల్ సిస్టమ్స్ (ఇండియా) తన రూ. 428 కోట్ల ఇష్యూ కోసం ఒక్కో షేరుకు రూ. 172-182 ధరల శ్రేణిని నిర్ణయించింది. రెంటోమోజో తన రూ. 1,256 కోట్ల ఐపీఓ కోసం ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 384-404 ధరల శ్రేణిని ఖరారు చేసింది. ఇందులో రూ. 150 కోట్ల వరకు కొత్త షేర్ల జారీ, 1,106 కోట్లు OFS ఉన్నాయి.
కరమ్‌తార ఇంజనీరింగ్ 875 కోట్ల ఐపీఓలో రూ. 675 కోట్ల కొత్త షేర్ల జారీ, రూ. 200 కోట్ల వరకు విలువైన OFS ఉన్నాయి. దీనికి ఒక్కో షేరుకు రూ. 241-254 ధరల శ్రేణి నిర్ణయించారు. మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ తన రూ. 805 కోట్ల ఇష్యూ కోసం ఒక్కో షేరుకు రూ. 322-339 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇందులో రూ. 320 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, రూ. 485 కోట్ల విలువైన 1.43 కోట్ల షేర్ల వరకు ఓఎఫ్‌ఎస్ (OFS) ఉన్నాయి. ఆర్సిల్ యొక్క రూ. 733 కోట్ల ఐపీఓ, ఒక్కో షేరుకు రూ. 132-139 ధరతో, పూర్తిగా ఓఎఫ్‌ఎస్ రూపంలో ఉంది. వీగాలాండ్ డెవలపర్స్ ఐపీఓ సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
